
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A25 5G. ఈ ఆర్టికల్ లో Samsung Galaxy A15 5G డివైజ్ గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5-ఇంచ్ భారీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 5G ధర, కలర్ ఆప్షన్స్
- Samsung Galaxy A15 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,499 గా నిర్ణయించారు.
- Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,499 గా ఉంది.
- Samsung Galaxy A15 5G డివైజ్ బ్లూ బ్లాక్, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
రూ.20,000 లోపు బడ్జెట్ లో శాంసంగ్ 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారుే ఈ Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్‌ని ప్రయత్నించవచ్చు.











