
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తన గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ Samsung Galaxy A15 ధరను తగ్గించింది. ప్రస్తుతం రూ.2,500 తక్కువకే ఈ ఫోన్‌ని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రైస్ కట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి, Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?
Samsung Galaxy A15 ధర తగ్గింపు వివరాలు
Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యొక్క అన్ని మోడల్స్ పై రూ.2,500 వరకు ధరను కంపెనీ తగ్గించింది.
6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ కొత్త ధర రూ.15,499 గా ఉంది. 8జిబి + 128జిబి మిడ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.
లాంచ్ సమయంలో బేస్ మోడల్ ధర రూ.17,999, మిడ్ మోడల్ ధర రూ.19,499, టాప్ మోడల్ ధర రూ.22,499 గా ఉండేవి.
ధర తగ్గింపు మాత్రమే కాదు, ఇంకా ఈఎంఐ మరియు ఎక్స్చేంజ్ బోనస్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లూ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
ధర తగ్గింపు కావాలంటే, Samsung Galaxy A15 డివైజ్‌ను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ మరియు శాంసంగ్ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్‌ని ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కొనుగోలు చేయవచ్చు. కాకపోతే, ఇక్కడ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఇన్ఫినిటీ యు నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A15 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy A15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ఓఎస్: Samsung Galaxy A15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ: Samsung Galaxy A15 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.











