
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఏ-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A25 5G గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A25 5G స్మార్ట్ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8జిబి ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A25 5G ధర, కలర్ ఆప్షన్స్
- Samsung Galaxy A25 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఓసారి రెండు స్టోరేజీ వేరియంట్స్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.26,999 గా నిర్ణయించారు.
- Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ ఫీచర్ అందించారు.
- ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G డివైజ్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











