
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లో విడుదల కానున్నాయి. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. రెండు ఫోన్లు కూడా 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్ తో రాబోతున్నాయని లీకైన స్పెసిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A16 5G, Galaxy A16 4G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A16 5G మరియు Galaxy A16 4G డివైజెస్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంటుంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. Samsung Galaxy A16 4G లో ఉండే చిప్సెట్ పేరు ఇంకా తెలియదు. త్వరలోనే ఈ వివరాలు తెలుస్తాయి.
మెమొరీ: Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G స్మార్ట్‌ఫోన్లు రెండు కూడా 4జిబి ర్యామ్ తో రానున్నాయి. అయితే 6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్లు 128జిబి స్టోరేజీతో రానున్నాయి. 4జీ వేరియంట్ 1టిబి మెమొరీ కార్డ్, 5జీ వేరియంట్ 1.5టిబి మెమొరీ కార్డ్ కి సపోర్ట్ చేస్తాయి.
కెమెరా: Samsung Galaxy A16 4G మరియు Samsung Galaxy A16 5G వేరియంట్స్ లో 50ఎంపి మెయిన్ కెమెరా 5ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: ఈ రెండు ఫోన్లు కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నాయి. ఈ ఫోన్లు 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G మరియు Samsung Galaxy A16 4G డివైజెస్ లో బ్లూటూత్ 5.3, వై-ఫై 5 గిగాహెర్ట్జ్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ54 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ల యొక్క బరువు 200 గ్రాములు ఉంటుందని సమాచారం.











