
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో ఓ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో మార్కెట్ లోకి వచ్చిన ఈ డివైజ్ ప్రస్తుతం రూ.2,000 తక్కువకే లభిస్తోంది. ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర తగ్గింపు వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy M55s 5G పై రూ.2,000 తగ్గింపు
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ వేదిక అమెజాన్‌పై రూ.2,000 తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తోంది. Amazon Great Indian Festival లో ఈ రెండు వేరియంట్స్ పై రెండు వేల రూపాయలు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పొందేందుకు బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు అవసరం లేదు. ఈ తగ్గింపు అందరికీ వర్తిస్తుంది.
Samsung Galaxy M55s 5G ధర
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,999 ధరతో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.22,999 ధరతో వచ్చింది. అమెజాన్ సేల్‌లో ఈ రెండింటిపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో వీటిని, రూ.17,999 మరియు రూ.20,999 ధరలకి సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ కూపన్ డిస్కౌంట్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందో తెలియదు. ప్రస్తుతం అయితే ఈ డిస్కౌంట్ పొందవచ్చు. పూర్తి వివరాలకై ఈ లింక్ పై క్లిక్ చేయండి.
| శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 ఎస్ | లాంచ్ ధర | డిస్కౌంట్ కూపన్ | ఆఫర్ ధర |
| 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ | రూ.19,999 | రూ.2,000 | రూ.17,999 |
| 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ | రూ.22,999 | రూ.2,000 | రూ.20,999 |
Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్+ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. విజన్ బూస్టర్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
చిప్సెట్: Samsung Galaxy M55s 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ అందించారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్ గా ఉంది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.
కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











