డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G, Galaxy A15 5G..?

Highlights

  • ఇప్పటికే గ్లోబల్‌గా లాంచైన Galaxy A25 5G, A15 5G
  • డిసెంబర్ 26న భారత్‌లో లాంచ్ అవుతాయని అంచనా
  • ఫోన్ల ధరలు రూ.25,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్లు వియత్నాంలో లాంచ్ అయ్యాయి. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. అయితే TheTechOutlook వెబ్‌సైట్ తన కథనం ద్వారా Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజెస్ భారతదేశంలో డిసెంబర్ 26 న లాంచ్ అవుతాయని తెలిపింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G ఇండియా లాంచ్ తేదీ

Samsung Galaxy A25 5G, Samsung Galaxy A15 5G డివైజ్ భారత్ లో డిసెంబర్ 26 వ తేదీన లాంచ్ కానున్నాయని ఒక టిప్‌స్టర్ రివీల్ చేశారు. అయితే కాస్ట్ కట్టింగ్ లో భాగంగా శాంసంగ్ భారత్ లో ఈ ఫోన్లను ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ లేకుండా తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ డివైజెస్ ధరలు రూ.25,000 లోపు ఉంటాయని సమాచారం. ఇక Samsung Galaxy A25 5G డివైజ్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
  • కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఆప్సన్స్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A15 5G మరియు 4G మోడల్స్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ యు డిస్ప్లే, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. మరోవైపు Samsung Galaxy A15 4G మోడల్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A15 5G, 4జీ వేరియంట్స్ 8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తాయి. స్టోరేజీ విషయానికి వస్తే, Samsung Galaxy A15 5G డివైజ్ 256జిబి స్టోరేజీ తో వచ్చింది. 4జీ మోడల్ 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A15 5G, 4జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు శాంసంగ్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.