
Samsung Galaxy A34 5G, Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్లు నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. భారత మార్కెట్ లాంచ్ తేదీ మార్చి 16 కి ఒక్క రోజు ముందు అనగా, నేడు ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించాయి. Samsung Galaxy A34 5G 48ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి Samsung Galaxy A54 5G గురించి తెలుసుకోండి.
Samsung Galaxy A34 5G గ్లోబల్ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్
Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ ధర 349 యూరోలు (సుమారు రూ.34,863) తో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వయొలెట్, ఆసమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. భారత మార్కెట్ ధరలు రేపు (మార్చి 16) రివీల్ అవుతాయి.
Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్
- 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
- 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
- 13ఎంపి సెల్ఫీ కెమెరా
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 78.1 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











