120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A54 5G

Highlights

  • Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని అఫీషియల్ గా అన్‌వీల్ చేసిన కంపెనీ
  • రేపు భారత్ లో లాంచ్ కాబోతున్న Samsung Galaxy A34 5G, A54 5G స్మార్ట్ ఫోన్స్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5జీ కనెక్టివిటీతో వచ్చిన Samsung Galaxy A54 5G

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు నేడు గ్లోబల్ గా Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు ఇవే. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరాతో Samsung Galaxy A54 5G గ్లోబల్ గా లాంచైంది.

భారత్ లో Samsung Galaxy A34 5G, A54 5G స్మార్ట్ ఫోన్స్ రేపు, అనగా మార్చి 16 న లాంచ్ అవుతున్నాయి. రేపు భారత మార్కెట్ లో ఈ ఫోన్ల ధరలు, సేల్ తేదీ, లభ్యత తదితర వివరాలు వెల్లడి కానున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A54 5G గ్లోబల్ లాంచ్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A54 5G గ్లోబల్ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Samsung Galaxy A54 5G ధర 449 యూరోలు (సుమారు రూ.44,853) తో ప్రారంభమవుతుంది. యూరప్ మరియు దక్షిణాసియా మార్కెట్స్ లో ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ మార్చి 16 న లాంచ్ కానుంది. అదే రోజున సేల్ వివరాలు తెలుస్తాయి. Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్

  • 6.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy A54 5G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మెమొరీని మైక్రెఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.