
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. మరోవైపు, Galaxy A55 5G కూడా జీసీఎఫ్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు కూడా త్వరలోనే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.
Samsung Galaxy A35 బ్లూటూత్ ఎస్ఐజీ, జీసీఎఫ్ లిస్టింగ్
- Samsung Galaxy A35 5G డివైజ్ SM-A356U మరియు SM-356B అనే మోడల్ నంబర్లతో బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.
- Samsung Galaxy A35 5G డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy A35 5G డివైజ్ జీసీఎఫ్ వెబ్ సైట్ పై SM-A356E మరియు SM-A356E/DS అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
- ఇక Samsung Galaxy A55 5G గురించి మాట్లాడితే జీసీఎఫ్ లిస్టింగ్ పై SM-A556B/DS, SM-A56F/DS మరియు SM-A556F అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
- ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.











