
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo V40 SE 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు డివైజ్ పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో కనిపిస్తోంది. తాజాగా Vivo V40 SE 5G డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. జీసీఎఫ్ లిస్టింగ్ ద్వారా Vivo V40 SE 5G డివైజ్ 5జీ కనెక్టివిటీ, 5జీ బ్యాండ్స్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo V40 SE 5G జీసీఎఫ్ లిస్టింగ్
- Vivo V40 SE 5G స్మార్ట్‌ఫోన్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- రిపోర్ట్ ప్రకారం, Vivo V40 SE 5G స్మార్ట్‌ఫోన్ 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- Vivo V40 SE 5G యొక్క 5జీ బ్యాండ్స్: ఎన్1, ఎన్2, ఎన్3, ఎన్5, ఎన్8, ఎన్20, ఎన్38, ఎన్40, ఎన్41, ఎన్66, ఎన్77, ఎన్78.
- Vivo V40 SE 5G డివైజ్ వివిధ మార్కెట్స్ లో Vivo V40 Lite అనే పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
- గతేడాది లాంచైన Vivo V30 Lite కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా Vivo V40 SE 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.
Vivo V30 Lite 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 Lite 5G లో 6.67-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ ఈ4 స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2400 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo V30 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Lite 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Vivo V30 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Vivo V30 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఆరా రింగ్-ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Vivo V30 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V30 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 5GHz వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- సెక్యూరిటీ: Vivo V30 Lite 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Vivo V30 Lite 5G డివైజ్ 162.35 మి.మీ పొడవు, 74.85 మి.మీ వెడల్పు, 7.69 మి.మీ మందం మరియు 190 గ్రాముల బరువు ఉంటుంది.












