
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 11న భారత్ లో Samsung Galaxy A35 5G మరియు Galaxy A55 ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే టిప్‌స్టర్స్ ద్వారా లీకైంది. ఇకపోతే, Samsung Galaxy A35 5G డివైజ్ 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1650 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఫ్రంట్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
- ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.












