iQOO: లాంచ్‌కి ముందు లీకైన iQOO Z9 5G ధర

Highlights

  • మార్చి 12న iQOO Z9 5G లాంచ్
  • లీకైన iQOO Z9 5G ధర
  • డివైజ్ ప్రారంభ ధర రూ.17,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి iQOO Z9 5G ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 12న ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు iQOO Z9 5G భారత మార్కెట్ ధర లీక్ అయ్యింది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ ఫోన్ ధర వివరాలను షేర్ చేశారు. టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా డివైజ్ యొక్క మెమొరీ వేరియంట్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9 5G ధర (లీక్)

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు.

iQOO Z9 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

డివైజ్ కొనుగోలుపై ఐసీఐసీఐ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ కి రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్లు వరుసగా రూ.17,999 మరియు రూ.19,999 ధరలకు లభించనున్నాయి.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Z9 5G లో పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. iQOO Z9 5G అంటుటు స్కోర్ 7,34,924 గా ఉంది.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ సెన్సర్, సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.
Previous articleSamsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 5G ఫోటోస్, స్పెసిఫికేషన్స్
Next articleInfinix: గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌పై లిస్టైన Note 40 Pro 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.