
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. తాజాగా Galaxy A55, A35 మరియు C55 ఫోన్లు కొరియాకు చెందిన NRRA వెబ్సైట్ పై లిస్ట్ అయ్యాయి. మరో లీక్ ద్వారా Galaxy A55, A35 డివైజెస్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ యొక్క లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి గెలాక్సీ ఏ55, ఏ35, సీ55 ఫోన్ల యొక్క లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A55, Galaxy A35 రెండర్స్ (లీక్)
— Evan Blass (@evleaks) February 8, 2024
- ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా వేదిక X పై Galaxy A55, A35 డివైజెస్ యొక్క రెండర్స్ షేర్ చేశారు.
- రెండర్స్ ని గమనిస్తే, మూడు రంగుల్లో ఈ ఫోన్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
- డిజైన్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా దాదాపు ఒకే విధమైన డిజైన్ లాంగ్వేజీ కలిగి ఉన్నాయి. పంచ్-హోల్ కటౌట్ కనిపిస్తోంది.
- రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కాస్త ఉబికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.
- ఏ35 ప్లాస్టిక్ బాడీతో వస్తుండగా, గెలాక్సీ ఏ55 మెటల్ బాడీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
- రెండు ఫోన్లు ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు తెలుస్తోంది.
Samsung Galaxy A35, A55 కొరియన్ ఎన్ఆర్ఆర్ఏ లిస్టింగ్
- కొరియాకు చెందిన NRRA సర్టిఫికేషన్ పై Galaxy A35 SM-A356N అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- మరోవైపు, Galaxy A55 SM-A5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy A55 5G, C55/Y55 5G సీఎంఐఐటీ లిస్టింగ్
- సీఎంఐఐటీ లిస్టింగ్ పై Samsung Galaxy A55 5G డివైజ్ SM-A5560 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఇదే లిస్టింగ్ పై Samsung Galaxy C55/Y55 5G డివైజ్ SM-C5560 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. రెండు మోడల్స్ కూడా 5జీ నెట్వర్క్ తో వస్తున్నాయి.
- గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై స్టిక్కర్ ని గమనిస్తే, 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ అని ఉంది.
- ఈ ఫోన్ బాక్సీ ఛాసిస్ కలిగి ఉంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి.
- బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ నిలువుగా ఉంది. పక్కనే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది.
- మరోవైపు Galaxy C55/Y55 డిజైన్ కూడా ఏ55 మాదిరే కనిపిస్తోంది. కానీ, రౌండెడ్ ఛాసిస్ కనిపిస్తోంది. శాంసంగ్ సంస్థ త్వరలో సీ మరియు వై సిరీస్ లను లాంచ్ చేసే అవకాశం ఉంది.











