Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్!

Highlights

  • భారత్‌లో రూ.869 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Airtel
  • 2జిబి డెయిటీ డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో ప్రయోజనాలు
  • ఎయిర్టెల్ అధికార వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో రూ.869 ప్లాన్

ప్రముఖ టెలీకామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ని తన యూజర్ల కోసం లాంచ్ చేసింది. రూ.869 విలువజేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney+ Hotstar (మొబైల్) 3 నెలల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ కి స్వల్ప మార్పులు చేసి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎయిర్టెల్ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా Airtel రూ.869 ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్) 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5జీ డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • డేటా పరిమితి అనంతరం, ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది.
  • ఎయిర్టెల్ యొక్క అధికార వెబ్‌సైట్ లో రూ.869 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

Airtel రూ.839 ప్లాన్ ప్రయోజనాలు

  • ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
  • ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్లాన్ ద్వారా కస్టమర్లకు డెయిలీ 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • రూ.839 ప్లాన్ ద్వారా ఇంకా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇటీవలె ఎయిర్టెల్ సంస్థ రూ.1,499 ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు డెయిలీ 3జిబి 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. 5జీ ప్లాన్ లో కస్టమర్ కి నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ప్రయోజనం లభిస్తుంది.
  • ఇక Netflix బేసిక్ ప్లాన్ ద్వారా కస్టమర్ ఏకకాలంలో ఒక డివైజ్ లో మాత్రమే కంటెంట్ ని ఎంజాయ్ చేయవచ్చు.
  • ఇంకా 720 పిక్సెల్ నాణ్యత తో వీడియో కంటెంట్ ని చూడవచ్చు. యూజర్ తన నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ని స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు, టీవీలు, ట్యాబ్లెట్స్ వంటి డివైజెస్ పై యాక్సెస్ చేయవచ్చు.
  • ఇంకా రూ.1,499 ప్లాన్ ద్వారా యూజర్లకు ఉచిత ఎయిర్టెల్ హలో ట్యూన్స్ లభిస్తాయి.