డిసెంబర్ 4 న చైనాలో లాంచ్ కానున్న OnePlus 12

Highlights

  • డిసెంబర్ 4 న చైనాలో లాంచ్ కానున్న OnePlus 12
  • ఇంకా వెల్లడవ్వని ఇండియా లాంచ్ తేదీ
  • 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోన్న OnePlus 12

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus 12 డివైజ్ ని లాంచ్ చేయనుంది. డిసెంబర్ 4 వ తేదీన OnePlus 12 స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో ద్వారా వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 యొక్క లాంచ్ తేదీని షేర్ చేసింది. OnePlus 12 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో వస్తోంది.

OnePlus 12 లాంచ్ తేదీ

  • OnePlus సంస్థ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో ద్వారా OnePlus 12 లాంచ్ తేదీని రివీల్ చేసింది.
  • OnePlus 12 స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 4 వ తేదీన లాంచ్ అవుతోంది.
  • డిసెంబర్ 4 న వన్‌ప్లస్ 10వ వార్షికోత్సవ సమావేశం జరగనుందని వన్‌ప్లస్ సంస్థ ప్రకటించింది.
  • వన్‌ప్లస్ 10 వ యానివర్శరీ సెలబ్రేషన్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.
  • OnePlus సంస్థ డివైజ్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను కూడా షేర్ చేసింది.
  • OnePlus 12 డివైజ్ ప్రోఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 2,600 నిట్స్ బ్రైట్నెస్, డిస్ప్లేమేట్ ఏ+ సర్టిఫికేషన్ తో వస్తోందని కంపెనీ వెల్లడించింది.
  • OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 తో వస్తోంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ బీఓఈ ఎక్స్1 ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12 లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus 12 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.
  • కెమెరా: OnePlus 12 లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ ఎల్‌వైటీ808 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 64ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • కనెక్టివిటీ: OnePlus 12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
Previous articleజనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం
Next article3C సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A55; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.