Home News బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy F14, Galaxy M14, Galaxy 05s; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy F14, Galaxy M14, Galaxy 05s; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న 3 శాంసంగ్ ఫోన్లు
  • బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన హ్యాండ్సెట్స్
  • లిస్టింగ్ ద్వారా రివీల్ కాని స్పెసిఫికేషన్స్

Samsung Galaxy F14, Galaxy M14, Galaxy A05s స్మార్ట్ ఫోన్లను త్వరలోనే లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేసింది. తాజాగా ఈ 3 ఫోన్లు తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందాయి. అంతకు ముందే ఈ ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. 91మొబైల్స్ మొదటగా ఈ ఫోన్లను బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై గుర్తించింది. మూడు ఫోన్లు వరుసగా SM-A057F/DS, SM-M145F/DS, SM-E145F/DS అనే మోడల్ నంబర్లను కలిగి ఉన్నాయి.

Samsung Galaxy F14, Galaxy M14, Galaxy A05s బీఐఎస్ వివరాలు

ఇదిలా ఉండగా, శాంసంగ్ ఇటీవలె గెలాక్సీ ఎఫ్34 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.20,000 లోపు ధరతో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, ఎగ్జినోస్ 1280 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ లో ఇంకా 6.46-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 13ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.18,999 గా ఉంది. హై-ఎండ్ వర్షన్ ధర రూ.20,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిల్ కార్డ్స్ పై కంపెనీ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే రూ.1000 క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ డిస్కౌంట్ మరియు రూ.2,000 వరకు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ నాన్-ఈఎంఐ, క్రెడిట్, డెబిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై డిస్కౌంట్ లభించనుంది.