
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ గత నెలలో భారతీయ మార్కెట్ లో Realme 11 Pro, Realme 11 Pro+ డివైజెస్ ని లాంచ్ చేసింది. తర్వాత గ్లోబల్ గా Realme 11 5G ని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ, ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు, 91మొబైల్స్ కి Realme 11 5G కి సంబంధించిన కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వేరియంట్స్ వివరాలు తెలిసాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సమాచారం అందింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
లీకైన Realme 11 5G స్టోరేజీ, కలర్ ఆప్షన్స్
- మాకు అందిన సమాచారం ప్రకారం, Realme 11 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది.
- టాప్ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- Realme 11 5G డివైజ్ గ్లోరీ గోల్డ్ మరియు గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme 11 5G లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
Realme 11 5G, Realme 11 4G మోడల్స్ Realme 11 సిరీస్ లో భాగంగా గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. దాంతో పాటు ఆగస్టు 3 వ వారంలో Realme 11 5G వేరియంట్ కూడా లాంచ్ కానుందని సమాచారం. అయితే కంపెనీ నుంచి దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Realme 11 5G ధర (అంచనా)
Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ ధర సుమారు రూ.23,000 గా ఉంది. కానీ భారత్ లో Realme 11 5G ధర రూ.20,000 వద్ద ఉంటుందని సమాచారం. ఇది టాప్ వేరియంట్ ధర అని గమనించాలి. బేస్ వేరియంట్ ధర రూ.15,000 వద్ద ఉంటుందని అంచనా. ఇది కూడా చదవండి: 67W చార్జింగ్, 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Realme 11 4G, Realme 11 5G
Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- స్క్రీన్: Realme 11 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ ఉన్నాయి.
- స్టోరేజీ: Realme 11 5G డివైజ్ లో 8జిబి వరకు ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఆఫర్ చేశారు.
- కెమెరా: Realme 11 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Realme 11 5G లో బ్లూటూత్ 5.2, వై-ఫై 5, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











