
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ పోర్ట్‌ఫోలియో లో భారత్ లో Samsung Galaxy F54 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. కొన్ని రోజుల క్రితం శాంసంగ్ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ డివైజ్ లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Samsung Galaxy F54 5G పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ట్వీట్ చేశాడు. చూస్తుంటే, ఈ డివైజ్ Samsung Galaxy M54 5G కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది. సరే పదండి, Samsung Galaxy F54 5G విశేషాలు తెలుసుకుందాం.
Samsung Galaxy F54 5G ఇండియా లాంచ్ టైమ్ లైన్, డిజైన్, ధర
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ చివరి వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అంటే ఇంకో రెండు వారాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. చూస్తుంటే, ఈ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, చిన్ తో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై మూడు సర్క్యులర్ కెమెరా రింగ్స్ చూడటానికి ఫ్లాగ్షిప్ ఎస్23 సిరీస్ మాదిరి ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy F54 5G డివైజ్ ధర భారత్ లో రూ.23,000 పైనే ఉండనుందని టిప్‌స్టర్ వెల్లడించాడు.
Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 స్క్రీన్ ప్రొటెక్షన్ తో వచ్చే అవకాశం ఉంది.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ
ఈ హ్యాండ్సెట్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. గత లీక్స్ ద్వారా ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో రానున్నట్లు తెలిసింది. శాంసంగ్ ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ టెక్నాలజీని వాడే అవకాశం ఉంది.
కెమెరా
Samsung Galaxy F54 5G లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ఇందులో 108ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే చాన్స్ ఉంది.
బ్యాటరీ, ఓఎస్
Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ కస్టమ్ స్కిన్ తో రానుంది. ఈ డివైజ్ 8.4 ఎంఎం మందం, 199 గ్రాముల బరువు ఉండనుంది. వై-ఫై 6, బ్లూటూత్ 5, జీపీఎస్ తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











