రివీలైన Motorola Razr Lite రెండర్స్, అందుబాటు ధరలో రానున్న ఫోల్డబుల్ ఫోన్!

Highlights

  • ఈ ఏడాది మోటోరోలా రెండు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసే అవకాశం
  • త్వరలో లాంచ్ కానున్న Motorola Razr Lite
  • Motorola Razr Plus 2023 కి బడ్జెట్ వర్షన్ గా రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఈ ఏడాది Razr Plus 2023 ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ కొత్త ఫోన్ పెద్ద కవర్ డిస్ప్లే, కొన్ని ప్రధాన అప్‌గ్రేడ్స్ తో వస్తుందని అంచనా. మోటరోలా నుంచి వస్తోన్న అత్యంత ప్రీమియమ్ ఫోల్డబుల్ డివైజ్ ఇది. అయితే ఈ కంపెనీ కాస్త చవకైన రేజర్ ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మైస్మార్ట్‌ప్రైస్ వెబ్ సైట్ Motorola Razr Lite గురించి వెల్లడించింది.

పేరుకు తగినట్లే Motorola Razr Lite డివైజ్ రేజర్ ప్లస్ 2023 కి కాస్త డౌన్‌గ్రేడ్ వర్షన్ గా వస్తున్నట్లు అర్థమవుతోంది. లైట్ ట్యాగ్ లేకుండా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ సింపుల్ గా Motorola Razr 2023 అని పేరు పెట్టవచ్చు. ఇప్పటి వరకు లాంచ్ టైమ్ లైన్ గురించి అఫీషియల్ డీటెయిల్స్ లేవు. ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks రీసెంట్ గా ఎక్స్‌క్లూజివ్ డిజైన్ రెండర్స్ ని రివీల్ చేశాడు.

ఓసారి లీకైన Motorola Razr Lite డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Motorola Razr Lite ఫస్ట్ లుక్

Motorola Razr Lite 2023 త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ Razr Plus 2023 కి డౌన్‌గ్రేడ్ వర్షన్. టిప్‌స్టర్ OnLeaks ద్వారా తాజాగా డిజైన్ రెండర్స్ రివీల్ అయ్యాయి.

డిజైన్ రెండర్స్ లో కనిపిస్తోన్న విధంగా Motorola Razr Lite 2023 క్లామ్-షెల్ స్టైల్ ఫోల్డబుల్ మెకానిజమ్ తో వస్తోంది. Motorola Razr Lite ఫోల్డబుల్ డిస్ప్లే హోల్-పంచ్ కటౌట్ ని కలిగి ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి.

ఫోన్ కి బయట చిన్నపాటి కవర్ డిస్ప్లే ఉంది. డిజైన్ రెండర్స్ ని బట్టి కవర్ డిస్ప్లే పరిమిత సంఖ్యలో టాస్క్స్ చేసుకునేందుకు వీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే టైమ్ లేదంటే నోటిఫికేషన్స్, ఇన్‌కమింగ్ కాల్స్ వంటివి చెక్ చేసుకోవచ్చు.

OPPO Find N2 Flip మరియు Samsung Galaxy Z Flip 4 తో పోల్చితే డిస్ప్లే చాలా చిన్నగా ఉంది. త్వరలో రానున్న Vivo X Flip డిస్ప్లే కూడా Motorola Razr Lite కంటే పెద్దగా ఉంది.

Motorola Razr Lite 2023 బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. కెమెరా సెన్సర్స్ పక్కన ఒక ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉంది. ఫ్రేమ్ కర్వ్డ్ గా ఉంది. ఆంటెనా లైన్స్ ఉండటాన్ని బట్టి బాడీ మెటల్ తో వస్తోందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.