Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల

Highlights

  • త్వరలో Samsung Galaxy F55 5G లాంచ్
  • వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తోన్న డివైజ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా శాంసంగ్ సంస్థ ఈ ఫోన్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసింది. కొత్త టీజర్ ని సోషల్ మీడియాలో వదిలింది. గెలాక్సీ ఎఫ్55 5జీ లెదర్ ఫినిష్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ ఖరారు

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ ని నేడు శాంసంగ్ కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.

శాంసంగ్ తన X ఖాతాపై Samsung Galaxy F55 5G టీజర్ ని షేర్ చేసింది. దీంతో త్వరలో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని తెలిసింది.

టీజర్ ని గమనిస్తే, అందులో Samsung Galaxy F55 5G డివైజ్ ఆరెంజ్ కలర్, వీగన్ లెదర్ ఫినిష్ తో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Samsung Galaxy F55 5G డివైజ్ ఫ్లిప్‌కార్ట్ మరియు శాంసంగ్.కామ్ ద్వారా సేల్‌కి రానుందని టీజర్ ద్వారా ఖరారైంది. కొన్ని రోజుల్లో కచ్చితమైన లాంచ్ తేదీ వివరాలను శాంసంగ్ షేర్ చేసే అవకాశం ఉంది.

Samsung Galaxy F55 5G ధర (లీక్)

Samsung Galaxy F55 5G ధర ఓ లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఆ వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంటుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుంది. టాప్ మోడల్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉంటుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.