Nothing: భారత్‌లో లాంచైన Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్

Highlights

  • Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ లాంచ్
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్

Nothing కంపెనీ నేడు భారత్ లో Nothing Phone (2a) యొక్క కొత్త కలర్ వేరియంట్ ని లాంచ్ చేసింది. గత నెలలో Nothing Phone (2a) డివైజ్ భారత్‌లో లాంచ్ అయ్యింది. తాజాగా నీలం రంగులో ఈ ఫోన్‌ని నథింగ్ సంస్థ తీసుకొచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఓసారి నథింగ్ ఫోన్ 2ఏ యొక్క కొత్త కలర్ వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ ధర, లభ్యత

Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ (8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ) ధరను రూ.25,999 గా నిర్ణయించారు.

Nothing Phone (2a) 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మే 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Nothing Phone (2a) ఫోన్‌ని రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, తన ఆడియో ఉత్పత్తులను కూడా నథింగ్ గిఫ్ట్‌గా ఇవ్వనుంది.

Nothing Phone (2a) బ్లూ కలర్ వేరియంట్ లో కలర్ తప్పా మరే ఇతర మార్పు లేదు. అంతేకాదు, ఈ కలర్‌కి కాస్త ధర కూడా పెరిగింది. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ టు సేమ్.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2a) డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Nothing Phone (2a) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Nothing Phone (2a) లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2a) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Nothing Phone (2a) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.