Samsung Galaxy F55 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • మే 17న Galaxy F55 5G లాంచ్
  • ధర రూ.30 వేల లోపు ఉండే అవకాశం
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. గత వారం ఈ ఫోన్ లాంచ్‌ని శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఇండియా లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. మే 17న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. ధరను రూ.2X,999 అని పేర్కొంది. అంటే ముప్పై వేల లోపు ఉంటుందని అర్థమవుతోంది. ఓసారి లాంచ్ తేదీ, సమయం మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G లాంచ్ తేదీ మరియు ధర

Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ వివరాలను శాంసంగ్ తన X ఖాతా ద్వారా పంచుకుంది.

పోస్ట్ ప్రకారం, Samsung Galaxy F55 5G ఫోన్ మే 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ అవ్వనుంది.

భారత్ లో Samsung Galaxy F55 5G ధర రూ.2X,999 గా ఉంటుందని శాంసంగ్ తెలిపింది. అంటే రూ.30,000 లోపు ఈ ఫోన్ ధర ఉంటుందని అర్థమవుతోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉంటాయి.