8GB ర్యామ్, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 4

హైలైట్స్

  • భారత్ లో లాంచైన Tecno Pova 4 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • భారత్ లో Tecno Pova 4 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.11,999

Tecno Pova 4 భారత్ లో లాంచ్ అయ్యింది. గత నెలలో Tecno Pova 4 మరియు Tecno Pova 4 Pro ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. తాజాగా భారత్ లో ఎంట్రీ ఇచ్చిన Tecno Pova 4 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 ఎంపి కెమెరాతో వచ్చింది.

Tecno Pova 4 లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి. మరి భారత్ లో Tecno Pova 4 ధర, లాంచ్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? అయితే పదండి.

భారత్ లో Tecno Pova 4 ధర, లభ్యత

Tecno Pova 4 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా నిర్ణయించారు. డిసెంబర్ 13 నుంచి ఈ ఫోన్ ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Tecno Pova 4 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Pova 4 లో 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1640*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ నాచ్, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ ఉన్నాయి.

Tecno Pova 4 లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి. ఈ డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 5జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. Tecno Pova 4 ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno Pova 4 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Tecno Pova 4 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో డీటీఎస్ ఆడియో, స్టీరియో స్పీకర్ సెటప్ ఉన్నాయి.

Tecno Pova 4 రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: యురనోలిత్ గ్రే మరియు క్రయొలైట్ బ్లూ. భారత మార్కెట్ లో లావా ఆరెంజ్ వేరియంట్ ని లాంచ్ చేయలేదు. Tecno Pova 4 170.59 మిల్లీ మీటర్ల పొడవు, 77.52 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.7 మిల్లీ మీటర్ల మందం, 212 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్ తో వస్తోంది. Tecno Pova 4 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్ కి ముందు లీకైన iQOO 11 ధర, ర్యామ్, స్టోరేజీ
Next articleడిసెంబర్ 9 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M04
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.