Samsung: భారత్‌లో లాంచైన Galaxy M15 5G Prime Edition, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • భారత్ లో Galaxy M15 5G Prime విడుదల
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర రూ.13,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy M15 5G Prime ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఇదొక బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ లో ఇంకా 6.5-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 128జిబి వరకు స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎమ్15 5జీ ప్రైమ్ ఎడిషన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M15 5G Prime ధర

Samsung Galaxy M15 5G Prime ఎడిషన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,499 గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది.

అమెజాన్, శాంసంగ్.కామ్ మరియు పార్ట్నర్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ యొక్క మూడు వేరియంట్లను వరుసగా రూ.10,999, రూ.11,999 మరియు రూ.13,499 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ధరలు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Samsung Galaxy M15 5G Prime డివైజ్ బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M15 5G Prime స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M15 5G Prime లో 6.5-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M15 5G Prime లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ని జతచేశారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G Prime డివైజ్ 4జిబి+128జిబి, 6జిబి+128జిబి, 8జిబి+128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది.

కెమెరా: Samsung Galaxy M15 5G Prime లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M15 5G Prime లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G Prime లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy M15 5G Prime డివైజ్ 160.1 మి.మీ పొడవు, 76.8 మి.మీ వెడల్పు, 9.3 మి.మీ మందం, 217 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M15 5G Prime లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఉన్నాయి.

Previous articleSamsung Galaxy S24 FE భారత మార్కెట్ ధరలు, ఆఫర్లు
Next articleLava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.