
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వచ్చే నెల భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. తాజాగా వివో సంస్థ Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28న Vivo V30 సిరీస్ థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. జీస్ ఆప్టిక్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వీ30 సిరీస్ లాంచ్ కానుంది. సరే, ఓసారి థాయిలాండ్ లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Vivo V30 సిరీస్ లాంచ్ తేదీ
- కంపెనీ అధికార వెబ్సైట్ లో లిస్టైన ల్యాండింగ్ పేజీ ప్రకారం, Vivo V30 మరియు Vivo V30 Pro థాయిలాండ్ లో ఫిబ్రవరి 28న లాంచ్ అవుతోంది.
- ఎర్లీ బర్డ్ ప్రోగ్రామ్ లో భాగంగా థాయిలాండ్ కస్టమర్లు వీ30 సిరీస్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
- సైట్ ప్రకారం, Vivo V30 సిరీస్ సీ గ్రీన్, నైట్ స్కై బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయని తెలుస్తోంది.
కంపెనీ ప్రకటించిన స్పెసిఫికేషన్స్
- Vivo V30 సిరీస్ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని వివో తన వెబ్సైట్ లో ల్యాండింగ్ పేజీ ద్వారా రివీల్ చేసింది. అవేంటో తెలుసుకుందాం.
- Vivo V30 సిరీస్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. మూడు కెమెరాలు కూడా జీస్ లెన్సెస్ కలిగి ఉంటాయి.
- మెయిన్ కెమెరా మాడ్యూల్ క్రింద ఆరా లైట్ ఉంటుంది. ఈ ఆరా లైట్ ద్వారా యూజర్లు కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది.
- Vivo V30 సిరీస్ ఫోన్లు 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయని కంపెనీ తెలిపింది.
Vivo V30 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- చిప్సెట్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50ఈ ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, ఒక పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Vivo V30 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- కెమెరా: Vivo V30 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
- బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ ఉంటాయి.
- బరువు, చుట్టుకొలత: Vivo V30 Pro డివైజ్ 164.4 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.5 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: Vivo V30 Pro డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.











