
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung ప్రస్తుతం కొత్త ఎమ్-సిరీస్ ఫోన్లపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా Samsung Galaxy M15 డివైజ్ యొక్క బ్యాటరీ వివరాలు నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ Samsung Galaxy A15 డివైజ్ కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Samsung Galaxy M15 ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy M15 యొక్క లీక్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
లీకైన Samsung Galaxy M15 బ్యాటరీ వివరాలు
- Samsung Galaxy M15 స్మార్ట్‌ఫోన్ కొత్త సంవత్సరం 2024 లో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- తాజాగా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ సమాచారం బయటకు వచ్చాయి. Sammobile వెబ్‌సైట్ ఈ వివరాలను తన కథనం ద్వారా వెల్లడించింది.
- Samsung Galaxy M15 ఫోన్ 6,000mAh భారీ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది. ఇది Samsung Galaxy A15 లో ఉన్న 5,000mAh బ్యాటరీ కంటే ఎక్కువ. ఇకపోతే, Samsung Galaxy M15 డివైజ్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
Samsung Galaxy M15 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy M15 లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, ఇన్ఫినిటీ యు నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది.
- ప్రాసెసర్: Samsung Galaxy M15 4జీ వేరియంట్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5జీ వేరియంట్ లో డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉండవచ్చు.
- ఓఎస్: Samsung Galaxy M15 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో వచ్చే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy M15 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో వచ్చే అవకాశం ఉంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy M15 లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఏసీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్ ఉండే అవకాశం ఉంది.











