Tecno POP 8 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన టెక్నో; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • అక్టోబర్ లో గ్లోబల్ గా లాంచైన Tecno POP 8
  • జనవరి 3 న భారత్ లో POP 8 విడుదల
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోన్న ఫోన్

చవకైన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తూ పాపులర్ అయిన Tecno కంపెనీ త్వరలోనే Tecno POP 8 ఫోన్ ని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. Tecno POP 8 డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. జనవరి 3న Tecno POP 8 భారత్ లో లాంచ్ అవుతోంది. 8జిబి ర్యామ్ (4జిబి ఇంటర్నల్ + 4జిబి వర్చువల్), 64జిబి స్టోరేజీ, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాప్ 8 ఫోన్ వస్తోంది. సరే, ఓసారి Tecno POP 8 యొక్క అంటుటు స్కోర్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno POP 8 డివైజ్ యొక్క AnTuTu స్కోర్

  • Tecno POP 8 స్మార్ట్‌ఫోన్ చెప్పుకోదగిన అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. Tecno POP 8 అంటుటు బెంచ్ మార్క్ స్కోర్ 2,40,205 గా ఉంది. ఈ స్కోర్ తో పాటు డివైజ్ ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది. దీంతో డివైజ్ తీరుతెన్నులు తెలిసాయి.
  • Tecno POP 8 ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. మరో వార్త ద్వారా Tecno POP 8 ఫోన్ రూ.7,000 కంటే తక్కువ ధరతో మార్కెట్ లోకి రానుందని తెలిసింది.

Tecno POP 8 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Tecno POP 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno POP 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉంది. ఇది ఆక్టా-కోర్ చిప్. ప్రత్యేకించి తక్కువ బడ్జెట్ ఫోన్ల కోసం ఈ చిప్సెట్ రూపొందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POP 8 డివైజ్ 3జిబి ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్ మరియు 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ లభిస్తుంది. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Tecno POP 8 లో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno POP 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno POP 8 గ్లోబల్ మరియు ఇండియన్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయని సమాచారం.