రివీలైన Samsung Galaxy M54 5G డిజైన్

Highlights

  • Galaxy S23 లాంచ్ తర్వాత భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Samsung Galaxy M54 5G
  • భారత్ లో మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న Samsung Galaxy M54 5G
  • తాజాగా రివీలైన కలర్ ఆప్షన్స్, కెమెరా సెటప్ డీటెయిల్స్

త్వరలో భారత్ లో Samsung Galaxy M54 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఫిబ్రవరి 1 న గెలాక్సీ ఎస్23 సిరీస్ గ్లోబల్ లాంచ్ తర్వాత Samsung Galaxy M54 5G లాంచ్ కానుంది. అయితే అందరి కళ్ళూ ప్లాగ్షిప్ సిరీస్ పై ఉండగా, మరోవైపు శాంసంగ్ కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్ Samsung Galaxy M54 5G ని లాంచ్ చేసే పనిలో పడింది. MySmartPrice తన రిపోర్ట్ లో Samsung Galaxy M54 5G కి సంబంధించిన డిజైన్ వివరాలను వెలువరించింది. పదండి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

రెండర్స్ ద్వారా రివీలైన Samsung Galaxy M54 5G డిజైన్

రిపోర్ట్ ని బట్టి, Samsung Galaxy M54 5G ఫోన్ స్లిమ్ బెజెల్స్, కాస్త మందపాటి చిన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ డిస్ప్లే, సెపరేట్ మాడ్యూల్ లేని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. గత మోడల్ గెలాక్సీ ఎమ్53 క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది.

ఇతర ప్రధానాంశాలను చూస్తే, ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా పంచ్-హోల్ కటౌట్ లో ఉంది. ఫోన్ కి కుడివైపున పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. ఎడమ వైపున సిమ్ ట్రే ఉంది. అయితే, రెండర్స్ ద్వారా ఫోన్ యొక్క పోర్ట్స్ రివీల్ కాలేదు. గెలాక్సీ ఎమ్53 లో 3.5ఎంఎం ఆడియో జాక్ రాలేదు కాబట్టి, Samsung Galaxy M54 5G లో కూడా ఉండే అవకాశం లేదు.

Samsung Galaxy M54 5G యొక్క రెండు కలర్ ఆప్షన్స్ రెండర్స్ ద్వారా రివీల్ అయ్యాయి. అవి: డార్క్ బ్లూ మరియు సిల్వర్, బ్లూ, పింక్, గ్రీన్ లతో కూడిన మల్టీ-కలర్ గ్రేడియంట్ ఫినిష్. కెమెరా సెటప్ డిజైన్ కూడా శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డిజైన్ లాంగ్వేజీతో పోలికలను కలిగి ఉంది.

Samsung Galaxy M54 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంతకు మించి పెద్దగా ఏమీ తెలియలేదు. అయితే గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసిన సమాచారాన్ని బట్టి, Samsung Galaxy M54 5G ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. కెమెరా సెటప్ కి సంబంధించి ఎటువంటి స్పష్టత రాలేదు. అయితే ఎమ్53 లో 108ఎంపి క్వాడ్ కెమెరా ఉంది కాబట్టి, Samsung Galaxy M54 5G లో కూడా ఇదే కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.

భారత్ లో Samsung Galaxy M53 5G ధర రూ.23,999 గా ఉంది. Samsung Galaxy M54 5G ధర కూడా దీనికి దగ్గర్లో ఉండనుందని అంచనా. రానున్న రోజుల్లో Samsung Galaxy M54 5G కి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleరూ.6,999 ధరతో భారత్‌లో లాంచైన Tecno Spark Go 2023
Next article120KM రేంజ్, రూ.1 లక్ష లోపు ధరతో లాంచైన HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.