
భారత్ లో Tecno Spark Go 2023 అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ లాంచైంది. వాటర్ డ్రాప్ నాచ్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, భారీ రియర్ కెమెరా మాడ్యూల్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో Tecno Spark Go 2023 మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ ప్యాటర్న్ ఫినిషింగ్ తో వచ్చింది.
Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. సరే, ఇప్పుడు Tecno Spark Go 2023 ఫోన్ ధర, లభ్యత, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.
భారత్ లో Tecno Spark Go 2023 ధర, లభ్యత
Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. జనవరి 23 నుంచి ఈ ఫోన్ రిటైల్ స్టోర్స్ ద్వారా అమ్ముడవుతుంది.
Tecno Spark Go 2023 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 480 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
- ప్రాసెసర్, మెమొరీ: ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభిస్తుంది. స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
- సాఫ్ట్‌వేర్: Tecno Spark Go 2023 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Tecno Spark Go 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్ ఉంటుంది.
- సెక్యూరిటీ: భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఐపీఎక్స్2 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Tecno Spark Go 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
- చుట్టుకొలత: ఈ ఫోన్ 163.86 మిల్లీ మీటర్ల పొడవు, 75.51 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.











