ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M55s 5G పేరుతో వచ్చిన ఈ డివైజ్ సేల్ నేటి నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై మొదలైంది. కేవలం రూ.17,999 కే ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి సేల్ వివరాలు, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy M55s 5G సేల్, ఆఫర్లు, ధర
Samsung Galaxy M55s 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వాటి ధరలను తెలుసుకుందాం.
ఆఫర్ తో కలుపుకుని, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ను రూ.17,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.19,999.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.22,999 కాగా, దీన్ని రూ.20,999 కి కొనుగోలు చేయవచ్చు.
అన్ని మోడల్స్ పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్/కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకి ఈ ఫోన్ కస్టమర్లకు లభిస్తుంది.
ఈ బ్యాంక్ ఆఫర్ కాకుండా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈ ఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా, Samsung Galaxy M55s 5G పై రూ.18,500 వరకు బెనిఫిట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
Samsung Galaxy M55s 5G ని ఎక్కడ కొనాలి?
Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్‌ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ పై ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్ఫామ్స్ పై బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా సేల్ ఉంటుంది.
Samsung Galaxy M55s 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy M55s 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy M55s 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55s 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
కెమెరా: Samsung Galaxy M55s 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55s 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.
కనెక్టివిటీ: Samsung Galaxy M55s 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
