Home News 200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra

200ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S23 Ultra

హైలైట్స్:

ఎగ్జినోస్ చిప్సెట్స్ తో పాటు, స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్ లను తయారు చేసే శాంసంగ్ యొక్క సెమీ కండక్టర్ డివిజన్ తాజాగా 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ3 సెన్సర్ ను లాంచ్ చేసింది. ఇది 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ1 యొక్క ర్యాంప్ అప్ వర్షన్. రీసెంట్ గా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ కి సంబంధించిన 200ఎంపి ఐసోసెల్ హెచ్పీ 1 సెన్సర్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు తాజా లీక్ ని బట్టి, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సరికొత్త 200ఎంపి లెన్స్ తో రానున్నట్లు అర్థమవుతోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా తన ఫోటోగ్రఫీ పనితనానికి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. మరింత మెరుగైన కెమెరా పనితనాన్ని ప్రదర్శించే హ్యాండ్సెట్ ను తీసుకురావడం ప్రస్తుతం శాంసంగ్ ముందున్న సవాలు. తాజాగా బయటకు వచ్చిన లీక్ ను బట్టి, ఎస్23 అల్ట్రా కు ఆ సత్తా ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో, ఓ లీక్ తెలిపిన దాన్ని బట్టి, ఎస్23 సిరీస్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 40ఎంపి సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని అనుకున్నారు.

Samsung Galaxy S23 Ultra 200ఎంపి కెమెరా

ఐస్ యూనివర్స్ ద్వారా గెలాక్సీ ఎస్23 అల్ట్రా యొక్క 200ఎంపి కెమెరా లైమ్ లైట్ లోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 200 ఎంపి గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లీక్ స్టర్ ఒక కీలకమైన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఐసోసెల్ హెచ్పీ1, ఐసోసెల్ హెచ్పీ3 అనే రెండు 200ఎంపి సెన్సర్లు మాత్రమే ఉన్నాయి. హెచ్పీ3 సెన్సర్ మోటోరోలా ఎడ్జ్30 అల్ట్రా ఫోన్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హెచ్పీ3 మిడ్ రేంజ్ సెన్సర్. ఇది రానున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో మనకు కనిపించనుంది. షావోమీ 12టీ ప్రో కూడా 200ఎంపి కెమెరా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హెచ్పీ1 సెన్సర్ లేదా హెచ్పీ3 సెన్సర్ లలో ఏ ఒక్కటీ కూడా గెలాక్సీ ఎస్23 అల్ట్రా లో ఉండదని లీక్ స్టర్ అంచనా. అంటే ఇంకా అనౌన్స్ కాని కొత్త సెన్సర్ తో గెలాక్సీ ఎస్23 అల్ట్రా రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ సెన్సర్ కెమెరా విషయంలో, మోటో ఎడ్జ్30 అల్ట్రా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా కంటే బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక శాంసంగ్ తీసుకు రాబోతున్న ఆ మూడవ 200ఎంపి సెన్సర్ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతో మొబైల్ ప్రేమికులు ఉన్నారు. అసలే ప్రెస్టీజియస్ ఎస్23 సిరీస్ కాబట్టి, హెచ్పీ1, హెచ్పీ3 సెన్సర్ ల కంటే అద్భుతంగా పెర్ఫామ్ చేసే సెన్సర్ నే శాంసంగ్ తీసుకువస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. రానున్న రోజుల్లో ఈ సెన్సర్ కు సంబంధించిన మరిన్ని లీకులు, వార్తలు బయటకు వచ్చే అవకాశముంది.