లైవ్ ఇమేజ్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy S23 Ultra డిజైన్

హైలైట్స్:

  • హై రెజుల్యూషన్ ఇమేజెస్ ద్వారా రివీల్ అయిన శాంసంగ్ యొక్క తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ డిజైన్
  • Galaxy S22 Ultra మాదిరి డిజైన్ తో రానున్న Samsung Galaxy S23 Ultra
  • యథావిధిగా S Pen స్లాట్ తో వస్తున్న Samsung Galaxy S23 Ultra

Samsung కంపెనీ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది Samsung Galaxy S23 సిరీస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ సిరీస్ కి సంబంధించిన పలు లీక్స్ బయటకు వచ్చాయి. కానీ తాజాగా Samsung Galaxy S23 Ultra యొక్క హై-రెజుల్యూషన్ రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీని డిజైన్ అచ్చం Samsung Galaxy S22 Ultra మాదిరి ఉంది.

Samsung Galaxy S23 Ultra ఇమేజెస్ ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్స్టాఫర్ సౌజన్యంతో SmartPix లో పబ్లిష్ కాబడినవి. @OnLeaks అనే పేరుతో కూడా స్టీవ్ చలామణి అవుతుంటాడు. 360-డిగ్రీ వీడియోతో పాటు హై-రెజుల్యూషన్ ఇమేజెస్ ఈ రెండర్స్ లో ఉన్నాయి. వీటి ద్వారా Samsung Galaxy S23 Ultra యొక్క డిజైన్ వివరాలు తెలిశాయి.

Samsung Galaxy S23 Ultra డిజైన్ చూస్తే, సరిగ్గా Samsung Galaxy S22 Ultra లాగే కనిపిస్తోంది. ఇక ఎస్23 అల్ట్రా కూడా ఎస్-పెన్ తో వస్తోంది. ఎస్23 అల్ట్రా లో కర్వ్డ్ డిస్ప్లే ఉంది. అయితే ఎస్22 అల్ట్రాలో ఉన్నంత కర్వ్ లేదు. ఇక మిగతా ఇమేజెస్ ఎస్22 అల్ట్రా మాదిరే ఉన్నాయి.

మరో ట్వీట్ లో ప్రముఖ టిప్‌స్టర్ Ice Universe, Samsung Galaxy S23 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ షేర్ చేశారు. ఈ పిక్స్ రెండు జనరేషన్స్ ఫోన్ల మధ్య తేడాలను చూపిస్తోంది. Samsung Galaxy S23 Ultra లో తక్కువ కర్వ్డ్ స్క్రీన్, సన్నని చిన్ కనిపిస్తున్నాయి.

Samsung Galaxy S23 Ultra స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S23 Ultra క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తుందని సమాచారం. చైనాలో 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వేరే ప్రాంతాల్లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ రానుంది.

SMS9180 అనే మోడల్ నంబర్ కలిగిన Samsung Galaxy S23 Ultra 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుందని సమాచారం. ఇటీవలె శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఎస్23+ యొక్క రెండర్స్ ద్వారా వాటి ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఈ రెండు మోడల్స్ కూడా వీటి ప్రీడెసెసర్స్ మాదిరి డిజైన్ ని కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. డిజైన్ ని పెద్దగా మార్చలేదంటే, శాంసంగ్ తన దృష్టిని ఎస్23 సిరీస్ పై కాకుండా, భవిష్యత్ ఫ్లాగ్షిప్స్ పై పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఎస్23 సిరీస్ ద్వారా ఏయే కొత్త ఫీచర్లను శాంసంగ్ తీసుకురానుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleసెప్టెంబర్ 30 న లాంచ్ అవుతోన్న Redmi Note 11R
Next articleలాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.