6.7-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Samsung Galaxy Z Flip 5

Highlights

  • భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన Galaxy Z Flip 5
  • 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ కవర్ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • కలర్ ఆప్షన్స్: మింట్, గ్రాఫైట్, క్రీమ్, లావెండర్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు తన ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో Samsung Galaxy Z Flip 5, Samsung Galaxy Z Fold 5
డివైజెస్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. 6.7-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేతో Samsung Galaxy Z Flip 5 డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ డివైజ్ లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ 60 హెర్ట్జ్ కవర్ స్క్రీన్ ని అందించారు. ఈ స్క్రీన్ 306 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది.

Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ తెరిచినప్పుడు 71.9 మి.మీ వెడల్పు, 165.1 మి.మీ పొడవు, 6.9 మి.మీ మందం ఉంటుంది. ఈ ఫోన్ 187 గ్రాముల బరువు ఉంటుంది. ఇప్పుడు Samsung Galaxy Z Flip 5 పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Samsung Galaxy Z Flip 5 ధర

  • 8GB ర్యామ్, 128GB స్టోరేజీ మోడల్ ధర రూ.99,999
  • 8GB ర్యామ్, 512GB స్టోరేజీ మోడల్ ధర రూ.1,09,999

Samsung Galaxy Z Flip 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy Z Flip 5 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: Samsung Galaxy Z Flip 5 లో 3.4-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*748 పిక్సెల్ రెజుల్యూషన్, 306 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Samsung Galaxy Z Flip 5 లో 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Samsung Galaxy Z Flip 5 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
  • చిప్సెట్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 5 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy Z Flip 5 లో పవర్ బ్యాకప్ కోసం 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాలు సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • వాటర్ రెసిస్టన్స్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ ఐపీX8 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.
  • ఓఎస్: Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy Z Flip 5 స్మార్ట్ ఫోన్ లో 5జీ, ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy Z Flip 5 డివైజ్ మింట్, గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్.కామ్ పై కొనుగోలు చేస్తే, గ్రే, బ్లూ, గ్రీన్, యెల్లో కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Previous article7.6-ఇంచ్ Infinity Flex Display తో భారత్‌లో లాంచైన Samsung Galaxy Z Fold 5
Next articleSamsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 లలో ఉన్న టాప్-5 ఫీచర్లు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.