హైలైట్స్:
- అమెజాన్ నెదర్లాండ్స్ సైట్ లో కనిపించిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4
- స్పెసిఫికేషన్స్, డిజైన్, ఎస్ పెన్ కేస్ ను రివీల్ చేసిన లిస్టింగ్
- మ్యాచింగ్ కలర్ లో ఎస్-పెన్ ను ఎంపిక చేసుకునే అవకాశం
మరో నాలుగు రోజుల్లో శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్లో శాంసంగ్, ఫోర్త్-జనరేషన్ ఫోల్డబుల్ హ్యాండ్సెట్స్ గెలాక్సీ ఫోల్డ్ 4, గెలాక్సీ ఫ్లిప్ 4 లను లాంచ్ చేయనుంది. ఆగస్టు 10 న జరగబోవు ఈవెంట్ కు ముందు, అమెజాన్ లిస్టింగ్ ద్వారా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్, ఎస్ పెన్ కేస్, ఆండ్రాయిడ్ 12ఎల్ టాస్క్ బార్ రివీల్ అయ్యాయి. 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఆప్షన్ కలిగిన బీజ్ కలర్ వేరియంట్ లిస్టింగ్ లో కనిపించింది.
శాంసంగ్ అధికార వెబ్ సైట్ తో పాటు శాంసంగ్ స్టోర్స్ ద్వారా రూ.1,999 టోకెన్ ప్రైస్ చెల్లించి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 15 మిలియన్లకు పైగా మడతబెట్టే ఫోన్లను అమ్మాలని శాంసంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నాల్గవ తరం మడతబెట్టే ఫోన్ల నుంచి జెడ్ బ్రాండింగ్ ను తొలగించనున్నట్లు సమాచారం.
అమెజాన్ లిస్టింగ్ పై కనిపించిన Samsung Galaxy Z Fold 4
9to5Google వెబ్ సైట్ అమెజాన్ లిస్టింగ్ ను తొలుత గమనించింది. ఈ లిస్టింగ్ ద్వారా తెలిసిన స్పెసిఫికేషన్స్ ను చూద్దాం. 6.2 అంగుళాల 23.1:9 కవర్ డిస్ప్లే, ఫోల్డ్ 3 కంటే ఫోల్డ్ 4 సన్నగా కనిపిస్తోంది. 7.2 అంగుళాల 2.16:18 యాస్పెక్ట్ రేషియో కలిగిన అమోలెడ్ 2ఎక్స్ ఇన్నర్ డిస్ప్లే ని ఇందులో అమర్చారు. ఇక ఇన్ఫినిటీ-ఫ్లెకస్ ప్యానెల్ 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.
పిక్స్ లో కనిపించిన బాటమ్-మౌంటెడ్ టాస్క్‌బార్, ఆండ్రాయిడ్ 12ఎల్ ను పోలినట్లు కనిపిస్తోంది. భారీ డిస్ప్లేలు కలిగిన స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఫీచర్ ఉండనుంది. తేలిగ్గా మల్టీటాస్కింగ్ చేసేందుకు, యాప్స్ మధ్య ఈజీగా స్విచ్ అయ్యేందుకు ఈ టాస్క్ బార్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
అమెజాన్ లిస్టింగ్ పై ఉన్న చివరి ఇమేజ్ ఎస్ పెన్ ను చూపిస్తోంది. అయితే ఈ ఏడాది శాంసంగ్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఎస్ పెన్ కి మ్యాచింగ్ కలర్స్ ను ఇచ్చే అవకాశముంది. అంటే ఫోల్డ్ 3 నలుపు రంగు ఎస్ పెన్ మాదిరి ఫోల్డ్ 4 లో ఎస్ పెన్ ఉండబోదు. ఎస్ పెన్ యొక్క హెల్‌స్టర్ కేస్, హ్యాండ్సెట్ కూడా మ్యాచింగ్ కలర్స్ లో రానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 7.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 6.1-ఇంచ్ హెచ్డీ+ కవర్ డిస్ప్లే, 10ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.