Sony Xperia 10 VI: గ్లోబల్‌గా లాంచైన సోని కొత్త ఫోన్

Highlights

  • యూరప్, యూకేలో లాంచైన Sony Xperia 10 VI
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్
  • ఐపీ65/68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్

ప్రముఖ టెక్ బ్రాండ్ Sony తాజాగా ఒక మిడ్-బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Sony Xperia 10 VI పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ డివైజ్ యూరప్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్, 48ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Sony Xperia 10 VI ధర

Sony Xperia 10 VI స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ ధర 399 యూరోలు (సుమారు రూ.36,075) గా ఉంది.

Sony Xperia 10 VI డివైజ్ బ్లాక్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Sony Xperia 10 VI స్మార్ట్‌ఫోన్ యూరప్ లో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. జూన్ 10 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

Sony Xperia 10 VI స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Sony Xperia 10 VI లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ (2520*1080 పిక్సెల్స్) స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 21:9 యాస్పెక్ట్ రేషియో, 97% డీసీఐ-పీ3 టెక్నాలజీ, 10-బిట్ టోనల్ గ్రేడేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Sony Xperia 10 VI లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

ర్యామ్, స్టోరేజీ: Sony Xperia 10 VI లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్/ఈఐఎస్ మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Sony Xperia 10 VI లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Sony Xperia 10 VI డివైజ్ ఆం్డరాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్‌కి 3 మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కనెక్టివిటీ: Sony Xperia 10 VI లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ ఉన్నాయి.

Previous articleVivo V40 SE 4G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు
Next articleiQOO Z9x 5G: ఐపీ64 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఐకూ కొత్త ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.