5G auction - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 02 Aug 2022 07:58:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు https://www.91mobiles.com/telugu/5g-services-to-launch-in-october/ Tue, 02 Aug 2022 07:58:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=1421 హైలైట్స్: మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ లో 51,236 మెగాహెర్ట్జ్ అమ్మకంతో ముగిసిన 5జీ వేలం రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన రిలయన్స్ జియో రూ.43,084 కోట్ల విలువైన 19,867 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన భారతి ఎయిర్టెల్ 5జీ వేలం నేపథ్యంలో టెలీకామ్ దిగ్గజ సంస్థల మధ్య వారం పాటు 40 రౌండ్స్ వరకు కొనసాగిన బిడ్డింగ్ వార్ కి తెరపడింది. 10 బ్యాండ్స్ వ్యాప్తంగా […]

The post అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ లో 51,236 మెగాహెర్ట్జ్ అమ్మకంతో ముగిసిన 5జీ వేలం
  • రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన రిలయన్స్ జియో
  • రూ.43,084 కోట్ల విలువైన 19,867 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసిన భారతి ఎయిర్టెల్

5జీ వేలం నేపథ్యంలో టెలీకామ్ దిగ్గజ సంస్థల మధ్య వారం పాటు 40 రౌండ్స్ వరకు కొనసాగిన బిడ్డింగ్ వార్ కి తెరపడింది. 10 బ్యాండ్స్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ లో 51,236 మెగాహెర్ట్జ్ (71 శాతం) 5జీ స్పెక్ట్రమ్ అమ్ముడైంది. రూ.88,078 కోట్ల విలువైన 24,740 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ కొన్న రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. రూ.43,084 కోట్ల విలువైన 19,867 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసి భారతి ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. రూ.18,784 కోట్ల విలువైన 6,228 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసి వొడాఫోన్ ఐడియా మూడోస్థానంలో నిలిచింది. ఇక కొత్తగా వచ్చిన అదానీ డేటా నెట్వర్క్స్ రూ.212 కోట్ల విలువైన 400 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. వేలం ద్వారా ప్రభుత్వానికి 5జీ వేలం ద్వారా బిడ్స్ రూపంలో రూ.1,50,173 కోట్ల మొత్తం సమకూరింది.

10 బ్యాండ్స్ లో ప్రభుత్వం స్పెక్ట్రమ్ ని ఆఫర్ చేసింది. అయితే మొత్తం బిడ్డింగ్ 3,300 మెగాహెర్ట్జ్ మరియు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ కోసం జరిగింది. ఇక వేలంలో 700 మెగాహెర్ట్జ్ కి అయితే భారీ డిమాండ్ కనిపించింది. 600 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 2,300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ కైతే ఎవరు కూడా బిడ్స్ వేయలేదు. ప్రభుత్వానికి తొలి ఏడాది, స్పెక్ట్రమ్ ద్వారా రూ.13,365 కోట్ల పేమెంట్ వస్తుందని, ఇక 5జీ సేవలు అక్టోబర్ లో దేశంలో లాంచ్ అవుతాయని టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

భారీ డిమాండ్ కలిగిన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్, 6 నుంచి 10 కిలోమీటర్ల సిగ్నల్ రేంజ్ ని కలిగి ఉంటుంది. దీనిపైనే రిలయన్స్ జియో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టింది. అలాగే మిగతా బ్యాండ్స్ లలో కూడా స్పెక్ట్రమ్ ని కూడా కొనుగోలు చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్ లో 5జీ సేవలు కల్పించాలనే లక్ష్యంతో జియో 700Mhz పై ఎక్కువగా వెచ్చించింది. ఇక 700 మెగాహెర్ట్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కనుక వాడినట్లైతే ఒకే ఒక్క టవర్ తో ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయవచ్చు. ఇక జియోకి గట్టి పోటీదారు అయిన మరో దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ 3.3-3.67 గిగాహెర్ట్జ్ మరియు 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ లలో 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. ఇక 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీస్ లో ఎంతో సెలెక్టివ్ గా కొనుగోళ్ళు జరిపింది.

ఇప్పుడు వొడాఫోన్ ఐడియా జరిపిన లావాదేవీలను గురించి తెలుసుకుందాం. మిడ్-బ్యాండ్ 5జీ స్పెక్ట్రమ్ లో 3300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ని 17 సర్కిల్స్ కొరకు, 16 సర్కిల్స్ లో 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ని వీఐ కొనుగోలు చేసింది. ఇక ప్రైవేట్ టెలీకామ్ నెట్వర్క్ ను సెటప్ చేయడానికి అదాని గ్రూప్ 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ లో స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది.

The post అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు first appeared on 91Mobiles Telugu.

]]>
5G వేలం రెండో రోజు విశేషాలు: రూ.1.49 లక్షల కోట్లు దాటిన బిడ్డింగ్ https://www.91mobiles.com/telugu/5g-auction-day-2-roundup-bidding-1-49-trillion/ Thu, 28 Jul 2022 11:06:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=1335 హైలైట్స్: నిన్నటితో పోల్చితే మరో రూ.4000 కోట్లు పెరిగిన ప్రభుత్వ లాభం రెండో రోజైన బుధవారం నాడు రూ.1.49 లక్షల కోట్లకు చేరిన 5జీ స్పెక్ట్రమ్ సేల్ హువావే, జెడ్టీఈ లకు భారత్ లో 5జీ దారులను మూసేసిన జియో, ఎయిర్టెల్ రెండో రోజున 5జీ నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వం ఇప్పటికే సముపార్జించిన రూ.1.45 లక్షల కోట్ల మొత్తానికి మరొక రూ.4 వేల కోట్లను ప్రోగు చేసింది. దీంతో బిడ్ మొత్తం విలువ రూ.1.49 లక్షల […]

The post 5G వేలం రెండో రోజు విశేషాలు: రూ.1.49 లక్షల కోట్లు దాటిన బిడ్డింగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నిన్నటితో పోల్చితే మరో రూ.4000 కోట్లు పెరిగిన ప్రభుత్వ లాభం
  • రెండో రోజైన బుధవారం నాడు రూ.1.49 లక్షల కోట్లకు చేరిన 5జీ స్పెక్ట్రమ్ సేల్
  • హువావే, జెడ్టీఈ లకు భారత్ లో 5జీ దారులను మూసేసిన జియో, ఎయిర్టెల్

రెండో రోజున 5జీ నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వం ఇప్పటికే సముపార్జించిన రూ.1.45 లక్షల కోట్ల మొత్తానికి మరొక రూ.4 వేల కోట్లను ప్రోగు చేసింది. దీంతో బిడ్ మొత్తం విలువ రూ.1.49 లక్షల కోట్లకు చేరింది.

బుధవారం నాడు, మిడ్ బ్యాండ్ అయిన సీ-బ్యాండ్ (3.3 – 3.67 గిగాహెర్ట్జ్) మరియు హై బ్యాండ్ (26 గిగాహెర్ట్జ్) లకై టెలీకామ్ కంపెనీలు ఇంటెన్స్ గా బిడ్డింగ్ వేశాయి. మూడవ రోజైన గురువారం నాడు సేల్ ముగుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముందే అనుకున్నట్లుగా, దేశంలో 5జీ సేవలు అక్టోబర్ నుంచి మొదలు కానున్నాయి. ప్రభుత్వం డెడ్ లైన్ ఆగస్టు 14 లోపు స్పెక్ట్రమ్ ను కేటాయించనుంది.

రెండో రోజు జరిగిన 5జీ వేలం గురించి కమ్యూనికేషన్స్ మినిస్టర్ అశ్వనీ వైష్ణవ్ రిపోర్టర్స్ తో మాట్లాడారు. “ఇప్పటి వరకు, 9వ రౌండ్ ముగిసే సరికి, రూ.1,49,454 కోట్లను ఆర్జించామని” మంత్రి చెప్పారు. ఇండస్ట్రీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలో విజయం సాధించామని ఆయన అన్నారు.

భారత్ లో 5G వేలం

బుధవారం బిడ్డింగ్ ముగిసే నాటికి, జియో రూ.82,500 కోట్లను వెచ్చించింది. రూ.46,000 కోట్లతో ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఉంది. ఇక వొడాఫోన్ ఐడియా (వీఐ) రూ.19,000 కోట్లు వెచ్చించి మూడవ స్థానంలో నిలిచింది. మరోవైపు, కొత్తగా ప్రవేశించిన అదాని డేటా వర్క్స్ రూ.900 నుంచి రూ.1000 కోట్ల మధ్య హై-బ్యాండ్ కొరకు బిడ్ వేశారు. విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం, 700 గిగాహెర్ట్జ్ బ్యాండ్ దక్కించుకున్న ఒకే ఒక్క టెలీకామ్ కంపెనీ జియో అని తెలుస్తోంది. మిగతా 5జీ సర్వీసెస్ కి ఈ పరిణామం పోటీని కలిగించే అవకాశముంది.

తూర్పు-ఉత్తరప్రదేశ్, ఒడిశా సర్కిల్స్ లో 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ విషయమై, జియో మరియు ఎయిర్టెల్ మధ్య బిడ్డింగ్ సరళిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని ఒక ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. “ప్రత్యేకించి యూపీ-ఈస్ట్ లో చాలా డిమాండ్ ఉంది, దీంతో బిడ్డింగ్ లో అలజడి రేగింది,” అని సదరు ఎగ్జిక్యూటివ్ (via) చెప్పారు. యూపీ ఈస్ట్ లో లక్నో, ప్రయాగ్ రాజ్, వారణాసి, గోరఖ్ పూర్ వంటి నగరాలు ఉన్నాయి.

అలాగే మేజర్ టెలీకామ్ ఆపరేటర్స్ అయిన ఎయిర్టెల్, జియో.. జమ్ము మరియు కశ్మీర్, నార్త్ ఈస్ట్, కర్ణాటక, కేరళ, యూపీ-వెస్ట్, రాజస్తాన్, ఎంపీ, హిమాచల్ ప్రదేశ్ లతో కలుపుకుని మొత్తం ఎనిమిది సర్కిల్స్ కు సంబంధించిన మిడ్-బ్యాండ్ తరంగాల కోసం బిడ్డింగ్ లో పోటీపడ్డారు. కేరళ లో 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం మరోమారు ఇరు టెలీకామ్ ఆపరేటర్ల నడుమ ఇంటెన్స్ బిడ్డింగ్ జరిగింది.

“ఏ ప్రాంతమైనా సరే, కవరేజీ ఎంటో ముఖ్యం. మంచి కవరేజీ కొరకు మీకు లో-బ్యాండ్ కీలకం. సుదూర ప్రాంతాలకు ఈ బ్యాండ్ హై క్వాలిటీ సర్వీస్ ను అందించగలదు,” అని మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. ఇక 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ యొక్క ధరను 40 శాతం మేర తగ్గించడం జరిగింది. అయితే, ఈ బ్యాండ్ ఖరీదు చాలా ఎక్కువగా ఉందని, అందుచేత, గత రెండు ఆక్షన్స్ లో కూడా వాటిని పెద్దగా కొనలేదని, టెలీకమ్ టైకూన్స్ తెలిపారు.

5G Gear భాగస్వాములను ఎంచుకున్న టెలీకామ్ కంపెనీలు

జియో మరియు ఎయిర్టెల్ తమ 5జీ భాగస్వాములను ఎంపిక చేసుకున్నాయి. వీటిలో ఫిన్ లాండ్ కు చెందిన నోకియా, స్వీడెన్ కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్ ఉన్నాయి. భారత్ లో 5జీ రోలౌట్స్ కొరకు హువావే మరియు జెడ్టీఈ లకు ఎంట్రీ (via) రద్దైనది.

The post 5G వేలం రెండో రోజు విశేషాలు: రూ.1.49 లక్షల కోట్లు దాటిన బిడ్డింగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం, సోషల్ మీడియాలో BSNL పై ట్రోలింగ్ https://www.91mobiles.com/telugu/5g-auction-bsnl-facing-trolling/ Tue, 26 Jul 2022 13:02:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=1265 హైలైట్స్: భారత్ లో మొదలైన 5జీ స్పెక్ట్రమ్ వేలం పాల్గొన్న అదానీ గ్రూప్, జియో, ఎయిర్టెల్, వీఐ సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ పై ట్రోలింగ్ భారత్ యొక్క తొలి 5జీ స్పెక్ట్రమ్ వేలం నేడు జరిగింది. నేడు ఉదయం 10 గంటలకు మొదలైన వేలం, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రూ.4.3 లక్షల కోట్ల విలువ గల, 10 బ్యాండ్స్ పరిధిలోని 72 గిగా హెర్ట్జ్ ఎయిర్ వేవ్స్ కై రిలయన్స్ జియో, ఎయిర్టెల్ టాప్ […]

The post 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం, సోషల్ మీడియాలో BSNL పై ట్రోలింగ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో మొదలైన 5జీ స్పెక్ట్రమ్ వేలం
  • పాల్గొన్న అదానీ గ్రూప్, జియో, ఎయిర్టెల్, వీఐ
  • సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ పై ట్రోలింగ్

భారత్ యొక్క తొలి 5జీ స్పెక్ట్రమ్ వేలం నేడు జరిగింది. నేడు ఉదయం 10 గంటలకు మొదలైన వేలం, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రూ.4.3 లక్షల కోట్ల విలువ గల, 10 బ్యాండ్స్ పరిధిలోని 72 గిగా హెర్ట్జ్ ఎయిర్ వేవ్స్ కై రిలయన్స్ జియో, ఎయిర్టెల్ టాప్ బిడ్డర్స్ గా నిలవనున్నారని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థ తో పాటు, కొత్త పోటీదారు అదానీ కూడా వేలం లో పాల్గొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బిడ్డర్స్ లిస్ట్ లో బీఎస్ఎన్ఎల్ పేరు లేదు. దీంతో అందరూ షాకవుతున్నారు. ఇటు బీఎస్ఎన్ఎల్ యూజర్లు, అటు ఇతర కంపెనీల వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ పరిస్థితిని చూసి నిర్ఘాంతపోతున్నారు.

ప్రభుత్వంచే నడపబడుచున్న బీఎస్ఎన్ఎల్ 5జీ స్పెక్ట్రమ్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి బీఎస్ఎన్ఎల్ 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనకపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను అందించడం మొదలుపెట్టాల్సి ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ లక్ష్యం 4జీ సేవలను లాంచ్ చేయడం, 2024 కల్లా 4జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ తరుణంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం జరుగుతుండటంతో అందరి దృష్టి బీఎస్ఎన్ఎల్ పై పడింది. ఇక ఇదే అదనుగా పలువురు నెటిజన్లు, సోషల్ మీడియాలో బీఎస్ఎన్ఎల్ ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ యూజర్లతో పాటు, నాన్-యూజర్లు కూడా సదరు సంస్థ 5జీ సేవలు అందించాలంటే ఇంకెంత కాలం పడుతుందోనని ఆలోచనలో పడ్డారు. 3300 మెగాహెర్ట్జ్ నుంచి 3670 మెగాహెర్ట్జ్ బ్యాండ్ మధ్యలో తమ కొరకు 70 మెగాహెర్ట్జ్ 5జీ స్పెక్ట్రమ్ ను రిజర్వ్ చేసి ఉంచాలని, టెలీకమ్యూనికేషన్స్ విభాగాన్ని జూన్ నెలలో బీఎస్ఎన్ఎల్ కోరడం జరిగింది. దీంతో ప్రైవేట్ టెలీకామ్ కంపెనీలైన ఎయిర్టెల్, జియో, వీఐ లు 5జీ స్పెక్ట్రమ్ యొక్క చిన్న పూల్ కొరకు బిడ్ వేయాల్సి ఉంటుంది. తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి, బీఎస్ఎన్ఎల్ యొక్క 5జీ స్పెక్ట్రమ్ రిజర్వేషన్ అభ్యర్థనను కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది.

4జీ సేవలు లాంచ్ చేసిన ఏడాది లోపలే 5జీ సేవలను అందించగలిగే స్థితిలో బీఎస్ఎన్ఎల్ ఉంటుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కానీ బీఎస్ఎన్ఎల్ ఎప్పుడు 4జీ సేవలను లాంచ్ చేస్తుంది? 2022 ఆగస్టు 15 నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభిస్తుందని కొంతమంది నమ్ముతున్నారు. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం 2024 లోనే 4జీ సేవలను రోలౌట్ చేయనుందని తెలుస్తోంది. ఈ గందరగోళానికి తెరపడేది ఎప్పుడో తెలియదు. ఎలా చూసినా, ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ దుస్థితిని చూసి, అందరూ పెదవి విరుస్తున్నారు. మరోవైపు, బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులను ఆకర్షించడానికి తక్కువ ధరల్లో ప్లాన్స్ ని అందిస్తోంది. దాంతో, డేటా మరియు కాలింగ్ కోసం ఎక్కువ మొత్తం వెచ్చించలేని వారు, బీఎస్ఎన్ఎల్ చెంతకు చేరుతున్నారు. ఇక 4జీ సేవలపై స్పష్టత రావాలంటే, ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

The post 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం, సోషల్ మీడియాలో BSNL పై ట్రోలింగ్ first appeared on 91Mobiles Telugu.

]]>