CMF Phone (1) - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Sep 2024 17:57:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/ https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/#respond Tue, 17 Sep 2024 17:14:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13551 Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి […]

The post Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

Realme 13 స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌ని ఓ మోస్తరు ధరలో చక్కటి మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ తో పోటీపడేందుకు మరొక ఫోన్ CMF Phone 1 పేరుతో లాంచ్ అయ్యింది. రియల్మీ 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇవ్వగా, సీఎంఎఫ్ ఫోన్ 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. నేడు ఈ రెండు ఫోన్లను మనం పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం.

Realme 13 vs CMF Phone 1: ధరలు

స్టోరేజీ వేరియంట్స్ రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
6జిబి+128జిబి రూ.15,999
8జిబి+128జిబి రూ.17,999 రూ.17,999
8జిబి+256జిబి రూ.19,999

 

గీక్‌బెంచ్

ఇప్పుడు రెండు ఫోన్ల యొక్క గీక్‌బెంచ్ స్కోర్లను చెక్ చేద్దాం. ఈ టెస్ట్ కోసం రెండు ఫోన్ల యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ ను ఎంచుకోవడం జరిగింది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

స్కోర్లను బట్టి చూస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1, రియల్మీ 13 కంటే బెటర్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ టెస్టుల్లో రియల్మీ 13 వెనకబడింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ అనేది బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్ లపై ప్రభావం చూపుతుంది. మరోవైపు, మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి హెవీ టాస్కులపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్స్ ప్రకారం, సీఎంఎఫ్ ఫోన్ 1 లో ఈ అన్నీ టాస్కులు స్మూథ్ గా నడుస్తాయని స్పష్టమవుతోంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
సింగిల్-కోర్ 782 1015
మల్టీ-కోర్ 1978 2867

 

విజేత: CMF Phone 1

అంటుటు

గీక్‌బెంచ్ కంటే మరింత లోతైన ఫలితాలను అంటుటు అందిస్తుంది. ఇది సీపీయూ, జీపీయూ, మెమొరీ మరియు యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ఇక్కడ కూడా.. అంటుటు స్కోర్ల విషయానికి వస్తే, రియల్మీ 13 పై సీఎంఎఫ్ ఫోన్ 1 పైచేయి సాధించింది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)

రెండు ఫోన్ల యొక్క ఫలితాలను గమనిస్తే, సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క జీపీయూ స్కోర్ ఎక్కువగా ఉంది. ఇతర స్కోర్లు కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. రియల్మీ 13 తో పోల్చితే, సీఎంఎఫ్ ఫోన్ 1 అన్ని విభాగాల్లోనూ బెటర్ గా పెర్ఫామర్ గా నిలిచింది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
అంటుటు 4,52,218 6,42,187

 

విజేత: CMF Phone 1

సీపీయూ థ్రాట్లింగ్ టెస్ట్

తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందో అనే విషయాన్ని సీపీయూ థ్రాట్లిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ కోసం మేము, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ను ఉపయోగించాం. ఈ టెస్టులో సీఎంఎఫ్ ఫోన్ 1 కంటే రియల్మీ 13 మంచి స్కోర్ చేసింది. మీరు గనుక, రోజూ ఎక్కువగా గేమ్స్ ఆడటంతో పాటు ఇంటెన్సివ్ టాస్కులు చేస్తే, మీకు రియల్మీ 13 బాగా సరిపోతుంది.

రియల్మీ 13 (ఎడమ) – సీఎంఎఫ్ ఫోన్ 1 (కుడి)
రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
ఒత్తిడి సమయంలో పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ 63.5 58.2

 

విజేత: Realme 13

గేమింగ్ టెస్ట్

మేం రెండు ఫోన్లలోనూ ఒక్కో దానిలో 30 నిమిషాల చొప్పున కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్‌లను ఆడాం. ఈ మూడు గేముల్లోనూ సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హీట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే.. 90 నిమిషాల గేమింగ్ సెషన్ తర్వాత, రియల్మీ 13 యొక్క టెంపరేచర్ 15.3 డిగ్రీలు పెరిగింది. సీఎంఎఫ్ ఫోన్ 1 యొక్క టెంపరేచర్ 14.6 డిగ్రీలు పెరిగింది.

థర్మల్స్ విషయానికి వస్తే, రెండు ఫోన్లలో పెద్దగా తేడా లేదు. అయితే, మీరు గనుక రోజూ గేమ్స్ ఆడే వారైతే, మీకు సీఎంఎఫ్ ఫోన్ 1 బెటర్ ఆప్షన్ అవుతుంది.

రియల్మీ 13 సీఎంఎఫ్ ఫోన్ 1
90 నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 5.1 డిగ్రీల సెల్సియస్ 4.86 డిగ్రీల సెల్సియస్

 

విజేత: CMF Phone 1

ఏది బెటర్?

అన్ని ఫలితాలను బట్టి చూస్తే, Realme 13 పై CMF Phone 1 విజయం సాధించిందని అర్థమవుతోంది. మంచి బెంచ్‌మార్క్ ఫలితాలను సీఎంఎఫ్ ఫోన్ 1 కలిగి ఉంది. గేమింగ్ పెర్ఫామెన్స్ కూడా బాగుంది. హీట్ మేనేజ్మెంట్ ఫర్వాలేదు. రెండు ఫోన్లలో CMF Phone 1 బెటర్ చాయిస్ అని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే, దీని ధర కూడా తక్కువే.

ఈ స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: గౌరవ్ శర్మ

The post Realme 13 vs CMF Phone 1: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-vs-cmf-phone-1-performance-comparison-which-performs-well/feed/ 0
CMF Phone 1: 2000 నిట్స్ బ్రైట్నెస్, ఎల్టీపీఎస్ స్క్రీన్‌తో లాంచైన సీఎంఎఫ్‌ ఫోన్ 1 https://www.91mobiles.com/telugu/cmf-phone-1-launched-india-2000-nits-brightness-ltps-screen/ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-launched-india-2000-nits-brightness-ltps-screen/#respond Mon, 08 Jul 2024 11:07:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12402 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. యూనిక్ డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 2000 నిట్స్ బ్రైట్నెస్, ఎల్టీపీఎస్ స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు […]

The post CMF Phone 1: 2000 నిట్స్ బ్రైట్నెస్, ఎల్టీపీఎస్ స్క్రీన్‌తో లాంచైన సీఎంఎఫ్‌ ఫోన్ 1 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో CMF Phone 1 లాంచ్
  • సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్
  • CMF Phone 1 ప్రారంభ ధర రూ.15,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. యూనిక్ డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 2000 నిట్స్ బ్రైట్నెస్, ఎల్టీపీఎస్ స్క్రీన్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

CMF Phone 1 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటి ధరలు తెలుసుకుందాం. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.

యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు వన్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొనే వారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

జులై 12వ తేదీ నుంచి ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా CMF Phone 1 సేల్స్ ప్రారంభమవుతాయి.

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్ బ్లూ మరియు ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిలో బ్లాక్, లైట్ గ్రీన్ కలర్ మోడల్స్ కేస్ తో కలగలిపి నిర్మితమయ్యాయి. మరోవైపు, బ్లూ మరియు ఆరెంజ్ వేరియంట్స్ వీగన్ లెదర్ ఫినిష్ తో వచ్చాయి.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 395 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. అంటుటు బెంచ్‌మార్క్ పై దీని స్కోర్ 6,73,000 గా నమోదైంది.

ర్యామ్, స్టోరేజీ: CMF Phone 1 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: CMF Phone 1 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, పొట్రెయిట్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్డ్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: CMF Phone 1 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 13 5జీ బ్యాండ్స్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: CMF Phone 1 లో ఐపీ52 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post CMF Phone 1: 2000 నిట్స్ బ్రైట్నెస్, ఎల్టీపీఎస్ స్క్రీన్‌తో లాంచైన సీఎంఎఫ్‌ ఫోన్ 1 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/cmf-phone-1-launched-india-2000-nits-brightness-ltps-screen/feed/ 0
CMF Phone 1: డైమెన్సిటీ 7300 చిప్‌తో వస్తోన్న సీఎంఎఫ్ ఫోన్ 1 https://www.91mobiles.com/telugu/cmf-phone-1-to-feature-dimensity-7300-chip/ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-to-feature-dimensity-7300-chip/#respond Wed, 03 Jul 2024 16:38:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=12358 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ కానుంది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ డిఫరెంట్ డిజైన్ తో వస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన డివైజ్ ఇమేజెస్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. జులై 8వ తేదీన ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. CMF […]

The post CMF Phone 1: డైమెన్సిటీ 7300 చిప్‌తో వస్తోన్న సీఎంఎఫ్ ఫోన్ 1 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 8న CMF Phone 1 లాంచ్
  • 50ఎంపి సోని మెయిన్ కెమెరా
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ కానుంది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ డిఫరెంట్ డిజైన్ తో వస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన డివైజ్ ఇమేజెస్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. జులై 8వ తేదీన ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ షేర్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

అఫీషియల్ టీజర్ ప్రకారం, CMF Phone 1 డివైజ్ 50ఎంపి రియర్ కెమెరా, సోని సెన్సర్, 2ఎక్స్ ఇన్-సెన్సర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అల్ట్రావైడ్ లెన్స్, పొట్రెయిట్ కెమెరా ఉండనున్నాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ చిప్సెట్ తో CMF Phone 1 భారత్ లో లాంచ్ అవుతోంది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి బూస్టర్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

CMF Phone 1 ఫోన్ సూపర్‌అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లు ఇదివరకే సీఎంఎఫ్ బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. స్క్రీన్ సైజ్ ఇంకా ఖరారు కాలేదు.

ఫోన్ లుక్ గురించి మాట్లాడితే, బ్యాక్ ప్యానెల్ పై ఒక స్క్రూ ఉంది. ఇంకా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

CMF Phone 1 ధర, కలర్ ఆప్షన్స్ (అంచనా)

లీక్ ప్రకారం, CMF Phone 1 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా పెట్టారు. ఆరెంజ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: CMF Phone 1 డివైజ్ లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.

కెమెరా: CMF Phone 1 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని సమాచారం. రియర్ కెమెరాపై బ్రాండ్ నుంచి స్పష్టత వచ్చింది.

సాఫ్ట్‌వేర్: CMF Phone 1 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: CMF Phone 1 డివైజ్ ఐపీ52 రేటింగ్, మోనో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post CMF Phone 1: డైమెన్సిటీ 7300 చిప్‌తో వస్తోన్న సీఎంఎఫ్ ఫోన్ 1 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/cmf-phone-1-to-feature-dimensity-7300-chip/feed/ 0
CMF Phone 1: లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/cmf-phone-1-specs-and-indian-market-price-leaked/ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-specs-and-indian-market-price-leaked/#respond Thu, 27 Jun 2024 17:14:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=12266 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ అవ్వబోతోంది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ మరియు భారత మార్కెట్ ధర వివరాలు టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (లీక్) డిస్ప్లే: CMF Phone 1 లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ […]

The post CMF Phone 1: లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో CMF Phone 1 లాంచ్
  • కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ అవ్వబోతోంది. CMF Phone 1 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ మరియు భారత మార్కెట్ ధర వివరాలు టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.

మెమొరీ: CMF Phone 1 డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు స్టోరేజీని పెంచుకునే వీలుంటుంది.

కెమెరా: CMF Phone 1 లో 50ఎంపి సోని మెయిన్ సెన్సర్, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4కే వీటియో రికార్డింగ్, ఏఐ వివిడ్ మోడ్, ఈఐఎస్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటాయి.

ఓఎస్: CMF Phone 1 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది. 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: CMF Phone 1 లో ఐపీ52 రేటింగ్, మోనో స్పీకర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

CMF Phone 1 ధర, కలర్ ఆప్షన్స్ (లీక్)

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. వీటి ధరలు ఎలా ఉండనున్నాయో చూద్దాం.

CMF Phone 1 యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999 గా ఉంటుంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

ఈ ఫోన్ ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని గత నివేదికల ద్వారా తెలిసింది. కానీ, ఇప్పుడు కాదని అర్థమవుతోంది.

ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆరెంజ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post CMF Phone 1: లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/cmf-phone-1-specs-and-indian-market-price-leaked/feed/ 0
CMF Phone 1: భారత్‌లో జులై 8 న లాంచ్ కానున్న సీఎంఎఫ్ ఫోన్ 1 https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-date-july-8-official/ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-date-july-8-official/#respond Tue, 18 Jun 2024 14:24:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=12126 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో CMF Phone 1 భారత్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జులై 8వ తేదీన సీఎంఎఫ్ ఫోన్ 1 ఇండియాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఫోన్ ఆసక్తికరమైన ఫీచర్లు మరియు యూనిక్ లుక్ తో వస్తోంది. ఓసారి CMF Phone 1 యొక్క లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post CMF Phone 1: భారత్‌లో జులై 8 న లాంచ్ కానున్న సీఎంఎఫ్ ఫోన్ 1 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 8న భారత్ లో CMF Phone 1 లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
  • అదే రోజున వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2 విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో CMF Phone 1 భారత్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జులై 8వ తేదీన సీఎంఎఫ్ ఫోన్ 1 ఇండియాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈ ఫోన్ ఆసక్తికరమైన ఫీచర్లు మరియు యూనిక్ లుక్ తో వస్తోంది. ఓసారి CMF Phone 1 యొక్క లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

CMF Phone 1 లాంచ్ తేదీ

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ యొక్క టీజర్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై మరియు ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ పై సీఎంఎఫ్ బ్రాండ్ షేర్ చేసింది.

CMF Phone 1 తో పాటు వాచ్ ప్రో 2 మరియు బడ్జ్ ప్రో 2 లను కూడా లాంచ్ చేయనున్నట్లు సీఎంఎఫ్ తెలిపింది.

జులై 8వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ లో CMF Phone 1 లాంచ్ అవుతుంది.

టీజర్ వీడియో ద్వారా డివైజ్ యొక్క వివరాలను బ్రాండ్ రివీల్ చేయలేదు. అయితే ఈ ఫోన్ ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.

రానున్న రోజుల్లో డివైజ్ కి సంబంధించిన మరింత సమాచారం రివీల్ అవుతుందని కంపెనీ తెలిపింది.

CMF Phone 1 ధర (లీక్)

లీక్ ప్రకారం, CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంటుందని సమాచారం. ఇది బాక్స్ ధర అయ్యే అవకాశం ఉంది. అయితే, ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ రూ.17,000 కి లభిస్తుందని తెలుస్తోంది. అసలు ధర లాంచ్ సమయంలో రివీల్ కానుంది.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్.

మెమొరీ: CMF Phone 1 రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ.

కెమెరా: CMF Phone 1 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post CMF Phone 1: భారత్‌లో జులై 8 న లాంచ్ కానున్న సీఎంఎఫ్ ఫోన్ 1 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-date-july-8-official/feed/ 0
CMF Phone (1): లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-date-leaked/ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-date-leaked/#respond Mon, 17 Jun 2024 17:25:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12113 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ కానుంది. CMF Phone (1) పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జులై 5వ తేదీన CMF Phone (1) భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంకా అధికార ప్రకటన చేయలేదు. సరే, ఓసారి లీకైన వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. CMF […]

The post CMF Phone (1): లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 5న CMF Phone (1) లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్
  • 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో మొదటి ఫోన్ లాంచ్ కానుంది. CMF Phone (1) పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జులై 5వ తేదీన CMF Phone (1) భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. అయితే కంపెనీ ఇంకా అధికార ప్రకటన చేయలేదు. సరే, ఓసారి లీకైన వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

CMF Phone (1) ఇండియా లాంచ్ తేదీ

CMF Phone (1) యొక్క లాంచ్ తేదీ వివరాలను టిప్‌స్టర్ @Technerd_9 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేసింది.

లీక్ ప్రకారం, CMF Phone (1) డివైజ్ భారతీయ మార్కెట్ లో జులై 5వ తేదీన లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.

CMF Phone (1) యొక్క అఫీషియల్ డిజైన్ జూన్ 26న విడుదల అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

రివీలైన పిక్ గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి.

పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉంది. ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై స్క్రూ కనిపిస్తోంది. సొంతంగా రిపేరు చేసుకోదగిన ఫోన్ అని ఈ స్క్రూ ద్వారా అర్థమవుతోంది.

CMF Phone (1) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: CMF Phone (1) లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: CMF Phone (1) లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్.

మెమొరీ: CMF Phone (1) రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 128జిబి/256జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్.

కెమెరా: CMF Phone (1) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: CMF Phone (1) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: CMF Phone (1) డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

కనెక్టివిటీ: CMF Phone (1) లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post CMF Phone (1): లీకైన సీఎంఎఫ్ ఫోన్ 1 ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-date-leaked/feed/ 0
CMF Phone 1: లాంచ్‌కి ముందు రివీలైన సీఎంఎఫ్ ఫోన్ 1 భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-price-revealed-before-launch/ Mon, 10 Jun 2024 17:39:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=11990 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో CMF Phone 1 అనే స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. టీజర్ ఇమేజ్ ద్వారా లాంచ్‌ని సీఎంఎఫ్ బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. తాజాగా, CMF Phone 1 యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. CMF Phone 1 ధర (లీక్) CMF Phone […]

The post CMF Phone 1: లాంచ్‌కి ముందు రివీలైన సీఎంఎఫ్ ఫోన్ 1 భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో CMF Phone 1 లాంచ్
  • తాజాగా లీకైన ఇండియా ధర
  • ప్రారంభ ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing యొక్క సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో CMF Phone 1 అనే స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. టీజర్ ఇమేజ్ ద్వారా లాంచ్‌ని సీఎంఎఫ్ బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు. తాజాగా, CMF Phone 1 యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

CMF Phone 1 ధర (లీక్)

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. వీటి ధరలు తెలుసుకుందాం.

CMF Phone 1 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉండనుంది.

CMF Phone 1 6జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.21,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్, రూ.2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను బ్రాండ్ అందిస్తోంది.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: CMF Phone 1 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

మెమొరీ: CMF Phone 1 డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని అందిస్తున్నారు.

కెమెరా: CMF Phone 1 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

Source: 91Mobiles

The post CMF Phone 1: లాంచ్‌కి ముందు రివీలైన సీఎంఎఫ్ ఫోన్ 1 భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
CMF Phone 1 ఇండియా లాంచ్ ఖరారు, ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/cmf-phone-1-india-launch-confirmed-flipkart-teaser/ Thu, 06 Jun 2024 14:22:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=11946 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో ఒక చవకైన ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా CMF Phone 1 యొక్క టీజర్ ను సదరు బ్రాండ్ విడుదల చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ టీజర్‌ను చూడవచ్చు. ఓసారి CMF Phone 1 యొక్క టీజర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. CMF Phone 1 టీజర్ వివరాలు CMF Phone 1 టీజర్ ఇమేజ్‌ను గమనిస్తే, […]

The post CMF Phone 1 ఇండియా లాంచ్ ఖరారు, ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • CMF Phone 1 టీజర్ విడుదల
  • ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తోన్న ఫోన్
  • ధర రూ.20,000 లోపు ఉండే చాన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Nothing సబ్-బ్రాండ్ CMF నుంచి త్వరలో ఒక చవకైన ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా CMF Phone 1 యొక్క టీజర్ ను సదరు బ్రాండ్ విడుదల చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ టీజర్‌ను చూడవచ్చు. ఓసారి CMF Phone 1 యొక్క టీజర్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

CMF Phone 1 టీజర్ వివరాలు

CMF Phone 1 టీజర్ ఇమేజ్‌ను గమనిస్తే, డివైజ్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ లెదర్ టెక్షర్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

CMF Phone 1 డివైజ్‌కి కుడివైపున రొటేటింగ్ నాబ్ కనిపిస్తోంది. అయితే ఇది ఎందుకోసమో తెలియదు.

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే, జూన్ నెలలోనే లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు.

CMF Phone 1 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: CMF Phone 1 లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.

ప్రాసెసర్: CMF Phone 1 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌తో లాంచ్ కానుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: CMF Phone 1 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: CMF Phone 1 లో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: CMF Phone 1 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

కనెక్టివిటీ: CMF Phone 1 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post CMF Phone 1 ఇండియా లాంచ్ ఖరారు, ఫ్లిప్‌కార్ట్‌పై టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
CMF: లాంచ్‌కి ముందు లీకైన CMF Phone (1) ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/cmf-phone-1-price-specs-leaked-before-launch/ Wed, 08 May 2024 11:07:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=11414 తక్కువ సమయంలోనే ఎంతో పేరు సంపాదించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing. ఇప్పుడు ఈ కంపెనీ తన సబ్-బ్రాండ్ CMF పేరుతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. మొదటగా CMF Phone (1) అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. సరసమైన ధర, యూనిక్ లుక్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా బ్రాండ్ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, ఈలోపే 91mobiles కి CMF Phone (1) యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు అందాయి. ఓసారి […]

The post CMF: లాంచ్‌కి ముందు లీకైన CMF Phone (1) ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో CMF Phone (1) లాంచ్
  • లీకైన స్పెసిఫికేషన్స్, ధర
  • 5000mAh బ్యాటరీ, 33W చార్జింగ్

తక్కువ సమయంలోనే ఎంతో పేరు సంపాదించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing. ఇప్పుడు ఈ కంపెనీ తన సబ్-బ్రాండ్ CMF పేరుతో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. మొదటగా CMF Phone (1) అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. సరసమైన ధర, యూనిక్ లుక్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా బ్రాండ్ నుంచి అధికార ప్రకటన రాలేదు. కానీ, ఈలోపే 91mobiles కి CMF Phone (1) యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు అందాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

CMF Phone (1) ధర (లీక్)

91మొబైల్స్‌కి అందిన సమాచారం ప్రకారం, CMF Phone (1) స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.12,000 వద్ద ఉంటుందని తెలుస్తోంది. ఇదివరకు సీఎంఎఫ్ బ్రాండ్ తక్కువ ధరలో నెక్ బ్యాంక్, ఇయర్ బడ్స్, స్మార్ట్‌వాచ్ మరియు పవర్ బ్యాంక్ లను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఫోన్‌ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

CMF Phone (1) కలర్ మరియు డిజైన్ (లీక్)

CMF Phone (1) స్మార్ట్‌ఫోన్ ప్లాస్టిక్ బాడీతో వస్తున్నట్లు సమాచారం. ఎంట్రీ-లెవెల్ ఫోన్ కనుక, ఈ ఫోన్ లో ప్లాస్టిక్‌ని ఎక్కువగా వాడనున్నారు. ఫ్రంట్ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ఆరెంజ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

CMF Phone (1) స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: CMF Phone (1) లో 6.5-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ లేదా ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్ ఉంటాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ప్రాసెసర్: CMF Phone (1) లో మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ చిప్సెట్ ఉంటుంది. కచ్చితమైన వివరాలు తెలియదు.

బ్యాటరీ: CMF Phone (1) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: CMF Phone (1) స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

The post CMF: లాంచ్‌కి ముందు లీకైన CMF Phone (1) ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>