Disney Plus Hotstar - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 04 Dec 2023 17:25:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్! https://www.91mobiles.com/telugu/airtel-rs-869-prepaid-plan-launched-with-disney-plus-hotstar-and-other-benefits/ Mon, 04 Dec 2023 17:25:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9110 ప్రముఖ టెలీకామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ని తన యూజర్ల కోసం లాంచ్ చేసింది. రూ.869 విలువజేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney+ Hotstar (మొబైల్) 3 నెలల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ కి స్వల్ప మార్పులు చేసి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎయిర్టెల్ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి రూ.869 […]

The post Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో రూ.869 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన Airtel
  • 2జిబి డెయిటీ డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో ప్రయోజనాలు
  • ఎయిర్టెల్ అధికార వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో రూ.869 ప్లాన్

ప్రముఖ టెలీకామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ కొత్త 5జీ ప్రీపెయిడ్ ప్లాన్ ని తన యూజర్ల కోసం లాంచ్ చేసింది. రూ.869 విలువజేసే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Disney+ Hotstar (మొబైల్) 3 నెలల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ కి స్వల్ప మార్పులు చేసి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ని ఎయిర్టెల్ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సరే, ఓసారి రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా Airtel రూ.869 ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్) 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5జీ డేటా, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • డేటా పరిమితి అనంతరం, ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ కి పడిపోతుంది.
  • ఎయిర్టెల్ యొక్క అధికార వెబ్‌సైట్ లో రూ.869 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

Airtel రూ.839 ప్లాన్ ప్రయోజనాలు

  • ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.839 ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
  • ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్లాన్ ద్వారా కస్టమర్లకు డెయిలీ 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • రూ.839 ప్లాన్ ద్వారా ఇంకా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇటీవలె ఎయిర్టెల్ సంస్థ రూ.1,499 ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు డెయిలీ 3జిబి 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 84 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. 5జీ ప్లాన్ లో కస్టమర్ కి నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ప్రయోజనం లభిస్తుంది.
  • ఇక Netflix బేసిక్ ప్లాన్ ద్వారా కస్టమర్ ఏకకాలంలో ఒక డివైజ్ లో మాత్రమే కంటెంట్ ని ఎంజాయ్ చేయవచ్చు.
  • ఇంకా 720 పిక్సెల్ నాణ్యత తో వీడియో కంటెంట్ ని చూడవచ్చు. యూజర్ తన నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ని స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు, టీవీలు, ట్యాబ్లెట్స్ వంటి డివైజెస్ పై యాక్సెస్ చేయవచ్చు.
  • ఇంకా రూ.1,499 ప్లాన్ ద్వారా యూజర్లకు ఉచిత ఎయిర్టెల్ హలో ట్యూన్స్ లభిస్తాయి.

The post Airtel: రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్; డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
పుష్ప 2 (Pushpa 2) రిలీజ్‌కి ముందు Disney+ Hotstar లో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు చూడండి; లిస్ట్ చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/allu-arjun-movies-on-disney-plus-hotstar/ Fri, 15 Sep 2023 14:00:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=6961 DJ (Duvvada Jagannadham) S/O Satyamurthy Julai Yevadu టాప్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. అలాగే, ఉత్తరాదిన కూడా ఐకన్ స్టార్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన అల్లు అర్జున్ సినిమాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి. ప్యాన్ ఇండియా చిత్రం […]

The post పుష్ప 2 (Pushpa 2) రిలీజ్‌కి ముందు Disney+ Hotstar లో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు చూడండి; లిస్ట్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>

  1. DJ (Duvvada Jagannadham)
  2. S/O Satyamurthy
  3. Julai
  4. Yevadu

టాప్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. అలాగే, ఉత్తరాదిన కూడా ఐకన్ స్టార్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన అల్లు అర్జున్ సినిమాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి.

ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప తో అల్లు అర్జున్ ఇటు సౌత్, అటు నార్త్ లో ప్రభంజనం సృష్టించారు. ఉత్తరాది ప్రేక్షకులు పుష్ప చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేరళ లో బన్నీ స్టార్డమ్ గురించే మరి. ఎందుకుంటే మనోడికి అక్కడ ఆర్య సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.

అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2-ది రూల్’ విడుదల తేదీ వెల్లడైంది. ఈ చిత్రం 2024 ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం రావడం ఇంకా ఆలస్యం అయినప్పటికీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ యొక్క అనేక యాక్షన్-కామెడీ సినిమాలు OTTలో అందుబాటులో ఉన్నాయి, వీటిని మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూడవచ్చు. ఈ ఆర్టికల్ లో Disney+ Hotstar ఓటీటీ లో ఉన్న అల్లు అర్జున్ సినిమాల జాబితాను అందిస్తున్నాం. ఈ జాబితాలో సినిమాల పేర్లు, వాటి ఐఎండిబి రేటింగ్, నటీనటులు తదితర వివరాలను కూడా ఇస్తున్నాం. ఓసారి చదివేయండి మరి.

డీజే: దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 2017 జూన్ 23 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • థియెటర్ రిలీజ్: జూన్ 23, 2017
  • ఐఎండిబి రేటింగ్: 5.9/10
  • నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

S/O సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్, సమంతా జంటగా నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసాద్ మూరెళ్ళ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పని చేశారు.

  • థియెటర్ రిలీజ్: ఏప్రిల్ 8, 2015
  • నటీనటులు: అల్లు అర్జున్, సమంతా
  • ఐఎండిబి రేటింగ్: 7/10
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

జులాయి

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి చిత్రంలో అల్లు అర్జున్, ఇలియాన ప్రధాన పాత్రలు పోషించారు. సోను సూద్ విలన్ గా చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫర్లుగా చేశారు.

  • థియెటర్ రిలీజ్: ఆగస్టు 9, 2012
  • నటీనటులు: అల్లు అర్జున్, ఇలియాన
  • ఐఎండిబి రేటింగ్: 7.2/10
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

ఎవడు

ఎవడు చిత్రంలో రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. జయసుధర, సాయి కుమార్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సీ రాంప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా చేశారు.

  • థియెటర్ రిలీజ్: జనవరి 14, 2014
  • నటీనటులు: రాం చరణ్, శృతి హాసన్, అల్లు అర్జున్
  • ఐఎండిబి రేటింగ్: 5.8/10
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

The post పుష్ప 2 (Pushpa 2) రిలీజ్‌కి ముందు Disney+ Hotstar లో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు చూడండి; లిస్ట్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) https://www.91mobiles.com/telugu/best-telugu-films-on-ott-2023/ Sun, 13 Aug 2023 17:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7525 ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ […]

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు అంత ఈజీగా కొనడం లేదు. అంతేకదా, సినిమాలో దమ్ము లేకపోతే ఓటీటీల్లో అయినా ఏ ప్రేక్షకుడు చూస్తాడు చెప్పండి?

సరే, విషయంలోకి వద్దాం. 2023 లో విడుదలై ప్రస్తుతం ఓటీటీల్లో బాగా అలరిస్తోన్న తెలుగు సినిమాలేవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాబితాలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, నాని నటించిన దసరా, నాగ శౌర్య ‘రంగబలి’ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. సరే, పదండి మరి ఆ జాబితాపై ఓ లుక్ వేద్దాం.

Best Telugu Films On Netflix (2023)

రంగబలి

రంగబలి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నాగశౌర్య, యుక్తి తరేజా ప్రధాన పాత్రలు పోషించారు.

  • సినిమా పేరు: రంగబలి
  • ఐఎండీబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాగశౌర్య, యుక్తి తరేజా
  • విడుదల తేదీ – 7 జులై 2023

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జనవరి 12 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
  • ఐఎండిబి రేటింగ్– 6.2/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – చిరంజీవి, రవితేజ, శృతిహాసన్
  • విడుదల తేదీ – 12 జనవరి 2023

దసరా

దసరా చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 2023 మార్చి 30 న థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: దసరా
  • ఐఎండిబి రేటింగ్ – 6.7/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాని, కీర్తి సురేశ్
  • విడుదల తేదీ – 30 మార్చి 2023

Best Telugu Films On Amazon Prime (2023)

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ గాథను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2023 జూన్ 16 న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: ఆదిపురుష్
  • ఐఎండీబి రేటింగ్ – 3.2/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – ప్రభాస్, కృతీసనన్
  • విడుదల తేదీ – 16 జూన్ 2023

రుద్రాంగి

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రాంగి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాన్ని చూడాలనుకుంటే రుద్రాంగి ని చూసేయండి.

  • సినిమా పేరు: రుద్రాంగి
  • ఐఎమ్‌డిబి రేటింగ్ – 7.3/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – జగపతి బాబు, మమతా మోహన్ దాస్
  • విడుదల తేదీ – 7 July 2023

స్పై

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై సినిమా 2023 జూన్ 29 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: స్పై
  • ఐఎండిబి రేటింగ్ – 5.4/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్
  • విడుదల తేదీ – 29 జూన్ 2023

రావణాసుర

రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన రావణాసుర చిత్రం 2023 ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రావణాసుర
  • ఐఎండిబి రేటింగ్र – 5.7/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్
  • నటీనటులు – రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా
  • విడుదల తేదీ – 7 ఏప్రిల్ 2023

Best Telugu Films on Disney+ Hotstar (2023)

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 జనవరి 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వీర సింహారెడ్డి
  • ఐఎండిబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్
  • విడుదల తేదీ – 11 జనవరి 2023

బిచ్చగాడు 2

బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్యా తాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: బిచ్చగాడు 2
  • ఐఎండిబి రేటింగ్ – 5.6/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – విజయ్ ఆంటోని, కావ్యా తాపర్
  • విడుదల తేదీ – 19 మే 2023

Best Telugu Films on Sony Liv (2023)

పరేషాన్

పరేషాన్ చిత్రంలో తిరువీర్, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోని లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: పరేషాన్
  • ఐఎండిబి రేటింగ్ – 6.1/10
  • ఎక్కడ చూడాలి – సోని లివ్
  • నటీనటులు – తిరువీర్, పావని కరణం
  • విడుదల తేదీ – 2 June 2023

Best Telugu Films On Zee5 (2023)

రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రైటర్ పద్మభూషణ్
  • ఐఎండిబి రేటింగ్ – 7.7/10
  • ఎక్కడ చూడాలి – జీ5
  • నటీనటులు – సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ
  • విడుదల తేదీ – 3 ఫిబ్రవరి 2023

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel రూ.499 ప్లాన్: 3GB డెయిలీ డేటా, Disney+ Hotstar Mobile తో పాటు మరెన్నో బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/airtel-rs-499-prepaid-plan-benefits-disney-plus-hotstar-mobile-3gb-daily-data-free-calling-more-benefits/ Wed, 08 Feb 2023 11:08:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4849 భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్ల కోసం అందిస్తోంది. దీంతో ఎయిర్టెల్ వైపు జనాలు ఆకర్షితులవుతున్నారు. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్ ట్యాలీ లిస్ట్ లో ఎయిర్టెల్ లక్షల్లో సబ్‌స్క్రైబర్లను పొందినట్లు తెలిసింది. అయితే ఎయిర్టెల్ కంటే అత్యధిక యూజర్ బేస్ తో జియో సంస్థ ముందుంది. ఏదేమైనా జియో, ఎయిర్టెల్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. సరే, […]

The post Airtel రూ.499 ప్లాన్: 3GB డెయిలీ డేటా, Disney+ Hotstar Mobile తో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చక్కటి సిగ్నల్ కవరేజీతో పాటు, వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తోన్న Airtel
  • రూ.499 ప్లాన్ తో డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, ఫ్రీ కాలింగ్ తో పాటు మరెన్నో బెనిఫిట్స్
  • రూ.499 ప్లాన్ తో లభించనున్న 3జిబి డెయిలీ డేటా మరియు డిస్నీ+ హాట్‌స్టార్ కి ఉచిత యాక్సెస్

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. ఎయిర్టెల్ సంస్థ ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని తన యూజర్ల కోసం అందిస్తోంది. దీంతో ఎయిర్టెల్ వైపు జనాలు ఆకర్షితులవుతున్నారు. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన సబ్‌స్క్రైబర్ ట్యాలీ లిస్ట్ లో ఎయిర్టెల్ లక్షల్లో సబ్‌స్క్రైబర్లను పొందినట్లు తెలిసింది. అయితే ఎయిర్టెల్ కంటే అత్యధిక యూజర్ బేస్ తో జియో సంస్థ ముందుంది. ఏదేమైనా జియో, ఎయిర్టెల్ నడుమ ప్రధాన పోటీ నెలకొంది.

సరే, ఇప్పుడు Airtel అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా డెయిలీ డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ, ఉచిత కాలింగ్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఓసారి రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Airtel రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 28 రోజుల వ్యాలిడిటీ
  • డెయిలీ 3జిబి డేటా
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • ఉచిత కాలింగ్

Airtel అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 3జిబి డేటా లభిస్తుంది. అలాగే డెయిలీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా దేశంలోని ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఎయిర్టెల్ రూ.499 ప్లాన్ ద్వారా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Airtel రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • ఎక్స్‌ట్రిమ్ యాప్
  • డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్
  • అపోలో 24/7 సర్కిల్
  • ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్
  • ఉచిత హలో ట్యూన్స్
  • ఉచిత వింక్ మ్యూజిక్

Airtel అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా డేటా, వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్, ఉచిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు, అదనంగా రూ.149 విలువగల డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ కి 3 నెలల పాటు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇంకా ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ యాప్ కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇంకా ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే అపోలో 24/7 సర్కిల్ సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇంకా ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.499 ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? మరొక్కసారి ప్లాన్ ప్రయోజనాలను చదివి, మీకు సరిపోయేదైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel రూ.499 ప్లాన్: 3GB డెయిలీ డేటా, Disney+ Hotstar Mobile తో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel రూ.839 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్ https://www.91mobiles.com/telugu/airtel-rs-839-prepaid-plan-benefits-disney-plus-hotstar-xtream-sonyliv/ Tue, 10 Jan 2023 12:31:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4415 హైలైట్స్ ఎన్నో వాల్యూ ఫర్ మనీ కాంబో ప్లాన్స్ ని అందిస్తోన్న దిగ్గజ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ తో లభిస్తోన్న బోలెడన్ని ప్రయోజనాలు ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటాతో పాటు అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు […]

The post Airtel రూ.839 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఎన్నో వాల్యూ ఫర్ మనీ కాంబో ప్లాన్స్ ని అందిస్తోన్న దిగ్గజ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్
  • రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ తో లభిస్తోన్న బోలెడన్ని ప్రయోజనాలు
  • ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటాతో పాటు అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ కంపెనీలకు కూడా త్వరలో మంచి రోజులు రావాలని ఆశిద్దాం.

ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన యూజర్లను ఇట్టే ఆకర్షిస్తోంది ఎయిర్టెల్. ఇప్పటికే మార్కెట్ లో బలంగా పాతుకుపోయిన ఎయిర్టెల్, తన యూజర్ల కోసం విభిన్నమైన ప్లాన్స్ ని అందిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ తో పాటు 84 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ అందిస్తోంది. సరే రూ.839 ప్లాన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Airtel రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఇంకా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతేకాదండోయ్, ఈ ప్లాన్ తో అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

  • 84 రోజుల వ్యాలిడిటీ
  • ఉచిత కాల్స్
  • డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • డెయిలీ 2జిబి డేటా
  • డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
  • ఎక్స్‌ట్రిమ్ యాప్ యాక్సెస్
  • అపోలో 24/7 సర్కిల్
  • ఫ్రీ హలో ట్యూన్స్
  • ఫ్రీ వింక్ మ్యూజిక్

Airtel రూ.839 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • Disney+ Hotstar బెనిఫిట్స్

ఎయిర్టెల్ రూ.839 ప్లాన్ ద్వారా డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో పాటు ఇతర బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.

  • Xstream App బెనిఫిట్స్

యూజర్లకు ఎక్స్‌ట్రిమ్ యాప్ లోని ఏదైనా ఒక చానల్ కి 84 రోజుల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. సోనిలివ్, లయన్స్‌గేట్, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమామ్యాక్స్, చౌపాల్, కాంచా లంకా.. చానల్స్ లో ఒకదానికి ఉచిత యాక్సెస్ ని పొందవచ్చు. ఈ యాక్సెస్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

ఇంకా రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్, 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ ఉచిత సేవలు లభిస్తాయి. అలాగే ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉన్నాయండి. ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కి ఫ్రీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel రూ.839 ప్లాన్: Disney+ Hotstar తో పాటు మరెన్నో బెనిఫిట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OTT లో స్ట్రీమ్ అవుతోన్న శివకార్తికేయన్ నటించిన Prince https://www.91mobiles.com/telugu/prince-movie-starring-siva-karthikeyan-streaming-on-disney-plus-hotstar-ott/ Fri, 25 Nov 2022 13:54:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=3685 హైలైట్స్ ప్రిన్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన శివకార్తికేయన్, మరియా డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోన్న ప్రిన్స్ సినిమా ప్రిన్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ జాతిరత్నాలు చిత్రంతో బంపర్ హిట్ అందుకున్నాడు కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ. ఈ చిత్రం అతడికి అమితమైన ఆదరణను తెచ్చిపెట్టింది. ఈ దర్శకుడి కామెడీ టైమింగ్, డైలాగ్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆన్ స్క్రీన్ నటీనటులతో కామెడీ చేయించే ఈ దర్శకుడు, ఆఫ్ […]

The post OTT లో స్ట్రీమ్ అవుతోన్న శివకార్తికేయన్ నటించిన Prince first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రిన్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన శివకార్తికేయన్, మరియా
  • డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోన్న ప్రిన్స్ సినిమా
  • ప్రిన్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ

జాతిరత్నాలు చిత్రంతో బంపర్ హిట్ అందుకున్నాడు కొత్త దర్శకుడు అనుదీప్ కేవీ. ఈ చిత్రం అతడికి అమితమైన ఆదరణను తెచ్చిపెట్టింది. ఈ దర్శకుడి కామెడీ టైమింగ్, డైలాగ్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆన్ స్క్రీన్ నటీనటులతో కామెడీ చేయించే ఈ దర్శకుడు, ఆఫ్ స్క్రీన్ తానే స్వయంగా తనదైన పంచ్ లతో నవ్వులు పూయిస్తాడు. యూత్ లో ఈ దర్శకుడికి మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో కార్తికేయన్ తో ప్రిన్స్ అనే చిత్రాన్ని తీశాడు అనుదీప్ కేవీ. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో రూపొందింది. అయితే బాక్సీఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ప్రిన్స్ మూవీ తీసుకురాలేదు.

తెలుగు, తమిళ ప్రేక్షకులు అనుదీప్ కేవీ రైటింగ్, శివకార్తికేయన్ కామిక్ టైమింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో థియేటర్లలో ఈలలు పడటం అటుంచి, అసలు కొంచెం కూడా పాజిటివ్ టాక్ లేకుండా పోయింది. దీంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అక్కడక్కడ కొన్ని నవ్వులు తప్పితే సినిమాలో ఏమీ లేదని సగటు ప్రేక్షకులు డిసైడ్ చేశాడు. దీంతో ఇటు అనుదీప్ కి, అటు శివకార్తికేయన్ కి పరాభావం తప్పలేదు.

డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోన్న ప్రిన్స్

శివకార్తికేయన్ నటించిన ప్రిన్స్ చిత్రం యొక్క ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఈ చిత్రం నవంబర్ 25 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. దీంతో శివకార్తికేయన్, అనుదీప్ కేవీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సినిమా ఎలా ఉన్నా వీకెండ్ లో టైమ్ పాస్ గా ఓసారి చూసేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాని చూడని ఓటీటీ ఆడియన్స్ ఎలాగూ ఓసారి చూసేద్దామని డిసైడ్ అయిపోయారు. ఓటీటీ ప్రేక్షకులను ప్రిన్స్ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రిన్స్ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, శాంతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఉక్రెయిన్ కి చెందిన మరియా రయాబోష్పకా ఈ చిత్రంలో కథానాయికగా చేసింది. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. తమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.

చిత్ర కథ

సెకండరీ స్కూల్ లో టీచర్ గా చేసే ఆనంద్ అనే యువకుడి పాత్రలో శివకార్తికేయన్ నటించాడు. మరియా ఈ చిత్రంలో జెస్సికా అనే బ్రిటీష్ యువతిగా చేసింది. జెస్సికా కూడా అదే స్కూల్ లో టీచర్ గా చేరుతుంది. ఇక అక్కడ వీరిద్దరి ప్రేమాయణం మొదలవుతుంది. అటు తర్వాత చోటుచేసుకునే పరిణామాలే చిత్ర మిగతా కథ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OTT లో స్ట్రీమ్ అవుతోన్న శివకార్తికేయన్ నటించిన Prince first appeared on 91Mobiles Telugu.

]]>
ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న రామ్ నటించిన ‘THE WARRIOR’ https://www.91mobiles.com/telugu/ram-starrer-the-warrior-ott-update/ Mon, 01 Aug 2022 15:35:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=1413 హైలైట్స్: జులై 14 న విడుదలై థియేటర్లలో సందడి చేసిన ‘ది వారియర్’ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రామ్, కృతిశెట్టి. సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ దర్శకత్వం వహించిన లింగుసామి, విలన్ పాత్రలో మెప్పించిన ఆది పినిశెట్టి ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘ది వారియర్’ చిత్రం ఇటీవలె థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఎన్ లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ […]

The post ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న రామ్ నటించిన ‘THE WARRIOR’ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 14 న విడుదలై థియేటర్లలో సందడి చేసిన ‘ది వారియర్’
  • చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రామ్, కృతిశెట్టి. సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్
  • దర్శకత్వం వహించిన లింగుసామి, విలన్ పాత్రలో మెప్పించిన ఆది పినిశెట్టి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘ది వారియర్’ చిత్రం ఇటీవలె థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఎన్ లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా యొక్క అఫీషియల్ ఓటీటీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కుల్ని దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం ఆగస్టు 11 నుంచి ది వారియర్ స్ట్రీమ్ కానున్నట్లు డిస్నీ+ హాట్‌స్టార్ వెల్లడించింది. కృతిశెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

చిత్ర నటీనటులు:

ది వారియర్ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పథాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. కథను అందించిన ఎన్ లింగుసామి చిత్ర దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతిశెట్టి, అక్షర గౌడ, నదియ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సుజిత్ వాసుదేవ్ కెమెరామెన్ గా పని చేయగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

చిత్ర కథ:

కర్నూలు నగరంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సత్య అనే పోలీసు అధికారి, స్థానిక గూండా గురుని ఎలా ఎదుర్కున్నాడన్నదే చిత్ర ప్రధాన కథ. అయితే ఈ చిత్రంలో హీరో ఒక డాక్టర్, కానీ వ్యవస్థను బాగు చేసేందుకు పోలీసుగా మారతాడు. కథలో విలన్ పాత్ర పోషించిన ఆది పినిశెట్టి, మర్డర్ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటుతుంటాడు. సినిమాలో ఇదొక రకం ఆకర్షణ. ఇక కథానాయిక కృతిశెట్టి రేడియో జాకీ గా చేసింది. విజయ్ మహాలక్ష్మి పాత్రలో కృతి మెప్పించింది. అక్షర గౌడ, నదియా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇప్పుడు సినిమా సంగీతం గురించి తెలుసుకుందాం. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా విజిల్, బుల్లెట్ పాటలు సినిమాలో హైలైట్ అని చెప్పాలి. ఇక సంభాషణలు రాసిన సాయి మాధవ్ బుర్రా తనదైన శైలి డైలాగ్స్ తో ఫర్వాలేదనిపించారు.

హీరో రామ్ కి పోలీసు పాత్ర చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఎప్పటి నుంచో పోలీసుగా చేయాలని అనుకున్న రామ్ కి ఈ పాత్ర భలే దొరికింది. సినిమాలో రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇటు డాక్టర్, అటు పోలీసు గా రెండు షేడ్స్ ని రామ్ బాగా పండించాడు. రామ్ నటనకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం.

ఇక దర్శకుడు లింగుసామి హిస్టరీ చూస్తే.. రన్, పందెంకోడి, ఆవారా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. లింగుసామి చిత్రాల్లో మాస్ అంశాలు చాలా పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు రామ్ తో తీసిన ది వారియర్ కూడా చక్కటి మాస్ అంశాలను కలిగి ఉంది. చిత్రంలో హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 11 న ప్రసారం కానున్న ‘ది వారియర్’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.

The post ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోన్న రామ్ నటించిన ‘THE WARRIOR’ first appeared on 91Mobiles Telugu.

]]>