హైలైట్స్
- ఎన్నో వాల్యూ ఫర్ మనీ కాంబో ప్లాన్స్ ని అందిస్తోన్న దిగ్గజ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్
- రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ తో లభిస్తోన్న బోలెడన్ని ప్రయోజనాలు
- ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1జిబి డేటాతో పాటు అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

భారతదేశంలో ఉన్న టాప్ టెలీకామ్ కంపెనీల్లో ఎయిర్టెల్ ఒకటి. ప్రస్తుతం జియో మరియు ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ కంపెనీలకు కూడా త్వరలో మంచి రోజులు రావాలని ఆశిద్దాం.
ఎన్నో వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందిస్తూ తన యూజర్లను ఇట్టే ఆకర్షిస్తోంది ఎయిర్టెల్. ఇప్పటికే మార్కెట్ లో బలంగా పాతుకుపోయిన ఎయిర్టెల్, తన యూజర్ల కోసం విభిన్నమైన ప్లాన్స్ ని అందిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ తో పాటు 84 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ అందిస్తోంది. సరే రూ.839 ప్లాన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
Airtel రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఇంకా లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతేకాదండోయ్, ఈ ప్లాన్ తో అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
- 84 రోజుల వ్యాలిడిటీ
- ఉచిత కాల్స్
- డెయిలీ 100 ఎస్ఎంఎస్
- డెయిలీ 2జిబి డేటా
- డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
- ఎక్స్‌ట్రిమ్ యాప్ యాక్సెస్
- అపోలో 24/7 సర్కిల్
- ఫ్రీ హలో ట్యూన్స్
- ఫ్రీ వింక్ మ్యూజిక్
Airtel రూ.839 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
- Disney+ Hotstar బెనిఫిట్స్
ఎయిర్టెల్ రూ.839 ప్లాన్ ద్వారా డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో పాటు ఇతర బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వారికి అదనంగా 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.
- Xstream App బెనిఫిట్స్
యూజర్లకు ఎక్స్‌ట్రిమ్ యాప్ లోని ఏదైనా ఒక చానల్ కి 84 రోజుల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. సోనిలివ్, లయన్స్‌గేట్, ఇరోజ్‌నౌ, హొయ్‌చొయ్, మనోరమామ్యాక్స్, చౌపాల్, కాంచా లంకా.. చానల్స్ లో ఒకదానికి ఉచిత యాక్సెస్ ని పొందవచ్చు. ఈ యాక్సెస్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇంకా రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్, 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ ఉచిత సేవలు లభిస్తాయి. అలాగే ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఉన్నాయండి. ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కి ఫ్రీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











