HMD Global - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 25 Jul 2024 16:07:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ https://www.91mobiles.com/telugu/hmd-crest-launched-india-oled-display/ https://www.91mobiles.com/telugu/hmd-crest-launched-india-oled-display/#respond Thu, 25 Jul 2024 16:07:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=12686 Nokia ఫోన్లను తయారు చేసే కంపెనీ HMD తన సొంత బ్రాండ్ ఫోన్లను భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. HMD Crest మరియు HMD Crest Max అనే పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం HMD Crest గురించి తెలుసుకుందాం. HMD Crest Max కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక HMD Crest విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఓఎల్ఈడీ స్క్రీన్, […]

The post HMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో HMD Crest లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా

Nokia ఫోన్లను తయారు చేసే కంపెనీ HMD తన సొంత బ్రాండ్ ఫోన్లను భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. HMD Crest మరియు HMD Crest Max అనే పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం HMD Crest గురించి తెలుసుకుందాం. HMD Crest Max కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక HMD Crest విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

HMD Crest ధర, లభ్యత

HMD Crest స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.14,499 గా నిర్ణయించారు.

HMD Crest డివైజ్‌ను వచ్చే నెల జరిగే అమెజాన్ స్పెషల్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా కేవలం రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు.

HMD Crest స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లూ, రాయల్ పింక్ మరియు లష్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్ మరియు హెచ్ఎండి అధికార వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

HMD Crest స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Crest స్మార్ట్‌ఫోన్ లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Crest డివైజ్‌లో యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Crest డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్‌కి 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: HMD Crest స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: HMD Crest డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: HMD Crest స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. కంపెనీ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి అందిస్తుంది.

కనెక్టివిటీ: HMD Crest లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Crest లో సింగిల్ స్పీకర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post HMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-crest-launched-india-oled-display/feed/ 0
HMD Global: గీక్‌బెంచ్‌పై లిస్టైన HMD కొత్త స్మార్ట్‌ఫోన్ https://www.91mobiles.com/telugu/hmd-global-new-phone-listed-on-geekbench/ Tue, 07 May 2024 16:06:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=11398 Nokia పేరెంట్ కంపెనీ HMD Global సొంతంగా తన బ్రాండ్ పేరుతో ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలె, HMD Pulse, Pulse+, Pulse Pro మరియు HMD Vibe అనే స్మార్ట్‌ఫోన్లు పరిచయం అయ్యాయి. ఇప్పుడు మరొక హెచ్ఎండీ స్మార్ట్‌ఫోన్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ Geekbench పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రాసెసర్ మరియు ర్యామ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. గీక్‌బెంచ్‌పై లిస్టైన HMD కొత్త స్మార్ట్‌ఫోన్ […]

The post HMD Global: గీక్‌బెంచ్‌పై లిస్టైన HMD కొత్త స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో హెచ్ఎండీ ఫోన్ లాంచ్
  • కోడ్ నేమ్: హెచ్ఎండీ గ్లోబల్ టామ్‌క్యాట్
  • స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్

Nokia పేరెంట్ కంపెనీ HMD Global సొంతంగా తన బ్రాండ్ పేరుతో ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలె, HMD Pulse, Pulse+, Pulse Pro మరియు HMD Vibe అనే స్మార్ట్‌ఫోన్లు పరిచయం అయ్యాయి. ఇప్పుడు మరొక హెచ్ఎండీ స్మార్ట్‌ఫోన్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ Geekbench పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రాసెసర్ మరియు ర్యామ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

గీక్‌బెంచ్‌పై లిస్టైన HMD కొత్త స్మార్ట్‌ఫోన్

బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై హెచ్ఎండీ కంపెనీకి చెందిన ఒక కొత్త ఫోన్ లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై HMD Global Tomcat అనే కోడ్ నేమ్ తో ఈ స్మార్ట్‌ఫోన్ లిస్ట్ అయ్యింది.

HMD Global Tomcat స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40GHz.

ప్రాసెసర్ వివరాలను చూస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

HMD Global Tomcat ఫోన్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 978 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2664 పాయింట్లు స్కోర్ చేసింది.

HMD Pulse Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Pulse Pro లో 6.56-ఇంచ్ ఐపీఎస్ స్క్రీన్, 1480*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్, ఫ్లాట్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

కెమెరా: HMD Pulse Pro లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.

చిప్సెట్: HMD Pulse Pro లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా ఈ చిప్సెట్ కనిపిస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: HMD Pulse Pro డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: HMD Pulse Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.

బరువు: HMD Pulse Pro డివైజ్ 196 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: HMD Pulse Pro డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటాయి.

The post HMD Global: గీక్‌బెంచ్‌పై లిస్టైన HMD కొత్త స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు https://www.91mobiles.com/telugu/hmd-phones-showcased-mobile-world-congress-2024/ Sun, 25 Feb 2024 17:13:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10413 HMD బ్రాండ్ మొబైల్ ఫోన్లు త్వరలో రానున్నాయని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి వినియోగదారులు, టెక్నాలజీ ఔత్సాహికులు ఈ ఫోన్ల లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో హెచ్ఎండీ సంస్థ తాను లాంచ్ చేయబోయే ఫోన్లను ప్రదర్శించింది. సరే, ఓసారి హెచ్ఎండీ ఫోన్ల యొక్క ఫోటోలు, డిజైన్ గురించి తెలుసుకుందాం పదండి. HMD ఫోన్లు ఎప్పుడు లాంచ్ […]

The post HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండీ ఫోన్లు
  • నేడు ప్రదర్శితమైన డివైజెస్
  • రివీలైన డిజైన్, ఫోటోస్

HMD బ్రాండ్ మొబైల్ ఫోన్లు త్వరలో రానున్నాయని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి వినియోగదారులు, టెక్నాలజీ ఔత్సాహికులు ఈ ఫోన్ల లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో హెచ్ఎండీ సంస్థ తాను లాంచ్ చేయబోయే ఫోన్లను ప్రదర్శించింది. సరే, ఓసారి హెచ్ఎండీ ఫోన్ల యొక్క ఫోటోలు, డిజైన్ గురించి తెలుసుకుందాం పదండి.

HMD ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి?

  • HMD Global కొన్ని రోజుల క్రితం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తాము రాబోయే రోజుల్లో నోకియా బ్రాండ్ తో పాటు, హెచ్ఎండీ బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • తాజాగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో తన కొత్త మొబైల్ ఫోన్లను ప్రదర్శించింది.
  • HMD Global తన ఫోన్ల లాంచ్ తేదీని వెల్లడించలేదు. అయితే 2024 వేసవి కాలంలో లాంచ్ అవుతాయని ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్ లో హెచ్ఎండీ కంపెనీ తెలిపింది.
  • త్వరలోనే HMD Global సంస్థ తన కొత్త ఫోన్ల లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
  • యూజర్ ఇంటివద్దే రిపేరు చేసుకునే విధంగా ఉండే ఫోన్లను తాము తీసుకురాబోతున్నట్లు HMD Global తెలిపింది.
  • అంటే యూజర్ తన డివైజ్ ని సొంతంగా రిపేరు చేసుకోవడంతో పాటు మొబైల్ భాగాలను కూడా మార్చే అవకాశం ఉంటుందన్నమాట.
  • హెచ్ఎండీ ఫోన్ తో పాటు యూజర్ కి ఒక రిపేర్ కిట్ కూడా అందించబడుతుందని సమాచారం.

సరసమైన ధరలకే లభించనున్న HMD ఫోన్లు

  • HMD స్మార్ట్‌ఫోన్లు మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతాయని సమాచారం.
  • అన్ని వర్గాల యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్లను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
  • HMD Global తీసుకొచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్ల ధర రూ.12,000 నుంచి రూ.18,000 లేదా రూ.20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • అయితే, త్వరలో HMD Global తన కొత్త డివైజెస్ పేర్లు, లాంచ్ తేదీ, ధర శ్రేణి వంటి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

The post HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచైన Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లు; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/nokia-130-music-2023-nokia-150-launched-india-price-specs-availability/ Thu, 10 Aug 2023 18:12:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=7557 హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. 2017 లో లాంచైన Nokia 130 కి కొనసాగింపు వర్షన్ గా Nokia 130 Music లాంచ్ అయ్యింది. నోకియా 130 మ్యూజిక్ డివైజ్ ఒక లౌడ్‌స్పీకర్, ఎంపీ3 ఆప్షన్ తో వచ్చింది. ఇక మైక్రోఎస్డీ కార్డ్ 32జిబి మెమొరీకి సపోర్ట్ చేస్తుంది. Nokia 130 Music (2023) లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, […]

The post భారత్‌లో లాంచైన Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లు; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన రెండు నోకియా ఫీచర్ ఫోన్లు
  • ఎంట్రీ ఇచ్చిన నోకియా 130 మ్యూజిక్, నోకియా 150
  • నోకియా 130 మ్యూజిక్ ప్రారంభ ధర రూ.1,849

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. 2017 లో లాంచైన Nokia 130 కి కొనసాగింపు వర్షన్ గా Nokia 130 Music లాంచ్ అయ్యింది. నోకియా 130 మ్యూజిక్ డివైజ్ ఒక లౌడ్‌స్పీకర్, ఎంపీ3 ఆప్షన్ తో వచ్చింది. ఇక మైక్రోఎస్డీ కార్డ్ 32జిబి మెమొరీకి సపోర్ట్ చేస్తుంది. Nokia 130 Music (2023) లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

మరోవైపు Nokia 150 డివైజ్ వీజీఏ రియర్ కెమెరా, ఐపీ52 డస్ట్, స్ప్లాష్-ప్రూఫ్ రేటింగ్ తో వచ్చింది. Nokia 150 లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ స్క్రీన్, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. Nokia 150 లో ఎఫ్ఎమ్ రేడియో, ఐపీ52 రేటింగ్, ఎమ్‌పీ3 ప్లేయర్ ఉన్నాయి. Nokia 150 లో పవర్ బ్యాకప్ కోసం 1450ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది. 34 రోజుల స్టాండ్ బై టైమ్ ని కంపెనీ హామీ ఇస్తోంది.

సరే, ఓసారి నోకియా 130 మ్యూజిక్, నోకియా 150 ఫీచర్ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Nokia 130 Music, Nokia 150 ధరలు

  • Nokia 130 Music ధరను రూ.1,849 గా నిర్ణయించారు. ఈ ఫోన్ డార్క్ బ్లూ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • నోకియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ మరియు ఆన్‌లైన్ పార్ట్నర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • Nokia 150 ఫోన్ ధరను రూ.2,699 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ చార్కోల్, సైయన్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia 130 Music స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nokia 130 Music (2023) లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ఓఎస్: Nokia 130 Music డివైజ్ సిరీస్ 30+ ఓఎస్ పై పని చేస్తుంది.
  • స్టోరేజీ: Nokia 130 Music డివైజ్ లో 2000 వరకు కాంటాక్ట్స్, 500 ఎస్ఎంఎస్ స్టోర్ చేసుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 32జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • ఇతర ఫీచర్లు: Nokia 130 Music డివైజ్ లో ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Nokia 130 Music లో పవర్ బ్యాకప్ కోసం 1450ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది.

Nokia 150 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Nokia 150 లో 2.4-ఇంచ్ క్యూవీజీఏ స్క్రీన్, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
  • ఓఎస్: Nokia 150 డివైజ్ సిరీస్ 30+ ఓఎస్ పై పని చేస్తుంది.
  • స్టోరేజీ: Nokia 150 లో మైక్రోఎస్డీ కార్డ్ సదుపాయం ఉంది. దీని ద్వారా 32జిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Nokia 150 లో వీజీఏ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Nokia 150 లో పవర్ బ్యాకప్ కోసం 1450ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది. 34 రోజుల స్టాండ్ బై టైమ్ ని కంపెనీ హామీ ఇస్తోంది.
  • కనెక్టివిటీ: Nokia 150 లో మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Nokia 150 లో ఎఫ్ఎమ్ రేడియో, ఐపీ52 రేటింగ్, ఎమ్‌పీ3 ప్లేయర్ ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన Nokia 130 Music, Nokia 150 ఫీచర్ ఫోన్లు; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>