India launch date - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 09 Oct 2024 09:08:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/ https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/#respond Wed, 09 Oct 2024 08:02:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=14027 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన రియల్మీ పీ1 స్పీడ్ 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి […]

The post Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P1 Speed 5G విడుదల
  • అక్టోబర్ 15న భారత్ లో లాంచ్
  • మీడియాటెక్ చిప్సెట్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన రియల్మీ పీ1 స్పీడ్ 5జీ ఫోన్ లాంచ్ అవ్వనుంది. మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Realme P1 Speed 5G లాంచ్ తేదీ

Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 15వ తేదీన లాంచ్ కానుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ ఇండియా ఈ-స్టోర్ ద్వారా సేల్‌కి వస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన చిప్సెట్.

త్వరలో రాబోవు ఈ ఫోన్ అంటుటు పై 7,50,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసినట్లు రియల్మీ చెబుతోంది. ఈ చిప్సెట్ లో నాలుగు కార్టెక్స్ ఏ78 కోర్స్, నాలుగు కార్టెక్స్ ఏ55 కోర్స్ మరియు మాలి జీ615 ఎంపీ2 జీపీయూ ఉన్నాయి.

తమ ఫోన్ గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ ఇలా దేన్నైనా ఈజీగా హ్యాండిల్ చేయగలదని రియల్మీ అంటోంది.

ఇక, రియల్మీ షేర్ చేసిన టీజర్ లో కెమెరా మాడ్యూల్ హైలైట్ చేయబడింది. రియల్మీ పీ1 5జీ మాదిరిగానే బ్యాక్ ప్యానెల్ పై నీలం రంగులో టెక్షర్డ్ డిజైన్ ఉంది.

కెమెరా మాడ్యూల్ లో రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఇంకా ఈ ఫోన్‌లో అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

త్వరలో Realme P1 Speed 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Realme P1 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme P1 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme P1 5G డివైజ్ లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని అందించారు.

ఓఎస్: Realme P1 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 4 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కెమెరా: Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme P1 5G డివైజ్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, మినీ క్యాప్సూల్ 2.0, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme P1 Speed 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p1-speed-5g-india-launch-date-announced-know-full-details/feed/ 0
Infinix Zero Flip లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-india-launch-date-confirmed-know-full-details/#respond Fri, 04 Oct 2024 16:26:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13927 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ Zero Flip ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్ ఫోన్ల కంటే Infinix Zero Flip యొక్క ధర తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ ఫోన్ […]

The post Infinix Zero Flip లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Zero Flip విడుదల
  • అక్టోబర్ 17న లాంచ్ అవుతోన్న ఫోన్
  • 6.9-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఎల్టీపీవో స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ Zero Flip ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్ ఫోన్ల కంటే Infinix Zero Flip యొక్క ధర తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం పదండి.

Infinix Zero Flip ఇండియా లాంచ్ తేదీ

Infinix Zero Flip ఫ్లిప్‌ఫోన్ భారత్‌లో అక్టోబర్ 17వ తేదీన లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించి కంపెనీ టీజర్ విడుదల చేసింది. క్రింద ఇవ్వబడిన టీజర్ ఇమేజ్‌ను మీరు చూడవచ్చు.

శాంసంగ్ మరియు మోటోరోలా ఫ్లిప్ ఫోన్లకు ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Infinix Zero Flip భారతీయ వేరియంట్ స్పెసిఫికేషన్స్, గ్లోబల్ వేరియంట్ మాదిరే ఉంటాయని సమాచారం.

గ్లోబల్ మార్కెట్ లో Infinix Zero Flip ఫ్లిప్‌ ఫోన్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.50,100 గా ఉంది. భారత్ లో ఈ ధర మరింత తక్కువగా ఉండనుంది.

Infinix Zero Flip స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

ఇంటర్నల్ డిస్ప్లే: Infinix Zero Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (1080*2640 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఔటర్ డిస్ప్లే: Infinix Zero Flip లో 3.64-ఇంచ్ అమోలెడ్ ఔట్ స్క్రీన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

చిప్సెట్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్ (ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో కలిపి), 8జిబి స్టాండర్డ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Infinix Zero Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్1 ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

రియర్ కెమెరా: Infinix Zero Flip లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు మరియు వెనుకాల కెమెరాలతో 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. వ్లాగింగ్, డీవీ మోడ్, గోప్రో మోడ్ లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,720 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, జెబిఎల్ డ్యూయల్ స్పీకర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Infinix Zero Flip డివైజ్ 170.35 మి.మీ పొడవు, 73.4 మి.మీ వెడల్పు, 7.64 మి.మీ మందం ఉంటుంది.

The post Infinix Zero Flip లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-india-launch-date-confirmed/#respond Tue, 01 Oct 2024 12:11:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13865 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన ఈ ఫోన్ భారత్ లో విడులవ్వనుంది. టెక్నో షేర్ చేసిన టీజర్ ద్వారా స్పెసిఫికేషన్స్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం. Tecno […]

The post Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 8న Tecno Spark 30C 5G విడుదల
  • 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన ఈ ఫోన్ భారత్ లో విడులవ్వనుంది. టెక్నో షేర్ చేసిన టీజర్ ద్వారా స్పెసిఫికేషన్స్ వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ సమాచారం తెలుసుకుందాం.

Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో అక్టోబర్ 8వ తేదీన లాంచ్ అవుతోంది. క్రేజీలీ రిలైబుల్ అనే ట్యాగ్‌లైన్ తో ఈ ఫోన్ వస్తోంది. క్రింద ఇవ్వబడిన టీజర్ ఇమేజ్ లో ఫోన్ గ్లిమ్స్ చూడవచ్చు.

Tecno Spark 30C 5G ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tecno Spark 30C 5G డిజైన్

Tecno Spark 30C 5G డివైజ్ పంచ్ హోల్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. స్క్రీన్ ఫ్లాట్ గా ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇక రింగ్ ఎల్ఈడీ లైట్ కూడా ఉంది. కలర్ ఆప్షన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బ్లాక్ మరియు మరొక డ్యూయల్ టోన్ ఆప్షన్ లో కనిపిస్తోంది. మొత్తం మీద, తక్కువ బడ్జెట్ అయినా.. ఫోన్ చూసేందుకు మంచి లుక్‌తో ఉంది.

Tecno Spark 30C 5G స్పెసిఫికేషన్స్

కంపెనీ విడుదల చేసిన టీజర్ గమనిస్తే, Tecno Spark 30C 5G డివైజ్ 48ఎంపి సోని సెన్సర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. దీనికి తోడు ఒక ఏఐ లెన్స్ కూడా ఉంటుంది.

డిస్ప్లే విషయానికి వస్తే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్‌ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ విషయంపై స్పష్టత లేదు.

Tecno Spark 30C 5G డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Tecno Spark 30C 5G లో 8ఎంపి డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Tecno Spark 30C 5G డివైజ్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు.

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది.

The post Tecno Spark 30C 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-30c-5g-india-launch-date-confirmed/feed/ 0
Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-india-launch-date-confirmed-know-full-details/#respond Sat, 28 Sep 2024 14:41:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13818 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 6.78-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఓసారి […]

The post Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ 4న Lava Agni 3 విడుదల
  • 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్
  • 50ఎంపి ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 3 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 6.78-ఇంచ్ 1.5కే కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి ఓఐఎస్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ అవుతోంది. ఢిల్లీలో ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. లావా అగ్ని 3 5జీ యొక్క ధర, సేల్ మరియు స్పెసిఫికేషన్స్ ఇదే ఈవెంట్ లో రివీల్ కానున్నాయి.

అక్టోబర్ 4న ఉదయం 11 గంటలకు అగ్ని 3 5జీ యొక్క లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. లావా కంపెనీ వెబ్‌సైట్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మరియు కంపెనీకి చెందిన ఇతర అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా లాంచ్ ఈవెంట్ చూడవచ్చు.

Lava Agni 3 5G భారత మార్కెట్ ధర

Lava Agni 3 5G భారత మార్కెట్ ధర వివరాలు లావా కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే అంచనా ప్రకారం, Lava Agni 3 5G ప్రారంభ ధర రూ.21,990 ఉంటుందని తెలుస్తోంది. డిస్కౌంట్స్ మరియు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఫోన్ రూ.19,999 కే లభించనుంది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ పంచ్ హోల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

పైన పేర్కొనబడిన స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు లీక్స్ ఆధారంగా అందించినవి. సరైన వివరాలు అక్టోబర్ 4వ తేదీన ఫోన్ లాంచ్ అయ్యాక తెలుస్తాయి.

The post Lava Agni 3 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-india-launch-date-confirmed/#respond Fri, 20 Sep 2024 11:11:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=13658 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO POP 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ లో ఈ ఫోన్ మైక్రోసైట్ కూడా ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. TECNO POP […]

The post TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో TECNO POP 9 5G లాంచ్
  • లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ
  • సెప్టెంబర్ 24న విడుదల

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO POP 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ లో ఈ ఫోన్ మైక్రోసైట్ కూడా ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

TECNO POP 9 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 24 వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, ఈ డివైజ్ ధర రూ.10,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.

ఈ డివైజ్‌ను ప్రత్యేకించి యువత కోసం తీసుకొస్తున్నట్లు టెక్నో సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ లో పవర్ఫుల్ ఫీచర్లను అందించినట్లు సమాచారం.

TECNO POP 9 5G డిజైన్

TECNO POP 9 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉంటాయి. ఫ్రంట్ ప్యానెల్‌ను గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఫోన్ కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. డివైజ్ తో పాటు రెండు స్కిన్స్ కూడా ఇవ్వనున్నట్లు మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. దీంతో బ్యాక్ ప్యానెల్ లుక్ ను నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

TECNO POP 9 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

డిస్ప్లే: అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, TECNO POP 9 5G హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది.

చిప్సెట్: TECNO POP 9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: TECNO POP 9 5G డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: TECNO POP 9 5G డివైజ్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ఏఐ ప్రైమరీ కెమెరా ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ సెగ్మెంట్ లో ఒక ఫోన్ సోని కెమెరాతో వస్తుండటం ఇదే తొలిసారి అని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: TECNO POP 9 5G లో ఐపీ54 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై వంటి ఎన్నో ఫీచర్లు ఉంటాయి. ఫోన్‌తో పాటు 4 ఏళ్ళ ల్యాగ్-ఫ్రీ పెర్ఫామెన్స్‌ను అందిస్తున్నట్లు టెక్నో ప్రకటించింది.

The post TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-pop-9-5g-india-launch-date-confirmed/feed/ 0
Vivo V40e భారత్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-date-confirmed-via-teaser/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-date-confirmed-via-teaser/#respond Fri, 20 Sep 2024 08:58:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=13649 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఫోన్ భారతగడ్డపై అడుగుపెట్టనుంది. కాగా, ఇప్పటికే వీ సిరీస్ లో వివో వీ40, వీ40 ప్రో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో […]

The post Vivo V40e భారత్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40e విడుదల
  • సెప్టెంబర్ 25న అఫీషియల్ లాంచ్
  • టీజర్ విడుదల చేసిన కంపెనీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవుతుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఫోన్ భారతగడ్డపై అడుగుపెట్టనుంది. కాగా, ఇప్పటికే వీ సిరీస్ లో వివో వీ40, వీ40 ప్రో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో Vivo V40e మూడవ ఫోన్.

Vivo V40e భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు

Vivo V40e స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే తేదీని కంపెనీ టీజర్ ద్వారా ప్రకటించింది.

Vivo V40e డివైజ్ సెప్టెంబర్ 25వ తేదీన లాంచ్ అవుతుందని టీజర్ లో కంపెనీ పేర్కొంది.

ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo V40e సేల్ కి రానుంది. గతంలో వివో వీ30ఈ కూడా ఇదే వేదిక ద్వారా అమ్మకానికి వచ్చింది.

Vivo V40e డిజైన్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ మైక్రోసైట్ ద్వారా తెలిసాయి. రాయల్ బ్రాంజ్ మరియు మింట్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. వీటితో పాటు ఆరా లైట్ ఎల్ఈడీ ఉంటుంది.

Vivo V40e ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, 3డీ కర్వ్డ్ డిజైన్ అందించారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం ఉంటుందని తెలుస్తోంది. అలాగే బరువు 183 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo V40e డివైజ్ గత మోడల్ తో పోల్చితే డిఫరెంట్ డిజైన్ కలిగి ఉంటుంది. గత మోడల్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉండేది.

Vivo V40e స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

డిస్ప్లే: Vivo V40e లో 6.77-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ ట్రూ కలర్స్, 2392*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.3 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 8,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఎస్జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉంటాయి.

కెమెరా: Vivo V40e లో 50ఎంపి సోని ఓఐఎస్ ప్రొటెయిట్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఐ ఏఎఫ్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై ఆరా లైట్ కూడా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V40e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo V40e స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V40e స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post Vivo V40e భారత్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-india-launch-date-confirmed-via-teaser/feed/ 0
Infinix Zero 40 5G: సెప్టెంబర్ 18న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-india-launch-date-confirmed-know-details/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-india-launch-date-confirmed-know-details/#respond Wed, 11 Sep 2024 12:33:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=13441 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 18వ తేదీన ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ భారత్ లో విడుదలవ్వనుందని ఇన్ఫినిక్స్ బ్రాండ్ టీజర్ విడుదల చేసింది. Infinix Zero 40 5G ఇండియా లాంచ్ తేదీ […]

The post Infinix Zero 40 5G: సెప్టెంబర్ 18న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Zero 40 5G లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 18న భారత్‌లో విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Infinix Zero 40 5G పేరుతో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 18వ తేదీన ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ భారత్ లో విడుదలవ్వనుందని ఇన్ఫినిక్స్ బ్రాండ్ టీజర్ విడుదల చేసింది.

Infinix Zero 40 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ అవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ సేల్ కి వస్తుంది.

Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ ఎన్నో ఏఐ ఫీచర్లతో వస్తున్నట్లు ఇన్ఫినిక్స్ కంపెనీ తెలిపింది.

Infinix Zero 40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 40 5G డివైజ్ లో 6.78-ఇంచ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది. గేమింగ్ మరియు ఇతర పనులను ఈ చిప్ బాగా హ్యాండిల్ చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 40 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉంటాయి. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Zero 40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero 40 5G లో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

The post Infinix Zero 40 5G: సెప్టెంబర్ 18న లాంచ్ అవుతోన్న ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-5g-india-launch-date-confirmed-know-details/feed/ 0
Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-india-launch-date-confirmed/#respond Mon, 09 Sep 2024 05:49:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13382 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో మరొక ఫోన్ తో యూజర్ల ముందుకు రాబోతోంది. Motorola Edge 50 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని తాజాగా కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 నియో యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. Motorola […]

The post Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎడ్జ్ నియో 50 లాంచ్ తేదీ ప్రకటన
  • సెప్టెంబర్ 16న భారత్‌లో విడుదల
  • ఐపీ68, వీగన్ లెదర్ బ్యాక్, ఎల్టీపీవో

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తన ఎడ్జ్ సిరీస్ లో మరొక ఫోన్ తో యూజర్ల ముందుకు రాబోతోంది. Motorola Edge 50 Neo పేరుతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని తాజాగా కంపెనీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 16వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే ఎడ్జ్ 50 నియో యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ వివరాలు

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 16వ తేదీన లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 MIL810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ రేటంగ్ తో రానుండటం విశేషం.

Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ నాటికల్ బ్లూ, లాటే, గ్రిసైల్ మరియు పొయిన్సియానా కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Motorola Edge 50 Neo స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లో 6.4-ఇంచ్ సూపర్ హెచ్డీ ఎల్టీపీవో స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 10-బిట్ కలర్స్, పంచ్ హోల్ కటౌట్, మినిమల్ బెజెల్స్ ఉంటాయి.

చిప్సెట్: Motorola Edge 50 Neo లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Neo డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా: Motorola Edge 50 Neo లో 50ఎంపి అల్ట్రా పిక్సెట్ సోని ఎల్‌వైటీఐఏ 700సీ మెయిన్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి 4కే రికార్డింగ్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 4310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 68 వాట్ టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కి 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Neo లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఏఐ స్టైల్ సింక్, ఏఐ మ్యాజిక్ కాన్వాస్ ఉంటాయి.

The post Motorola Edge 50 Neo ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-neo-india-launch-date-confirmed/feed/ 0
Tecno Pova 6 Neo 5G భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-pova-6-neo-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/tecno-pova-6-neo-5g-india-launch-date-confirmed/#respond Sun, 08 Sep 2024 17:47:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=13379 చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో తన పోవా సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Pova 6 Neo 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ ఫోన్ విడుదలవుతోంది. సరే, ఓసారి లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. Tecno Pova 6 Neo 5G ఇండియా లాంచ్ Tecno […]

The post Tecno Pova 6 Neo 5G భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Pova 6 Neo 5G లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 11న విడుదల
  • 108ఎంపి ఏఐ కెమెరా

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో తన పోవా సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Pova 6 Neo 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ ఫోన్ విడుదలవుతోంది. సరే, ఓసారి లాంచ్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Neo 5G ఇండియా లాంచ్

Tecno Pova 6 Neo 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 11వ తేదీన లాంచ్ అవుతుంది.

లాంచ్ తర్వాత, ఈ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Tecno Pova 6 Neo 5G డివైజ్ 108ఎంపి ఏఐ మెయిన్ కెమెరాతో వస్తోంది. 3ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ కూడా ఈ కెమెరా సెటప్ లో ఉంటుందని సమాచారం.

Tecno Pova 6 Neo 5G డివైజ్ ఏఐ ఫీచర్లతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tecno Pova 6 Neo 5G ఏఐ కటౌట్, ఆస్క్ ఏఐ, ఏఐ మ్యాజిక్ ఎరేజర్ వంటి ఏఐ ఫీచర్లతో వస్తోంది.

Tecno Pova 6 Neo 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Pova 6 Neo 4G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Pova 6 Neo 4G లో మీడియాటెక్ హీలియో జీ99 అల్టిమేట్ ఆక్టాకోర్ చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Neo 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్లకు గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Pova 6 Neo 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇతర ఫీచర్లు: Tecno Pova 6 Neo 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5 గిగాహెర్ట్జ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 ఉన్నాయి.

The post Tecno Pova 6 Neo 5G భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-pova-6-neo-5g-india-launch-date-confirmed/feed/ 0
Realme P2 Pro 5G: ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-launch-date-confirmed/#respond Wed, 04 Sep 2024 08:04:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13338 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P2 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత్ లాంచ్ తేదీ ఖరారైంది. కొత్త టీజర్ ద్వారా రియల్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme P2 Pro 5G ఇండియా లాంచ్ తేదీ Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 13వ […]

The post Realme P2 Pro 5G: ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P2 Pro 5G విడుదల
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme P2 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత్ లాంచ్ తేదీ ఖరారైంది. కొత్త టీజర్ ద్వారా రియల్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme P2 Pro 5G ఇండియా లాంచ్ తేదీ

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.

తాజాగా రియల్మీ విడుదల చేసిన టీజర్ లో ఈ ఫోన్ 80 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

Realme P2 Pro 5G డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు స్పష్టమైంది.

Realme P2 Pro 5G డిజైన్

Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ టీజర్ లో గ్రీన్ కలర్ లో కనిపించింది. దీంతో ఒక కలర్ వేరియంట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే కర్వ్డ్ డిజైన్, గోల్డెన్ ఫ్రేమ్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.

ఫోన్‌కి ముందువైపు, పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఇక బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ స్క్వేర్ షేప్ లో ఉంది. ఇందులో రెండు కెమెరాలు, ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Realme P2 Pro 5G వివరాలు (అంచనా)

91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.

రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro 5G: ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-5g-india-launch-date-confirmed/feed/ 0