Infinix Hot 50 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 09 Sep 2024 17:25:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్? https://www.91mobiles.com/telugu/infinix-hot-50-vs-itel-color-pro-comparison-which-is-better-budget-phone/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-vs-itel-color-pro-comparison-which-is-better-budget-phone/#respond Mon, 09 Sep 2024 17:25:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=13395 Infinix Hot 50 భారత్‌లో రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. తక్కువ ధరలో పర్వాలేదనిపించే స్పెసిఫికేషన్స్ ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. చవకగా ఒక మంచి ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. అయితే, ఇదే ధర శ్రేణిలో ఐటెల్ కంపెనీ నుంచి itel Color Pro అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ అందుబాటులో ఉంది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చిన ఇది ఇన్ఫినిక్స్ హాట్ 50 […]

The post Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>

Infinix Hot 50 భారత్‌లో రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. తక్కువ ధరలో పర్వాలేదనిపించే స్పెసిఫికేషన్స్ ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. చవకగా ఒక మంచి ఫోన్ కొనాలని భావించే వారికి ఈ ఫోన్ సరిపోతుంది.

అయితే, ఇదే ధర శ్రేణిలో ఐటెల్ కంపెనీ నుంచి itel Color Pro అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ అందుబాటులో ఉంది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చిన ఇది ఇన్ఫినిక్స్ హాట్ 50 కి ఆల్టర్నేటివ్ ఆప్షన్‌గా నిలవనుంది. ఈ ఆర్టికల్ లో, మేం Infinix Hot 50 మరియు itel Color Pro ఫోన్లను పోల్చి చూసి, రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్, ఏది వాల్యూ ఫర్ మనీ ఆప్షనో చెప్పే ప్రయత్నం చేస్తాం.

Infinix Hot 50 vs itel Color Pro: స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ ఇన్ఫినిక్స్ హాట్ 50 ఐటెల్ కలర్ ప్రో
డిస్ప్లే 6.7-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్
డైమెన్షన్స్ 165.7 మి.మీ x 77.1 మి.మీ x 7.8 మి.మీ 163.5 మి.మీ x 75.5 మి.మీ x 8.3 మి.మీ
బరువు 188 గ్రాములు 190 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ఓఎస్
రియర్ కెెమెరా 48ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరా 50ఎంపి ప్రైమరీ ఏఐ సెన్సర్
ఫ్రంట్ కెమెరా 8ఎంపి 8ఎంపి
వీడియో 1080పి/30ఎఫ్‌పీఎస్ 1080పి/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6080
బ్యాటరీ, చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్
ర్యామ్, స్టోరేజీ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ 6జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ
కలర్స్ స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్ లావెండర్ ఫాంటసీ & రివర్ బ్లూ

 

Infinix Hot 50 vs itel Color Pro: ధర

ఇన్ఫినిక్స్ హాట్ 50 ఐటెల్ కలర్ ప్రో
4జిబి+128జిబి ధర రూ.9,999 6జిబి+128జిబి ధర రూ.9,999
6జిబి+128జిబి ధర రూ.10,999

 

Infinix Hot 50 vs itel Color Pro: డిజైన్

ఇన్ఫినిక్స్ హాట్ 50 ప్లాస్టిక్ మరియు వీగన్ లెదర్ మోడల్స్ లో అందుబాటులో ఉంది. స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్ కలర్స్ ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిష్ తో వచ్చాయి. డ్రీమీ పర్పుల్ వేరియంట్ మాత్రం వీగన్ లెదర్ బాడీతో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్ తో వచ్చింది.

మరోవైపు, ఐటెల్ కలర్ ప్రో ప్లాస్టిక్ బాడీ, డ్యూయల్ టోన్ ఫినిష్ తో వచ్చింది. సూర్యకాంతి పడినప్పుడు ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ రంగులు మారుస్తుంది. ఇదే ఈ ఫోన్ లో హైలైట్ అని చెప్పవచ్చు. ఇకపోతే, ఈ ఫోన్ లావెండర్ ఫాంటసీ మరియు రివర్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ ఐపీ రేటింగ్ తో రాలేదు.

Infinix Hot 50 vs itel Color Pro: డిస్ప్లే

ఇన్ఫినిక్స్ హాట్ 50 మరియు ఐటెల్ కలర్ ప్రో ఫోన్లు రెండూ కూడా ఒకే విధమైన డిస్ప్లే స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. హాట్ 50 లో కాస్త పెద్ద డిస్ప్లే ఉంది. ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ రెజుల్యూషన్ రెండు ఫోన్లలో అందించారు. క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది.

అయితే, ఇన్ఫినిక్స్ హాట్ 50 లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ విషయంలో ఐటెల్ కలర్ ప్రో కంటే మెరుగ్గా ఉంది. ఐటెల్ కలర్ ప్రో లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు.

Infinix Hot 50 vs itel Color Pro: పెర్ఫామెన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 50 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఇచ్చారు. ఐటెల్ కలర్ ప్రో లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. రెండు ప్రాసెసర్స్ లో డైమెన్సిటీ 6300 చిప్ మెరుగైనది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 మీడియాటెక్ డైమెన్సిటీ 6080
అంటుటు 4,33,932 4,32,270
గీక్‌బెంచ్ (సింగిల్ కోర్) 781 పాయింట్లు 752 పాయింట్లు
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 1,981 పాయింట్లు 2,081 పాయింట్లు

 

రెండు ఫోన్ల యొక్క బెంచ్‌మార్క్ ఫలితాలను పరిశీలిస్తే, కలర్ ప్రో అంటుటు స్కోర్ 4,32,270 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ సింగిల్-కోర్ పై 752 పాయింట్లు, మల్టీ-కోర్ పై 2081 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, హాట్ 50 యొక్క అంటుటు స్కోర్ 4,33,932 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 781 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1981 పాయింట్లు నమోదు చేసింది.

Infinix Hot 50 vs itel Color Pro: కెమెరాలు

రెండు ఫోన్ల యొక్క కెమెరా విభాగాన్ని పరిశీలిస్తే, కలర్ ప్రో డివైజ్ బెటర్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. హాట్ 50 లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. కలర్ ప్రో లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి.

ఐటెల్ కలర్ ప్రో యొక్క కెమెరా పెర్ఫామెన్స్, ప్రత్యేకించి లో-లైట్ కండీషన్స్ లో బాగుంది.

Infinix Hot 50 vs itel Color Pro: బ్యాటరీ, చార్జింగ్

ఇన్పినిక్స్ హాట్ 50 మరియు ఐటెల్ కలర్ ప్రో ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లు డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. కానీ, స్లోగా చార్జ్ అవుతాయి. మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఐటెల్ కలర్ ప్రో 12 గంటల 38 నిమిషాల పాటు పనిచేసింది. 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 1 గంటా 41 నిమిషాల సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 కూడా దాదాపుగా ఇదే స్థాయి స్కోర్ చేసింది.

Infinix Hot 50 vs itel Color Pro: సాఫ్ట్‌వేర్

ఇన్ఫినిక్స్ హాట్ 50 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. కలర్ ప్రో డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఐటెల్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండు ఫోన్లకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. అయితే ఓఎస్ అప్డేట్స్ మాత్రం లభించకపోవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ హాట్ 50 లో ఏఐ ఫీచర్లు, ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. కలర్ ప్రో లో ఇవేవీ లేవు.

ఏది బెటర్?

మీరు ఏ ఫోన్ ఎంపిక చేసుకున్నప్పటికీ, రెండు ఫోన్లు కూడా అన్ని విభాగాల్లో బాగానే పెర్ఫామ్ చేస్తాయి. అయితే, రెండింట్లో ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి. ఇక ఛాయిస్ అనేది, మీ వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుంది.

మీరు గనుక లెదర్ బ్యాక్, ఐపీ54 ప్రొటెక్షన్, స్మూథ్ డిస్ప్లే, అప్-టు-డేట్ సాఫ్ట్‌వేర్, సుపీరియర్ పెర్ఫామెన్స్ కోరుకుంటే, Infinix Hot 50 బెటర్. అయితే, మీరు కలర్ షిఫ్టింగ్ డిజైన్, బెటర్ కెమెరా సెటప్, ఎక్కువ ర్యామ్, తక్కువ ధర వంటివి కావాలంటే అప్పుడు itel Color Pro మీకు బెటర్ ఆప్షన్.

 

The post Infinix Hot 50 vs itel Color Pro: ఏది బెటర్ బడ్జెట్ ఫోన్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-vs-itel-color-pro-comparison-which-is-better-budget-phone/feed/ 0
Infinix Hot 50 5G: 48MP Ai కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-launched-india-48mp-ai-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-launched-india-48mp-ai-camera-5000mah-battery/#respond Thu, 05 Sep 2024 08:38:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13357 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Hot 50 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ కెమెరా, 16జిబి వరకు ర్యామ్ ఈ ఫోన్ లో అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Infinix Hot 50 5G […]

The post Infinix Hot 50 5G: 48MP Ai కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Infinix Hot 50 5G విడుదల
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్
  • 48ఎంపి ఏఐ కెమెరా సెటప్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Hot 50 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48ఎంపి ఏఐ కెమెరా, 16జిబి వరకు ర్యామ్ ఈ ఫోన్ లో అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Hot 50 5G ధర, సేల్ వివరాలు

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.9,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.

బ్యాంక్ ఆఫర్ లో భాగంగా రూ.1,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ స్లీక్ బ్లాక్, వైబ్రంట్ బ్లూ, సేజ్ గ్రీన్ మరియు డ్రీమీ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 60Hz, 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్స్, 93.9 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Hot 50 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా ఫ్లాష్ అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డైనమిక్ బార్ ఇంటరాక్టివ్ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ సెగ్మెంట్-ఫస్ట్ టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వచ్చింది. ఐదేళ్ళ పాటు ఈ ఫోన్ నిలకడగా పని చేస్తుందని దీనర్థం.

The post Infinix Hot 50 5G: 48MP Ai కెమెరా, 5000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-launched-india-48mp-ai-camera-5000mah-battery/feed/ 0
Infinix Hot 50 5G: లాంచ్‌కి ముందు రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-design-specs-price-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-design-specs-price-revealed-before-launch/#respond Wed, 04 Sep 2024 07:47:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13336 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix రేపు భారతీయ మార్కెట్ లో Infinix Hot 50 5G అనే డివైజ్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లపై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 7.8ఎంఎం మందం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ […]

The post Infinix Hot 50 5G: లాంచ్‌కి ముందు రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రేపే Infinix Hot 50 5G విడుదల
  • 16జిబి వరకు ర్యామ్
  • ప్రారంభ ధర రూ.9,999

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix రేపు భారతీయ మార్కెట్ లో Infinix Hot 50 5G అనే డివైజ్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లపై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 7.8ఎంఎం మందం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి రివీలైన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Infinix Hot 50 5G ధర

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌జివ్‌గా సేల్‌కి వస్తోంది. దీని ధరను రూ.9,999 లోపు ఉంటుందని సమాచారం. గత రిపోర్ట్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర ఆఫర్ తో కలిపి రూ.9 వేల లోపు ఉండవచ్చని తెలుస్తోంది.

Infinix Hot 50 5G డిజైన్, కలర్స్

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రీన్ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి కొత్త డిజైన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు చూస్తే, పంచ్ హోల్ నాచ్ కటౌట్ ఉంది. సెగ్మెంట్ లో సన్నని 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ డివైజ్ 7.8 మి.మీ మందం ఉంటుంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Hot 50 5G లో 6.5-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ – 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Hot 50 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాలు ఉంటాయో ఇంకా తెలియదు.

బ్యాటరీ: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G డివైజ్ సెగ్మెంట్ లో తొలిసారిగా టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వస్తోంది. అంటే ఈ ఫోన్ 5 ఏళ్ళ పాటు శక్తివంతంగా పని చేస్తుంది.

The post Infinix Hot 50 5G: లాంచ్‌కి ముందు రివీలైన డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-design-specs-price-revealed-before-launch/feed/ 0
Infinix Hot 50 5G: రివీలైన ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ధర శ్రేణి https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-price-range-info-revealed-before-launch/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-price-range-info-revealed-before-launch/#respond Mon, 02 Sep 2024 16:21:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=13302 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ 50 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Hot 50 5G అనే డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని కంపెనీ ఇటీవలె కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే హాట్ 50 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. తాజాగా 91మొబైల్స్ కి Infinix Hot 50 5G యొక్క […]

The post Infinix Hot 50 5G: రివీలైన ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ధర శ్రేణి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 5న Infinix Hot 50 5G లాంచ్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ధర రూ.9,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ 50 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Hot 50 5G అనే డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని కంపెనీ ఇటీవలె కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పటికే హాట్ 50 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. తాజాగా 91మొబైల్స్ కి Infinix Hot 50 5G యొక్క ధర శ్రేణి వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Infinix Hot 50 5G ధర శ్రేణి

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.9,000 లోపు ధరతో లాంచ్ కానుందని 91మొబైల్స్ కి సమాచారం లభించింది. ఇది బేస్ వేరియంట్ ధర. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది.

Infinix Hot 50 5G డివైజ్ లో డైనమిక్ బార్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ సర్టిఫికేషన్ ఉంటాయి.

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ లో మొదటిసారి టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-నెలల ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వస్తోంది. అంటే 5 ఏళ్ళ పాటు ల్యాగ్స్ లేని మంచి పెర్ఫామెన్స్‌ని ఈ ఫోన్ అందిస్తుంది.

Infinix Hot 50 5G కెమెరా

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో 48ఎంపి ఏఐ మెయిన్ కెమెరా, డ్యూయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటాయి. 5జీ ఫోన్ కేటగిరీలో 7.8 ఎంఎం మందంతో వస్తోన్న అత్యంత సన్నని ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.

Infinix Hot 50 5G డిజైన్

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ముందువైపు, పంచ్ హోల్ నాచ్ డిస్ప్లే ఉంటుంది. ఐపీ54 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో ఈ ఫోన్ వస్తోంది. హాట్ 50 5జీ బ్లూ, బ్లాక్ మరియు గ్రీన్ కలర్స్ లో లాంచ్ కానుంది.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్ ఉంటుంది.

Infinix Hot 50 5G డివైజ్ 4జిబి, 8జిబి ర్యామ్, 128జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తోంది.

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Source

The post Infinix Hot 50 5G: రివీలైన ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ధర శ్రేణి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-price-range-info-revealed-before-launch/feed/ 0
Infinix Hot 50 5G: ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-india-launch-date-confirmed-know-full-details/#respond Wed, 28 Aug 2024 06:16:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13204 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఇన్ఫినిక్స్ సంస్థ హాట్ 50 5జీ యొక్క ఇండియా లాంచ్ తేదీ, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్‌ను షేర్ చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరతో లాంచ్ అవుతుందని అంచనా. సరే, ఓసారి లాంచ్ తేదీ, లుక్ మరియు ఫీచర్లు […]

The post Infinix Hot 50 5G: ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Hot 50 5G లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 6న భారత్‌లో విడుదల
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఇన్ఫినిక్స్ సంస్థ హాట్ 50 5జీ యొక్క ఇండియా లాంచ్ తేదీ, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్‌ను షేర్ చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరతో లాంచ్ అవుతుందని అంచనా. సరే, ఓసారి లాంచ్ తేదీ, లుక్ మరియు ఫీచర్లు తెలుసుకుందాం.

Infinix Hot 50 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

కంపెనీ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Infinix Hot 50 5G సెప్టెంబర్ 6న లాంచ్ అవుతోంది.

ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ 7.8 మి.మీ మందంతో వస్తోంది. ఈ స్లిమ్ డిజైన్ కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.

5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్ లోనే Infinix Hot 50 5G అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది.

Infinix Hot 50 5G డిజైన్

Infinix Hot 50 5G డిజైన్ గురించి మాట్లాడితే, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు పంచ్ హోల్ నాచ్ ఉంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. టీజర్ లో కనిపించిన ఫోన్ బ్లూ మరియు గ్రీన్ కలర్స్ లో ఉంది. గత మోడల్ కంటే ఈ ఫోన్ డిఫరెంట్ లుక్ తో రానున్నట్లు అర్థమవుతోంది.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. మల్టీటాస్కింగ్, ఫాస్ట్ కనెక్టివిటీకి ఈ చిప్సెట్ సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G డివైజ్ 128జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 4జిబి/8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా చార్జింగ్ స్పీడ్ వివరాలు తెలియలేదు.

సెగ్మెంట్ లో తొలిసారిగా, టీయూవీ ఎస్‌యూడీ ఏ-లెవెల్ 60-నెలల ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో Infinix Hot 50 5G వస్తోంది. ఈ ఫోన్ 5 ఏళ్ళ పాటు శక్తివంతంగా పని చేస్తుందని ఈ సర్టిఫికేషన్ ద్వారా అర్థమవుతోంది.

The post Infinix Hot 50 5G: ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50-5g-india-launch-date-confirmed-know-full-details/feed/ 0