Infinix Note 12i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Jan 2023 13:01:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 AMOLED డిస్ప్లే, Widevine L1 సర్టిఫికేషన్‌తో భారత్‌లో లాంచైన Infinix Note 12i https://www.91mobiles.com/telugu/infinix-note-12i-india-launched-price-specs-availability/ Wed, 25 Jan 2023 13:01:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=4645 ఇన్ఫినిక్స్ సంస్థ మరొక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే హ్యాండ్సెంట్ 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వచ్చింది. ఈ […]

The post AMOLED డిస్ప్లే, Widevine L1 సర్టిఫికేషన్‌తో భారత్‌లో లాంచైన Infinix Note 12i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించబడనున్న Infinix Note 12i స్మార్ట్ ఫోన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన Infinix Note 12i
  • వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వచ్చిన Infinix Note 12i

ఇన్ఫినిక్స్ సంస్థ మరొక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే హ్యాండ్సెంట్ 2022 సెప్టెంబర్ లో గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైంది. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. లేటెస్ట్ నోట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Note 12i యొక్క భారత మార్కెట్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Note 12i ధర, లభ్యత

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. జనవరి 30 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభమవుతాయి. ఇన్ఫినిక్స్, జియోతో కూడా జట్టుకట్టి యూజర్లకు ఒక ఆఫర్ ని అందిస్తోంది. ఫోన్ కొనుగోలు చేసిన 30 రోజుల లోపు కొనుగోలుదారులకు రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Infinix Note 12i స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తోంది.

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ వాడారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు. Infinix Note 12i ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Note 12i లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక క్యూవీజీఏ ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ ఉంటుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ హ్యాండ్సెట్ స్టీరియో స్పీకర్, డీటీఎస్ ఆడియో సపోర్ట్ తో వస్తోంది. 3జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంది.

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.43 మిల్లీ మీటర్ల పొడవు, 76.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.03 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post AMOLED డిస్ప్లే, Widevine L1 సర్టిఫికేషన్‌తో భారత్‌లో లాంచైన Infinix Note 12i first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 25 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Note 12i https://www.91mobiles.com/telugu/infinix-note-12i-india-launch-microsite-flipkart/ Sat, 21 Jan 2023 14:12:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4593 ఇన్ఫినిక్స్ సంస్థ త్వరలోనే భారత మార్కెట్ లో Infinix Note 12i ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. జనవరి 25 న ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు Infinix Note 12i ఫోన్ యొక్క మైక్రో-సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మైక్రోసైట్ లో మెన్షన్ చేసిన వివరాలను బట్టి ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 […]

The post జనవరి 25 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Note 12i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫ్లిప్ కార్ట్ ద్వారా రివీలైన Infinix Note 12i స్పెసిఫికేషన్స్
  • జనవరి 25న భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోన్న Infinix Note 12i
  • అమోలెడ్ డిస్ప్లే, వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు

ఇన్ఫినిక్స్ సంస్థ త్వరలోనే భారత మార్కెట్ లో Infinix Note 12i ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. జనవరి 25 న ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు Infinix Note 12i ఫోన్ యొక్క మైక్రో-సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

మైక్రోసైట్ లో మెన్షన్ చేసిన వివరాలను బట్టి ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్నట్లు స్పష్టమైంది. సరే, ఓసారి Infinix Note 12i యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 12i స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 6.7-ఇంచ్ డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది. Infinix Note 12i వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యింది. ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుండటంతో, యూజర్లు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ కంటెంట్ ని బెటర్ రెజుల్యూషన్ తో చూడవచ్చు.

Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ52 జీపీయూ వినియోగించారు. ఇండియన్ వేరియంట్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్ ని అందించారు. గ్లోబల్ మార్కెట్స్ లో 64జిబి స్టోరేజీ వేరియంట్ అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Infinix Note 12i యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, క్యూవీజీఏ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా ఉంటుంది.

Infinix Note 12i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్ సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 7.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 25 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Infinix Note 12i first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.12,000 ధర, 50MP కెమెరా, 6GB ర్యామ్ తో లాంచ్ అయిన Infinix Note 12i https://www.91mobiles.com/telugu/infinix-note-12i-launched-indonesia-price-specs/ Fri, 30 Sep 2022 14:56:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=2688 హైలైట్స్: ఇండోనేషియాలో లాంచ్ అయిన Infinix Note 12i 2022 స్మార్ట్ ఫోన్ 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు రూ.12,000 ధరతో లాంచ్ అయిన Infinix Note 12i Infinix కంపెనీ Infinix Note 12i అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. మెల్లగా ఈ సంస్థ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతోంది. […]

The post రూ.12,000 ధర, 50MP కెమెరా, 6GB ర్యామ్ తో లాంచ్ అయిన Infinix Note 12i first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఇండోనేషియాలో లాంచ్ అయిన Infinix Note 12i 2022 స్మార్ట్ ఫోన్
  • 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • రూ.12,000 ధరతో లాంచ్ అయిన Infinix Note 12i

Infinix కంపెనీ Infinix Note 12i అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. మెల్లగా ఈ సంస్థ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతోంది. స్టైలిష్ లుక్, సూపర్ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. Infinix Note 12i లో 50ఎంపి మెయిన్ కెమెరా, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.12,000 ధరతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Infinix Note 12i 2022 స్పెసిఫికేషన్స్

Infinix Note 12i స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. Infinix Note 12i లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, త్రీ బెజెల్-లెస్ ఎడ్జెస్, బాటమ్ లో సన్నని చిన్ ఉన్నాయి. Infinix Note 12i 2022 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Infinix Note 12i లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

ఇప్పుడు Infinix Note 12i కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Note 12i ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, మరొక ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపున 8ఎంపి కెమెరాను అందించారు.

Infinix Note 12i డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ ఉంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఈ స్కానర్ పవర్ బటన్ లో ఎంబెడ్ చేయబడి ఉంటుంది. Infinix Note 12i లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Infinix Note 12i 164.47 మిల్లీ మీటర్ల పొడవు, 76.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.8 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

Infinix Note 12i 2022 ధర

Infinix Note 12i 2022 స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే ఇండోనేషియాలో IDR 2,299,000 (దాదాపు రూ.12,200) తో లాంచ్ అయ్యింది. మెటావర్స్ బ్లూ, ఫోర్స్ బ్లాక్, ఆల్పైన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. అయితే ఈ ఫోన్ భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఇన్ఫినిక్స్ నుంచి Infinix Note 12i ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.12,000 ధర, 50MP కెమెరా, 6GB ర్యామ్ తో లాంచ్ అయిన Infinix Note 12i first appeared on 91Mobiles Telugu.

]]>