iQOO Z7 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 31 Aug 2023 08:04:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Dimensity 7200 చిప్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7 Pro 5G https://www.91mobiles.com/telugu/iqoo-z7-pro-5g-launched-india-price-specs-availability/ Thu, 31 Aug 2023 07:51:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=7818 వివో సబ్-బ్రాండ్ అయిన iQOO నేడు భారత్ లో iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ స్క్రీన్, గ్రేడియంట్ డిజైన్ తో వచ్చింది. iQOO Z7 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, […]

The post Dimensity 7200 చిప్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన iQOO Z7 Pro 5G
  • 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • అమెజాన్ ఇండియా ద్వారా సేల్

వివో సబ్-బ్రాండ్ అయిన iQOO నేడు భారత్ లో iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో వచ్చిన ఈ ఫోన్ లో 3డీ కర్వ్డ్ స్క్రీన్, గ్రేడియంట్ డిజైన్ తో వచ్చింది. iQOO Z7 Pro 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి iQOO Z7 Pro 5G యొక్క భారత మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO Z7 Pro 5G ధర, సేల్ వివరాలు

iQOO Z7 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 256జిబి వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. సెప్టెంబర్ 5 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి iQOO Z7 Pro 5G డివైజ్ సేల్ కి రానుంది. అమెజాన్ ఇండియా, ఐకూ ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ పై అదనంగా రూ.2,000 తగ్గింపు ఉంటుంది.

iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Z7 Pro 5G డివైజ్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి-జీ610 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z7 Pro 5G డివైజ్ 8జిబి + 128జిబి మరియు 8జిబి + 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: iQOO Z7 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: iQOO Z7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: iQOO Z7 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: iQOO Z7 Pro 5G డివైజ్ గ్రాఫైట్ మ్యాట్, బ్లూ లగూన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Z7 Pro 5G డివైజ్ లో వై-ఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐపీ52 రేటింగ్, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Dimensity 7200 చిప్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన iQOO Z7 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర! https://www.91mobiles.com/telugu/iqoo-z7-pro-5g-india-price-specs-leaked-before-launch/ Wed, 26 Jul 2023 05:34:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=7325 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో భారతీయ మార్కెట్ లో iQOO Z7 Pro 5G ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటనను కంపెనీ ఇండియా హెడ్ నిపుణ్ మార్య తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసారు. తాజాగా iQOO Z7 Pro 5G భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం […]

The post లాంచ్‌కి ముందు లీకైన iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z7 Pro 5G
  • ఇప్పటికే అధికార ప్రకటన చేసిన కంపెనీ
  • భారత్ లో iQOO Z7 Pro 5G ధర రూ.25,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో భారతీయ మార్కెట్ లో iQOO Z7 Pro 5G ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటనను కంపెనీ ఇండియా హెడ్ నిపుణ్ మార్య తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసారు. తాజాగా iQOO Z7 Pro 5G భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన iQOO Z7 Pro 5G ధర

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ ధరను టిప్‌స్టర్ పారస్ గుగ్లాని షేర్ చేసారు. గుగ్లాని ప్రకారం, iQOO Z7 Pro 5G ప్రారంభ ధర దాదాపు రూ.25,000 ఉండనుంది. ఇంకా టాప్ వేరియంట్ ధర రూ.30,000 వరకు ఉండవచ్చని టిప్‌స్టర్ చెబుతున్నారు. OnePlus Nord CE 3, Redmi Note 12 Pro 5G ల యొక్క ధరల సెగ్మెంట్ లోనే iQOO Z7 Pro 5G ధర ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO Z7 Pro 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z7 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడనున్నారు.
  • ఓఎస్: iQOO Z7 Pro 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z7 Pro 5G రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అవుతోంది. బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేయనుండగా, టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తోంది. ఇకపోతే 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి.
  • కెమెరా: iQOO Z7 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Z7 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన iQOO Z7 Pro 5G స్పెసిఫికేషన్స్, భారత మార్కెట్ ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 Pro 5G; టీజర్ ఇమేజ్ షేర్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/iqoo-z7-pro-5g-official-teaser-image-key-specs/ Mon, 24 Jul 2023 14:38:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7303 ఈ ఏడాది మార్చి నెలలో ఐకూ సంస్థ iQOO Z7 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు iQOO Z7 Pro 5G ని లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ సీఈవోనే టీజర్ ఇమేజ్ ద్వారా ఖరారు చేశారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి బెటర్ స్పెసిఫికేషన్స్, అప్‌గ్రేడ్స్ తో రానున్నట్లు సమాచారం. సరే, రండి, ఓసారి iQOO Z7 Pro 5G […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 Pro 5G; టీజర్ ఇమేజ్ షేర్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే నెలో iQOO Z7 Pro 5G లాంచ్ అయ్యే అవకాశం
  • టీజర్ ఇమేజ్ షేర్ చేసిన ఐకూ సీఈవో నిపుణ్ మార్య
  • కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న iQOO Z7 Pro 5G

ఈ ఏడాది మార్చి నెలలో ఐకూ సంస్థ iQOO Z7 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు iQOO Z7 Pro 5G ని లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ సీఈవోనే టీజర్ ఇమేజ్ ద్వారా ఖరారు చేశారు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి బెటర్ స్పెసిఫికేషన్స్, అప్‌గ్రేడ్స్ తో రానున్నట్లు సమాచారం. సరే, రండి, ఓసారి iQOO Z7 Pro 5G కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO Z7 Pro 5G టీజర్ ఇమేజ్

సోషల్ మీడియా వేదిక ద్వారా ఐకూ సంస్థ సీఈవో నిపుణ్ మార్య iQOO Z7 Pro 5G లాంచ్ వివరాలను పంచుకున్నారు.

  • తన పోస్ట్ లో నిపుణ్ మార్య.. తమ కొత్త డివైజ్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలిపారు. దీంతో పాటు, ఆయన కర్వ్డ్ డిస్ప్లే గురించి కూడా తెలిపారు.
  • టీజర్ ఇమేజ్ లో కొత్త డివైజ్ కర్వ్డ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్ తో ఉండటం గమనించవచ్చు.
  • లాంచ్ టైమ్‌లైన్ గురించి కంపెనీ నుంచి కచ్చితమైన తేదీ ప్రకటన రాలేదు. కానీ, కమింగ్ సూన్ అని కంపెనీ సీఈవో తన పోస్ట్ లో రాసుకొచ్చారు. దీని బట్టి, iQOO Z7 Pro 5G డివైజ్ ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ఆరంభంలో లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు.

iQOO Z7 Pro 5G ధర (అంచనా)

ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న iQOO Z7 5G 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.21,990 గా ఉంది. ఇక iQOO Z7 Pro 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తే, స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. మరి iQOO Z7 Pro 5G లో డిస్ప్లే, ప్రాసెసర్ తో పాటు ఇంకా ఏ మార్పులు ఉండనున్నాయో చూడాలి. సరే, ఓసారి స్టాండర్డ్ మోడల్ iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z7 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z7 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z7 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. ఇది 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: iQOO Z7 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: ఈ ఫోన్ లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iQOO Z7 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z7 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 Pro 5G; టీజర్ ఇమేజ్ షేర్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>