Moto E22s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 22 Oct 2022 07:35:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto E22s ఫస్ట్ సేల్: నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయం https://www.91mobiles.com/telugu/moto-e22s-india-first-sale-flipkart/ Sat, 22 Oct 2022 07:35:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3027 హైలైట్స్ నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా Moto E22s అమ్మకాలు షురూ మీడియాటెక్ జీ37 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 ఈ వారం ఆరంభంలో Moto e22s స్మార్ట్ ఫోన్ ని మోటోరోలా కంపెనీ భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. కాగా, నేడు ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కి వచ్చింది. ఈ […]

The post Moto E22s ఫస్ట్ సేల్: నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా Moto E22s అమ్మకాలు షురూ
  • మీడియాటెక్ జీ37 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999

ఈ వారం ఆరంభంలో Moto e22s స్మార్ట్ ఫోన్ ని మోటోరోలా కంపెనీ భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. కాగా, నేడు ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కి వచ్చింది. ఈ లేటెస్ట్ Moto e22s స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ జీ37 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో పంచ్-హోల్ నాచ్, 16ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి.

Moto e22s స్మార్ట్ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్ కలిగి ఉంది. భారత్ లో Moto e22s ధర, లాంచ్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి మరింతగా తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto e22s ధర, లభ్యత

Moto e22s 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధరను రూ.8,999 గా నిర్ణయించారు. Moto e22s స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 22 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto e22s బయ్యర్స్ గూగుల్ నెస్ట్ హబ్ (సెకండ్ జనరేషన్) మరియు గూగుల్ నెస్ట్ మిని (సెకండ్ జనరేషన్) ని వరుసగా రూ.3,999 మరియు రూ.1,499 లకే సొంతం చేసుకోవచ్చు.

Moto e22s స్పెసిఫికేషన్స్

Moto e22s లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 268పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ ని అమర్చారు. ఈ చిప్ పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ తో ఇంటిగ్రేడ్ చేయబడి ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. అయితే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

Moto e22s యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto e22s లో 16ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి తోడు 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందువైపున 8ఎంపి కెమెరాను అమర్చారు.

Moto e22s లో పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ ని అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. ఇది పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుంది.

Moto e22s ఆర్కిటిక్ బ్లూ, ఇకో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. Moto e22s స్మార్ట్ ఫోన్ 163.95 మిల్లీ మీటర్ల పొడవు, 74.94 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ ఐపీ52 రేటింగ్ తో రావడం వల్లన ఇది చిరుజల్లులను తట్టుకుని నిలుస్తుంది. Moto e22s ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ అలాగే రెండేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని మోటోరోలా హామి ఇస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Moto E22s ఫస్ట్ సేల్: నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Moto E22s: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత https://www.91mobiles.com/telugu/moto-e22s-launched-india-specs-price-availability/ Mon, 17 Oct 2022 10:09:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=2920 హైలైట్స్ భారత్ లో లాంచ్ అయిన Moto E22s బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో Moto E22s ధర రూ.8,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా తాజాగా Moto E22s అనే బడ్జెట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ లో […]

The post భారత్ లో లాంచ్ అయిన Moto E22s: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన Moto E22s బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో Moto E22s ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా తాజాగా Moto E22s అనే బడ్జెట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా, మందపాటి బాటమ్ బెజెల్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ లో రెండు సెన్సర్స్ ఉంటాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్రేడియంట్ డిజైన్, గ్లాసీ ఫినిష్ తో యూనిక్ గా కనిపిస్తోంది. భద్రత కోసం ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. డాల్బీ అట్మాస్, వాటర్ రిపెల్లంట్ డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

6.5-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 16 ఎంపి మెయిన్ కెమెరా, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.

భారత్ లో Moto E22s ధర, లభ్యత

భారత్ లో Moto E22s 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. ఇది ఇకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ తో లభించనుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.2,000 జియో రీచార్జ్ క్యాష్ బ్యాక్ మరియు జీ5 యాన్యువల్ మెంబర్షిప్ పై రూ.549 డిస్కౌంట్ కలుపుకుని మొత్తం రూ.2.549 బెనిఫిట్స్ ని మోటోరోలా అందిస్తోంది.

Moto E22s స్పెసిఫికేషన్స్

Moto E22s లో 6.5-ఇంచ్ హెచ్డీ+ మ్యాక్స్‌విజన్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అమర్చారు. ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. Moto E22s ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ Moto E22s లో ఉన్నాయి. ఈ ఫోన్ వాటర్-రిపెల్లెంట్ డిజైన్ తో వస్తోంది. Moto E22s లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డాల్బి అట్మాస్, స్టీరియో స్పీకర్స్, ఎఫ్ఎం రేడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. బ్యాటరీ 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Moto E22s స్మార్ట్ ఫోన్ 163.95 మిల్లీ మీటర్ల పొడవు, 74.94 మిల్లీమీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

ఇప్పుడు Moto E22s కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto E22s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16ఎంపి మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచ్ అయిన Moto E22s: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 17 న భారత్ లో లాంచ్ కానున్న Moto E22s https://www.91mobiles.com/telugu/moto-e22s-india-launch-timeline-specs-tipped/ Sat, 15 Oct 2022 14:56:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=2909 హైలైట్స్ 2022 అక్టోబర్ 17 న Moto E22s భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానున్న Moto E22s ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనున్న Moto E22s స్మార్ట్ ఫోన్ Motorola ప్రస్తుతం Moto E22s అనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రీమియమ్ డిజైన్ తో వస్తోన్న ఈ ఫోన్ […]

The post అక్టోబర్ 17 న భారత్ లో లాంచ్ కానున్న Moto E22s first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2022 అక్టోబర్ 17 న Moto E22s భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానున్న Moto E22s
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనున్న Moto E22s స్మార్ట్ ఫోన్

Motorola ప్రస్తుతం Moto E22s అనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రీమియమ్ డిజైన్ తో వస్తోన్న ఈ ఫోన్ అక్టోబర్ 17 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ గా బయటకు వచ్చిన లీక్స్ ని బట్టి ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ప్లాట్ఫామ్ పై పని చేయనుందని తెలుస్తోంది. ఇకపోతే, ఈ నెల మొదట్లో మోటోరోలా కంపెనీ మోటో ఈ32, మోటో జి37 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.

లాంచ్ కి ముందు లీకైన Moto E22s స్పెసిఫికేషన్స్

2022, అక్టోబర్ 17 న Moto E22s స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ ద్వారా Moto E22s యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. మరి ఆ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Moto E22s స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే తో వస్తోంది. ఈ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు. ఈ ఫోన్ ఐపీ52 వాటర్ ప్రూఫింగ్ తో వస్తోంది. గత నెలలో Moto E22s యూరోపియన్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభించనుంది.

Moto E22s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. Moto E22s లో 4,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto E22s స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తోంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. హోల్-పంచ్ కటౌట్ ని సెంటర్ లో అందించారు. ఇందులో కెమెరా ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్ బయ్యర్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు.

యూరోప్ మార్కెట్స్ లో Moto E22s ధర 139.99 యూరోలు (సుమారు రూ.11,000) గా ఉంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. లాంచ్ రోజున పూర్తి వివరాలు తెలుస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అక్టోబర్ 17 న భారత్ లో లాంచ్ కానున్న Moto E22s first appeared on 91Mobiles Telugu.

]]>