Moto Edge 50 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 16 Sep 2024 18:15:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/#respond Sun, 11 Aug 2024 18:28:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=12934 స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు […]

The post OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఈ ఆర్టికల్ లో OnePlus Nord 4 మరియు Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్లలో ఎందులో ఉత్తమమైన కెమెరా ఉందో తెలుసుకుందాం.

OnePlus Nord 4 మరియు Motorola Edge 50 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

సబ్జెక్ట్ పై డిఫాల్ట్ ఆటో‌ఫోకస్ తో రెండు ఫోన్ల యొక్క పాయింట్-అండ్-షూట్ సామర్థ్యాన్ని మేం టెస్ట్ చేశాం. OnePlus Nord 4 లో టెలీఫోటో లెన్స్ లేదు. అందుకోసమే మేం, జూమ్ కేపబులిటీస్‌ను పోల్చి చూడలేదు. సరే, ఓసారి Nord 4 మరియు Edge 50 Pro ఫోన్ల యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 4

ప్రైమరీ సెన్సర్: 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ సెన్సర్, ఈఐఎస్ + ఓఐఎస్

సెకండరీ సెన్సర్: 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ

టెలీఫోటో సెన్సర్: ఇందులో లేదు

ఫ్రంట్ కెమెరా: 16ఎంపి సెన్సర్, ఎఫ్/2.4 అపర్చర్

Motorola Edge 50 Pro

ప్రైమరీ సెన్సర్: 50ఎంపి సెన్సర్, ఎఫ్/1.4 అపర్చర్, ఓఐఎస్

సెకండరీ సెన్సర్: 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ

టెలీఫోటో సెన్సర్: 10ఎంపి 2ఎక్స్ సెన్సర్, ఓఐఎస్

ఫ్రంట్ కెమెరా: 50ఎంపి శాంసంగ్ సెన్సర్, ఎఫ్/1.9 అపర్చర్

OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇందులో క్వాల్కమ్ స్పెక్ట్రా 18-బిట్ ట్రిపుల్ కాగ్నిటివ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్‌పీ) ఉంది. Motorola Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇందులో క్వాల్కమ్ స్పెక్ట్రా 12-బిట్ ట్రిపుల్ ఐఎస్‌పీ ఉంది. టెక్నికల్‌గా వన్‌ప్లస్ నార్డ్ 4 లో హయ్యర్ బిట్ రేట్ సపోర్ట్ ఉంది. దీన్ని బట్టి ఈ ఫోన్ బాగా పెర్ఫామ్ చేయాలి. మరింకెందుకు ఆలస్యం, రియల్ లైఫ్ యూసేజ్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి కెమెరా కంపారిజన్ లోకి వెళదాం పదండి.

డేలైట్

ఈ రెండు ఫోన్లు కూడా 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 లోని అపర్చర్ ఫౌంటెయిన్ వెనకాల నేచురల్ డెప్త్ క్రియేట్ చేసింది. ఈ చిన్నదైన అపర్చర్ తక్కువ లైట్‌ను క్యాప్చర్ చేసింది. దీంతో మోటో‌ ఇమేజ్‌తో పోల్చితే, గ్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి.

Motorola Edge 50 Pro లో సోషల్ మీడియాలో షేర్ చేయదగిన క్వాలిటీ, వైబ్రన్సీతో కూడిన అవుట్‌పుట్ వస్తోంది. మరోవైపు, OnePlus Nord 4 కూల్ కలర్స్ తో డల్ ఇమేజెస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. రెండు ఫోన్లలో తీసిన ఫోటోలు కలర్ విషయంలో తేడాగా ఉన్నాయి. కానీ, నార్డ్ 4 రిజల్ట్స్ రియాల్టీకి దగ్గరగా ఉన్నాయి. హెచ్డీఆర్ ప్రాసెసింగ్, డీటెయిల్స్ విషయాల్లో Motorola Edge 50 Pro బాగా పెర్ఫామ్ చేసింది. Nord 4 విషయానికి వస్తే, హైలైట్స్ ను సరిగ్గా మేనేజ్ చేసింది. డీటెయిల్స్ అనేవి ఎక్కు షార్ప్‌నెస్ తో చూపబడ్డాయి.

విజేత: Motorola Edge 50 Pro

అల్ట్రావైడ్

OnePlus Nord 4 లో 8ఎంపి సోని అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ఇది 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. అంటే, ఇది ఇమేజ్ మధ్యలో ఎక్కువ డీటెయిల్స్‌ చూపిస్తుంది. ప్రైమరీ లెన్స్ మరియు అల్ట్రావైడ్ లెన్స్‌ల మధ్య కలర్ కన్సిస్టెన్సీ బాగుంది.

Motorola Edge 50 Pro లో 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ఇది ఇమేజ్ లో అన్నిచోట్టా ఎక్కువ డీటెయిల్స్‌ను చూపిస్తుంది. ఈ సెన్సర్ తో తీసిన ఇమేజెస్ ఓవర్‌శాచురేటెడ్ గా ఉండి, నాయిస్ ను కలిగి ఉన్నాయి. ఇంకా ఈ ఇమేజెస్ లో విచిత్రంగా బ్లూ టింట్ కూడా కనిపిస్తోంది.

విజేత: సమానం

పొట్రెయిట్

Motorola Edge 50 Pro పొట్రెయిట్స్ విషయంలో కూడా మరోసారి ఓవర్‌శాచురేషన్ సమస్య వల్లన ఇబ్బంది పడింది. ఎక్కువ కాంట్రాస్ట్ అనేది ఇమేజెస్ లో మనం గమనించవచ్చు. అయితే బొకే ఎఫెక్ట్ నేచురల్ గా ప్రొడ్యూస్ చేసింది. సబ్జెక్ట్ లోని డీటెయిల్స్ చూపించడంలో మరియు ఎడ్జ్-కటౌట్ విషయంలో సెన్సర్ బాగా పని చేసింది.

పొట్రెయిట్స్ విషయంలో OnePlus Nord 4 బ్యాలన్స్డ్ గా ఉంది. శాచురేషన్ మరియు హెచ్డీఆర్ విషయాల్లో పెర్ఫామెన్స్ బాగుంది. కానీ, కాంట్రాస్ట్ మరియు డీపర్ బ్లాక్స్ లోపించాయి. అయితే వీటిని కొన్ని ఎడిట్స్ తో సెట్ చేసుకోవచ్చు. అయితే వన్‌ప్లస్ తన ఇమేజెస్ కు స్కిన్ స్మూథెనింగ్ ని అప్లై చేసినట్లు అనిపిస్తోంది.

విజేత: OnePlus Nord 4

సెల్ఫీ

వన్‌ప్లస్ నార్డ్ 4 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. వైబ్రంట్ కలర్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేయదగిన ఇమేజెస్‌ను ఇది అందిస్తోంది. అయితే కొంచెం వార్మ్ కలర్ గుర్తించడం జరిగింది. స్కిన్ కలర్ మరియు కలర్ కన్సిస్టెన్సీ కాస్త మెరుగవ్వాలి.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది పెద్ద సెన్సర్ కాబట్టి, నార్డ్ 4 లో ఇచ్చిన 16ఎంపి కంటే బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. డీటెయిలింగ్ మరియు కాంట్రాస్ట్, స్కిన్ టోన్ విషయాల్లో ఎడ్జ్ 50 ప్రో ద్వారా తీసిన సెల్ఫీలు బెటర్ గా ఉన్నాయి.

విజేత: Motorola Edge 50 Pro

లో లైట్

నైట్ మోడ్ లేకుండా లో-లైట్ కండీషన్స్ లో, వన్‌ప్లస్ నార్డ్ 4 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హెచ్డీఆర్, ఎక్స్‌పోజర్, కలర్ ఆక్యురెసీ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంది. లైట్ సోర్సెస్ ను కూడా బాగా వాడుకుంది.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీటెయిల్డ్ ఇమేజెస్ ను అందించింది. అలాగే ఇమేజెస్ లోని టెక్స్ట్ పార్ట్స్ షార్ప్ గా ఉన్నాయి. అయితే కాంట్రాస్ట్ ఎక్కువ కావడం, ప్రాసెసింగ్ నాసీరకంగా ఉండటంతో నాణ్యమైన ఇమేజ్ రాలేదు. నార్డ్ 4 తో పోల్చితే, ఈ విషయంలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ప్రభావం చూపలేకపోయింది.

విజేత: OnePlus Nord 4

నైట్ మోడ్

నైట్ మోడ్ లో వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఇమేజ్ చూడటానికి సాధారణ ఫోటో మాదిరే ఉంది. కానీ, కాస్త బ్రైట్నెస్ పెరిగింది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజ్ లో నైట్ మోడ్ ఇమేజ్ ని గమనిస్తే, కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది. రెడ్ నియాన్ సైన్స్, బ్యాక్‌లిట్ మెను బోర్డ్స్ వంటివి బాగానే కనిపిస్తున్నాయి. ఎక్స్‌పోజర్ బాగానే బ్యాలన్స్ అయ్యింది. లైట్ సోర్సెస్ చుట్టూ ఉన్న బ్లూమ్ నార్డ్ 4 కంటే బెటర్ గా ఉంది. అలాగే బిల్డింగ్ ప్యానెల్ పైన గ్రేడియంట్ కూడా సమతూకంతో ఉంది.

విజేత: Motorola Edge 50 Pro

సెల్ఫీ లో-లైట్ (ఫ్లాష్ తో)

రెండు ఫోన్లు కూడా సబ్జెక్ట్‌ పైన లైట్‌ని బాగానే ప్రసరింపజేస్తున్నాయి. చాలా తక్కువ కాంతి ఉన్న సమయాల్లో స్క్రీన్ ఫ్లాష్ తో తీసే ఫోటోలను రెండు ఫోన్లు కూడా బాగానే హ్యాండిల్ చేశాయి. కలర్ విషయానికి వస్తే, టీ-షర్ట్ కలర్ మోటో ఎడ్జ్ 50 ప్రో లో రియాల్టీకి దగ్గరగా ఉంది. టీ-షర్ట్ మరియు షెల్ఫ్ పైన బాక్స్‌ లోని రెడ్ కలర్ ని నార్డ్ 4 బూస్ట్ చేసింది.

వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఇమేజ్‌ను గమనిస్తే, స్కిన్ టోన్ బ్రైట్ గా ఉంది. మోటో ఎడ్జ్ 50 ప్రో తో తీసిన ఫోటోలు వైడ్ గా ఉండి, సాఫ్ట్ గా ఉన్నాయి. అలాగే కాస్త నాయిస్ కూడా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ ను మోటో ఎడ్జ్ 50 ప్రో బాగా హ్యాండిల్ చేసింది.

రెండింట్లో దేన్ని ఎంచుకోవాలనేది, మీరు ప్రిఫర్ చేసే ఇమేజ్ ను బట్టి ఉంటుంది. బ్రైట్ గా, డీటెయిల్డ్ గా ఉండాలంటే, నార్డ్ 4 బెటర్. సెల్ఫీలో ఎక్కువ మెంబర్స్ తో పాటు, కలర్ యాక్యురెసీ, లైట్ కంట్రోల్ వంటివి మీకు ముఖ్యమైతే, మోటో ఎడ్జ్ 50 ఫ్రో బెటర్.

విజేత: సమానం

ఏది బెటర్?

రెండు ఫోన్లు కూడా ఫోటోగ్రఫీ విషయంలో సమానమైన పనితీరును కనబరిచాయి. అయితే, కొంచెం తేడాతో Motorola Edge 50 Pro విజయం సాధించింది. డే-లైట్ షాట్స్, సెల్ఫీ, నైట్ మోడ్ వంటి విషయాల్లో మోటో ఎడ్జ్ 50 ప్రో బాగా పెర్ఫామ్ చేసింది. దీన్ని బట్టి, ఈ సెగ్మెంట్ లో ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పలేం. ఎందుకంటే, ఓవర్-శాచ్యురేషన్ సమస్య, లో-లైట్ పెర్ఫామెన్స్ వంటి వాటిని మోటోరోలా మెరుగుపరచాల్సి ఉంది. ఇక కాంట్రాస్ట్, డీపర్ బ్లాక్స్ ఏరియాల్లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.

The post OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/feed/ 0
Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-5g-top-5-features/ Mon, 01 Apr 2024 15:22:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=10927 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Pro 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ స్క్రీన్, హెచ్డీఆర్10+, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వంటి ఫీచర్లతో వస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Motorola Edge 50 Pro 5G […]

The post Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 3న Motorola Edge 50 Pro 5G లాంచ్
  • pOLED 144Hz డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Pro 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ స్క్రీన్, హెచ్డీఆర్10+, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వంటి ఫీచర్లతో వస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Motorola Edge 50 Pro 5G లో ఉన్న 5 ఉత్తమమైన ఫీచర్లేవో తెలుసుకుందాం.

Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు

1.5K డిస్ప్లే: Motorola Edge 50 Pro 5G డివైజ్ లో 6.7-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

10MP టెలీఫోటో లెన్స్: మోటోరోలా ఎడ్జ్50 ప్రో 5జీ లో అద్భుతమైన కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్ లో 10ఎంపి టెలీఫోటో 30x హైబ్రిడ్ జూమ్ లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ + మ్యాక్రో కెమెరా, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

125W ఫాస్ట్ చార్జింగ్: Motorola Edge 50 Pro 5G లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే 1 నుంచి 100 శాతం వరకు ఫోన్ చార్జ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ టర్బోపవర్ చార్జ్ టెక్నాలజీతో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 10 వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్ ఫీచర్ ని కలిగి ఉంది.

4NM చిప్సెట్: మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ అందిస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.63Ghz.

హలో యూఐ: Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. హలో యూఐ యూజర్ కి ఉత్తమమైన, ఆకర్షణీయమైన అనుభూతిని అందిస్తుంది. మోటోరోలా సంస్థ ఈ ఫోన్ కి 3 మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని అందించనుంది.

The post Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/smartphones-to-be-launched-in-april-2024/ Sat, 30 Mar 2024 18:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=10904 ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. 2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు OnePlus Nord CE 4 5G Realme 12x 5G […]

The post Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్‌లో లాంచ్ కానున్న పలు స్మార్ట్‌ఫోన్లు
  • లైనప్ లో మోటోరోలా, రియల్మీ, శాంసంగ్
  • ఇంకా రెడ్మీ, ఇన్ఫినిక్స్ బ్రాండ్ల ఫోన్లు

ఏప్రిల్ నెలలో వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. మొబైల్ ఫోన్ కంపెనీలు తమ కొత్త డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. Samsung, Motorola, Realme, Redmi మరియు Infinix బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

2024 ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు

  • OnePlus Nord CE 4 5G
  • Realme 12x 5G
  • Motorola Edge 50 Pro
  • Samsung Galaxy M55 5G
  • Samsung Galaxy M15 5G
  • Infinix Note 40 Pro 5G
  • Infinix Note 40 Pro+ 5G

OnePlus Nord CE 4 5G

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 1వ తేదీన లాంచ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.24,999 గా ఉంటుందని తెలుస్తోంది. స్సెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Nord CE 4 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

Realme 12x 5G

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్‌గా వస్తోన్న Motorola Edge 50 Pro ధర రూ.25,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని సమాచారం.

Samsung Galaxy M55 5G

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఏప్రిల్ రెండో వారంలో లాంచ్ అవుతోంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.26,999 ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉండవచ్చు.

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2వ వారంలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర రూ.13,499 గా ఉండే అవకాశం ఉంది. Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 6జిబి ర్యామ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Infinix Note 40 Pro 5G సిరీస్

Infinix Note 40 Pro 5G సిరీస్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ కానుందని లీక్ ద్వారా తెలుస్తోంది. త్వరలో లాంచ్ తేదీన అధికారికంగా వెల్లడవుతుంది. Infinix Note 40 Pro 5G సిరీస్ లో Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G ఫోన్లు భారత్ లో లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నాయి. ప్రో మోడల్ 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ప్రో ప్లస్ వేరియంట్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఆఫర్ చేయనున్నాయి. ఈ ఫోన్లు 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ తో వస్తున్నాయి. ఇంకా Infinix Note 40 Pro 5G సిరీస్ 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.

The post Smartphones: 2024 ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Moto Edge 50 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు, ఏప్రిల్ 3న విడుదల https://www.91mobiles.com/telugu/moto-edge-50-pro-launch-date-april-3/ Tue, 19 Mar 2024 14:20:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10717 ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో మోటో ఎడ్జ్ 50 ప్రో డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. తాజాగా ఒక టీజర్ ఇమేజ్ ద్వారా Moto Edge 50 Pro యొక్క డిజైన్‌ని మోటోరోలా రివీల్ చేసింది. చైనాలో ఈ ఫోన్ Moto X50 Ultra పేరుతో లాంచ్ అవుతోంది. యూఎస్ లో Motorola Edge+ (2024) పేరుతో ఎంట్రీ […]

The post Moto Edge 50 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు, ఏప్రిల్ 3న విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 3న Moto Edge 50 Pro లాంచ్
  • ఏఐ ఫీచర్లతో వస్తోన్న డివైజ్
  • 1.5కే 144 హెర్ట్జ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో మోటో ఎడ్జ్ 50 ప్రో డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. తాజాగా ఒక టీజర్ ఇమేజ్ ద్వారా Moto Edge 50 Pro యొక్క డిజైన్‌ని మోటోరోలా రివీల్ చేసింది. చైనాలో ఈ ఫోన్ Moto X50 Ultra పేరుతో లాంచ్ అవుతోంది. యూఎస్ లో Motorola Edge+ (2024) పేరుతో ఎంట్రీ ఇవ్వబోతోంది. సరే, ఓసారి Moto Edge 50 Pro ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Edge 50 Pro ఇండియా లాంచ్ ఖరారు

Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 3న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్ కి వస్తోంది.

టీజర్ ప్రకటన ద్వారా ప్రధానంగా ఏఐ ఫీచర్లు హైలైట్ అవుతున్నాయి. దీన్ని బట్టి, Moto Edge 50 Pro లో ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు ఉంటాయని అర్థమవుతోంది.

Moto Edge 50 Pro లో 50ఎంపి ఏఐ ప్రో-గ్రేడ్ కెమెరా ఉంటుంది. ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్, టిల్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Moto Edge 50 Pro ఫీచర్లు (ఖరారైనవి)

  • డిస్ప్లే: Moto Edge 50 Pro లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ 1.5కే స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి. పాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే తో వస్తోన్న మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
  • కెమెరా: Moto Edge 50 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

Moto Edge 50 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Moto Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

Moto Edge 50 Pro లో 50ఎంపి ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, 6X టెలీఫోటో జూమ్ కెమెరా ఉంటాయి.

Moto Edge 50 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్

Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ ఎడ్జెస్, ఫ్లాట్ డిస్ప్లే, పంచ్-హోల్ కెమెరాతో వస్తోంది.

Moto Edge 50 Pro ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో రానుంది. తెలుపు రంగు వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.

The post Moto Edge 50 Pro ఇండియా లాంచ్ తేదీ ఖరారు, ఏప్రిల్ 3న విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>