Motorola Edge 30 Fusion - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 21 Sep 2022 15:04:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఈరోజు అర్థరాత్రి నుంచి Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/moto-edge-30-ultra-edge-30-fusion-first-sale/ Wed, 21 Sep 2022 15:04:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2492 హైలైట్స్: గత వారం భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra, Edge 30 Fusion స్మార్ట్ ఫోన్స్ నేడు అర్థరాత్రి మొదలు కానున్న ఈ ఫోన్ల ఫస్ట్ సేల్ 200ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్న Moto Edge 30 Ultra ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ గత వారం భారత్ లో Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ […]

The post ఈరోజు అర్థరాత్రి నుంచి Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గత వారం భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra, Edge 30 Fusion స్మార్ట్ ఫోన్స్
  • నేడు అర్థరాత్రి మొదలు కానున్న ఈ ఫోన్ల ఫస్ట్ సేల్
  • 200ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్న Moto Edge 30 Ultra

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ గత వారం భారత్ లో Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ రెండు ఫోన్లు సేల్ కి వస్తున్నాయి. 200ఎంపి కెమెరాతో లాంచ్ అవుతోన్న తొలి ఫోన్ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా కావడం విశేషం. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5, 1250 నిట్స్ బ్రైట్నెస్, 1500హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ 4.0 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 4610 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ టర్బో పవర్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ Moto Edge 30 Ultra లో ఉన్నాయి.

Moto Edge 30 Ultra యొక్క కెమెరా గురించి మాట్లాడితే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో F/1.95 అపర్చర్ తో కూడిన 200MP Samsung ISOCELL HP1 సెన్సర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12MP టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 60MP OmniVision OV60A ఫ్రంట్ కెమెరా ఉంది. 60ఎంపి కెమెరా వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Fusion లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, అడ్రెనో 660 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఇప్పుడు Moto Edge 30 Fusion యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ కలిగి ఉంది. అలాగే 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో ఆప్షన్ ని కలిగి ఉంది. ఇక మూడో కెమెరాగా 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంది. ఇప్పుడు Moto Edge 30 Fusion బ్యాటరీ విభాగం పై ఓ కన్నేద్దాం పదండి. Moto Edge 30 Fusion లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా Moto Edge 30 Fusion లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

Moto Edge 30 Ultra, Edge 30 Fusion ధరలు

Moto Edge 30 Ultra 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ ని రూ.54,999 కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు Moto Edge 30 Fusion 8జిబి + 128జిబి ధర రూ.42,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ ని రూ.39,999 కే సొంతం చేసుకోవచ్చు.

The post ఈరోజు అర్థరాత్రి నుంచి Moto Edge 30 Ultra, Edge 30 Fusion ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/motorola-edge-30-fusion-specs-spotted-on-geekbench/ Mon, 22 Aug 2022 14:32:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=1818 హైలైట్స్: టుండ్రా అనే కోడ్ నేమ్ తో గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు సింగిల్ కోర్ టెస్ట్ లో 1158 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 3444 పాయింట్లు సాధించిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మోటోరోలా కంపెనీ రీసెంట్ గా చైనాలో మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో ని లాంచ్ చేసింది. […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • టుండ్రా అనే కోడ్ నేమ్ తో గీక్‌బెంచ్ పై దర్శనమిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 1158 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 3444 పాయింట్లు సాధించిన మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్

మోటోరోలా కంపెనీ రీసెంట్ గా చైనాలో మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో ని లాంచ్ చేసింది. అదే ఈవెంట్ లో మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022 ఫోన్లను కూడా విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం మోటోరోలా ఎడ్జ్ 30 ప్యూజన్ యొక్క రెండర్స్ ఆన్‌లైన్లో ప్రత్యక్షమయ్యాయి. డిజైన్ ని చూస్తే ఫోన్ అచ్చంగా మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో మాదిరి కనిపిస్తోంది. అంటే ఎస్30 ప్రో ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో మోటోరోలా ఎడ్జ్ 30 ప్యూజన్ అనే పేరుతో లాంచ్ కానున్నట్లు స్పష్టమవుతోంది.

తాజాగా మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్ టుండ్రా అనే కోడ్ నేమ్ తో ప్రముఖ బెచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క కీలక స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. దీంతో వచ్చే నెల ఈ ఫోన్ యొక్క గ్లోబల్ ఎంట్రీ పై క్లారిటీ వచ్చినట్లైంది. మరి గీక్ బెంచ్ లిస్టింగ్ లో ఏముందో తెలుసుకుందాం పదండి.

Motorola Edge 30 Fusion గీక్‌బెంచ్ లిస్టింగ్

మైస్మార్ట్‌ప్రైస్ వెబ్ సైట్ తొలుత మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ని గీక్ బెంచ్ పై గుర్తించడంతో పాటు జీపీయూ వివరాలను వెలికితీసింది. జాబితాను బట్టి, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లో రెండు జనరేషన్ల క్రితం చిప్సెట్ అయిన స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, అలాగే అడ్రోనో 660 జీపీయూ ఉండనున్నాయి. ఇదే చిప్ ని మనం మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో స్మార్ట్ ఫోన్లో కూడా చూశాం.

 

గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ 8జిబి ర్యామ్ ని కలిగి ఉండనుంది. ఇక బెంచ్ మార్కింగ్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సింగిల్ కోర్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ 1158 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3444 పాయింట్లను సాధించింది.

Motorola Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ ఎస్30 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ కావడంతో, స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయని మేం అంచనా వేస్తున్నాం. మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 32 ఎంపి ఫ్రంట్ కెమెరా, 50 ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, 13 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి డెప్త్ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అయితే ఇవి ఇప్పటికీ కచ్చితమైన స్పెసిఫికేషన్స్ అని చెప్పలేం. కేవలం అంచనా మాత్రమేనని గుర్తించాలి. ఫోన్ రివీల్ అయ్యాకే పూర్తి ఫీచర్లు బయటకు వస్తాయి.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>