Motorola Edge 50 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 17:51:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-motorola-edge-50-pro-which-one-offers-better-battery-backup/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-motorola-edge-50-pro-which-one-offers-better-battery-backup/#respond Tue, 20 Aug 2024 17:49:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=13073 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే 91mobiles టెస్టింగ్ టీమ్ Vivo V40, Motorola Edge 50 Pro ల యొక్క బ్యాటరీ […]

The post Vivo V40 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే 91mobiles టెస్టింగ్ టీమ్ Vivo V40, Motorola Edge 50 Pro ల యొక్క బ్యాటరీ లైఫ్ ను పరీక్షించింది. ఓసారి ఆ టెస్టుల ఫలితాలను తెలుసుకుందాం.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయేదాకా, వివిధ టాస్కులను రన్ చేస్తూ వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ఈ టెస్టు సమయంలో, Vivo V40 80 శాతం బ్రైట్నెస్ + 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ పై 13 గంటల స్కోరు చేసింది. మరోవైపు, Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ 12 గంటల 30 నిమిషాల స్కోరు నమోదు చేసింది.

విజేత: Vivo V40

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

మేం జరిపిన వీడియో స్ట్రీమింగ్ టెస్టులో, 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్‌పై Motorola Edge 50 Pro ఫోన్ అరగంట తర్వాత, వివో వీ40 కంటే 60mAh ఎక్కువ బ్యాటరీని వాడుకుంది. బ్యాటరీ పర్సెంటేజీ విషయానికి వస్తే, ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ 5 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, వివో వీ40 బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. వివో వీ40 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

విజేత: Vivo V40

గేమింగ్ టెస్ట్

వివో వీ40 లో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను 30 నిమిషాల పాటు ప్రతీ గేమ్‌ను ఆడాక, 16 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం ఉన్నాయి. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాటరీ 26 శాతం డ్రాప్ అయ్యింది.

విజేత: Vivo V40

చార్జింగ్ టెస్ట్

80 వాట్ ఫాస్ట్ చార్జర్ తో.. వివో వీ40 ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పట్టింది. మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజ్‌లో ఉన్న చార్జ్ బూస్ట్ ఫీచర్ వల్లన 128 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు.. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 16 నిమిషాల సమయం పట్టింది. 12జిబి ర్యామ్ వేరియంట్ 128 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కలిగి ఉంది. 8జిబి ర్యామ్ వేరియంట్ 68 వాట్ చార్జర్ తో వస్తుంది.

విజేత: Motorola Edge 50 pro

ఏది బెటర్?

వివో వీ40 మరియు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజెస్ లో అన్ని టెస్టుల ఫలితాలను పరిశీలించాక, Vivo V40 విజేత అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం ప్లస్ పాయింట్. ఇక, Motorola Edge 50 Pro ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ఈ ఫోన్ 128 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రావడం ప్లస్ పాయింట్. ఈ ఫీచర్ 12జిబి ర్యామ్ వేరియంట్ లో మాత్రమే ఉంది.

The post Vivo V40 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-motorola-edge-50-pro-which-one-offers-better-battery-backup/feed/ 0
రూ.30,000 లోపే లభించనున్న Motorola Edge 50 Pro; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-available-below-rs-30000-know-full-details/ Tue, 30 Apr 2024 14:28:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11271 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఈ నెల ఆరంభంలో Motorola Edge 50 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.31,999 ధరతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్‌ని ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా Motorola Edge 50 Pro డివైజ్ రూ.30,000 లోపు ధరకే లభించనుంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Motorola Edge 50 Pro ఆఫర్ వివరాలు […]

The post రూ.30,000 లోపే లభించనున్న Motorola Edge 50 Pro; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ ఆరంభంలో Motorola Edge 50 Pro లాంచ్
  • భారత్ లో లాంచ్ ధర రూ.31,999
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ధర రూ.30,000 లోపే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఈ నెల ఆరంభంలో Motorola Edge 50 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.31,999 ధరతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్‌ని ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా Motorola Edge 50 Pro డివైజ్ రూ.30,000 లోపు ధరకే లభించనుంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Pro ఆఫర్ వివరాలు

Motorola Edge 50 Pro డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను కలుపుకుని ఈ ధరకి లభిస్తుంది. హ్యాండ్సెట్ అసలు ధర రూ.31,999 (8జిబి+256జిబి) గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.35,999 గా ఉంది.

Motorola Edge 50 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 Pro లో 6.7-ఇంచ్ స్క్రీన్, 1.5కే పీఓఎల్ఈడీ కర్వ్డ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Motorola Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 Pro డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్: Motorola Edge 50 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 17 వరకు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి వస్తాయి.

బ్యాటరీ: Motorola Edge 50 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Motorola Edge 50 Pro డివైజ్ లో డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ రెసిస్టన్స్ ఉన్నాయి.

The post రూ.30,000 లోపే లభించనున్న Motorola Edge 50 Pro; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: 125W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Edge 50 Pro 5G https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-5g-launched-india-125w-fast-charging/ Wed, 03 Apr 2024 18:05:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=10938 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 50 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది. Motorola Edge 50 Pro 5G లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, ఐపీ68 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Motorola Edge 50 Pro 5G యొక్క ధర, […]

The post Motorola: 125W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Edge 50 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Motorola Edge 50 Pro 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్
  • ఐపీ68 రేటింగ్, 12జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Edge 50 Pro 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చింది. Motorola Edge 50 Pro 5G లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, ఐపీ68 రేటింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Motorola Edge 50 Pro 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ తేదీ వివరాలు తెలుసుకుందాం పదండి.

Motorola Edge 50 Pro 5G ధర, లభ్యత

Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.31,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఫోన్ కొనుగోలుపై రూ.2,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.

ఆఫర్స్ అనంతరం, బేస్ మోడల్ ధర రూ.29,999 కి చేరుతుంది. టాప్ మోడల్ రూ.33,999 కి లభిస్తుంది.

Motorola Edge 50 Pro 5G డివైజ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఏప్రిల్ 9వ తేదీ నుంచి సేల్‌కి వస్తుంది.

Motorola Edge 50 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Motorola Edge 50 Pro 5G లో 6.7-ఇంచ్ 1.5కే 3డీ కర్వ్డ్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, ఎస్జీఎస్ ఐ-ప్రొటెక్షన్ టెక్నాలజీ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.63Ghz.

కెమెరా: Motorola Edge 50 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ + మ్యాక్రో లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 8జిబి ర్యామ్ వేరియంట్ 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 12జిబి ర్యామ్ వేరియంట్ లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఓఎస్: Motorola Edge 50 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్‌కి 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

The post Motorola: 125W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Edge 50 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-5g-top-5-features/ Mon, 01 Apr 2024 15:22:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=10927 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Pro 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ స్క్రీన్, హెచ్డీఆర్10+, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వంటి ఫీచర్లతో వస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Motorola Edge 50 Pro 5G […]

The post Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 3న Motorola Edge 50 Pro 5G లాంచ్
  • pOLED 144Hz డిస్ప్లేతో వస్తోన్న డివైజ్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Motorola ఎడ్జ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Motorola Edge 50 Pro 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ స్క్రీన్, హెచ్డీఆర్10+, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వంటి ఫీచర్లతో వస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Motorola Edge 50 Pro 5G లో ఉన్న 5 ఉత్తమమైన ఫీచర్లేవో తెలుసుకుందాం.

Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్లు

1.5K డిస్ప్లే: Motorola Edge 50 Pro 5G డివైజ్ లో 6.7-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

10MP టెలీఫోటో లెన్స్: మోటోరోలా ఎడ్జ్50 ప్రో 5జీ లో అద్భుతమైన కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్ లో 10ఎంపి టెలీఫోటో 30x హైబ్రిడ్ జూమ్ లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ + మ్యాక్రో కెమెరా, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

125W ఫాస్ట్ చార్జింగ్: Motorola Edge 50 Pro 5G లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే 1 నుంచి 100 శాతం వరకు ఫోన్ చార్జ్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ టర్బోపవర్ చార్జ్ టెక్నాలజీతో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 10 వాట్ వైర్లెస్ పవర్ షేరింగ్ ఫీచర్ ని కలిగి ఉంది.

4NM చిప్సెట్: మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ అందిస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.63Ghz.

హలో యూఐ: Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. హలో యూఐ యూజర్ కి ఉత్తమమైన, ఆకర్షణీయమైన అనుభూతిని అందిస్తుంది. మోటోరోలా సంస్థ ఈ ఫోన్ కి 3 మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని అందించనుంది.

The post Motorola Edge 50 Pro 5G లో ఉన్న టాప్-5 ఫీచర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>