Motorola Razr 40 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Aug 2024 08:21:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Razr 40, Razr 40 Ultra పై రూ.50,000 వరకు డిస్కౌంట్, అమెజాన్‌పై ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-discount-upto-rs-50000-on-amazon-know-full-details/ https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-discount-upto-rs-50000-on-amazon-know-full-details/#respond Wed, 07 Aug 2024 06:28:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12858 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Motorola Razr 40, Motorola Razr 40 Ultra లపై లభిస్తోన్న డీల్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ మోడల్స్, ఇటీవలె లాంచైన రేజర్ 50 లైనప్ కంటే ముందు వచ్చాయి. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం. Motoroal Razr 40, Motoroal Razr 40 Ultra […]

The post Motorola Razr 40, Razr 40 Ultra పై రూ.50,000 వరకు డిస్కౌంట్, అమెజాన్‌పై ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Motorola Razr 40 Ultra డిస్కౌంట్ ధర రూ.46,749
  • Motorola Razr 40 టీజ్డ్ ప్రైస్ రూ.32,999 (బ్యాంక్ ఆఫర్స్‌తో)
  • ఎస్బీఐ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Motorola Razr 40, Motorola Razr 40 Ultra లపై లభిస్తోన్న డీల్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ మోడల్స్, ఇటీవలె లాంచైన రేజర్ 50 లైనప్ కంటే ముందు వచ్చాయి. సరే, ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.

Motoroal Razr 40, Motoroal Razr 40 Ultra డీల్స్

Motoroal Razr 40 Ultra యొక్క సింగిల్ వేరియంట్ (8జిబి/256జిబి) ధర రూ.89,999 గా ఉంది. మరోవైపు, Motoroal Razr 40 మోడల్ రూ.59,999 తో లాంచ్ అయ్యింది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా Motoroal Razr 40 Ultra కేవలం రూ.46,749 ధరతో లిస్ట్ అయ్యింది. అంటే ఏకంగా రూ.43,250 డిస్కౌంట్ అన్నమాట.

ఎస్బీఐ కార్డ్ పై పూర్తి చెల్లింపు చేస్తే, రూ.750 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఈఎంఐ ద్వారా రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.45,999 కి చేరుతుంది.

మరోవైపు, Motoroal Razr 40 ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ, ధర మాత్రం అమెజాన్ పై రూ.32,999 అని టీజ్ చేశారు. ఇది బ్యాంక్ ఆఫర్ తో కలుపుకుని అనే విషయం గమనించాలి.

Motorola Razr 40 మరియు Motorola Razr 40 Ultra మీరు కొనవచ్చా?

మోటోరోలా రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే, మీరు గనుక డిఫరెంట్ గా ఉండే ఫోన్లను ఇష్టపడే వారైతే, ఈ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఈ ఫోల్డబుల్ ఫోన్లు ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చినవి. పైగా, ఈ ఫోన్లలో బ్లోట్‌వేర్ లేదా యాడ్స్ అనేవి కనిపించవు. నాజూకైన, దృఢమైన బిల్డ్ క్వాలిటీని ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి.

అల్ట్రా మోడల్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు. రోజువారీ వినియోగానికి ఇది ఎంతో బాగా పని చేస్తుంది. మల్టీ-టాస్కింగ్, గేమింగ్ ను కూడా బాగా హ్యాండిల్ చేయగలదు. అంతేకాదు, బ్యాక్ ప్యానెల్ పై 3.6-ఇంచ్ సెకండ్ స్క్రీన్ కూడా కలదు. మ్యూజిక్ కంట్రోలింగ్, నోటిఫికేషన్స్ మరియు ఇతర పనులను ఈ బ్యాక్ స్క్రీన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఇన్ని లాభాలున్నా, బ్యాటరీ విషయంలో రాజీపడక తప్పదు. ఎందుకంటే ఇందులో కేవలం 3,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

మరోవైపు, రేజర్ 40 లో వాడిన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్ కాస్త పాతదని చెప్పవచ్చు. ప్రత్యేకించి రూ.35,000 సెగ్మెంట్ లో స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ ప్రాసెసర్స్ గల ఫోన్లు లభిస్తున్నాయి. ఇంకా ఏఐ ఫీచర్స్ తో కూడా వస్తున్నాయి. ఈ ఫోన్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై 1.47-ఇంచ్ సెకండరీ లెన్స్ ఉంది. ఇక ఇదే ధర శ్రేణిలో ఇంకా మంచి ఫోన్లు కూడా ఉన్నాయి.

మీకు కచ్చితంగా, ఫోల్డబుల్ ఫోన్ బడ్జెట్ లో కావాలంటే, అదీనూ శాంసంగ్ లాంటి ఫోల్డబుల్ ఫోన్లను కొనే పరిస్థితి లేకుంటే, మీరు మోటోరోలా రేజర్ 40 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు. ఇక ఆల్టర్నేటివ్స్ విషయానికి వస్తే, OnePlus 12R, iQOO 12, OnePlus Nord 4, iQOO Neo 9 Pro ఉన్నాయి.

The post Motorola Razr 40, Razr 40 Ultra పై రూ.50,000 వరకు డిస్కౌంట్, అమెజాన్‌పై ఆఫర్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-discount-upto-rs-50000-on-amazon-know-full-details/feed/ 0
భారత్ లో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్స్ https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-pro-launched-india-price-specs-availability/ Mon, 03 Jul 2023 15:34:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7044 Motorola Razr 40 మరియు Motorola Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. Motorola Razr 40 Ultra గురించి మాట్లాడితే, ఇది పెద్ద 3.6-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Samsung Galaxy Z Flip 4 5Gకి పోటీనివ్వనుంది. మేము మీకు రెండు ఫోన్‌ల ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. Motorola Razr 40 సిరీస్ ధర, […]

The post భారత్ లో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చిన Motorola Razr 40 Ultra
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Motorola Razr 40 సిరీస్
  • 3.6-ఇంచ్ కవర్ స్క్రీన్ తో వచ్చిన Motorola Razr 40 Ultra

Motorola Razr 40 మరియు Motorola Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. Motorola Razr 40 Ultra గురించి మాట్లాడితే, ఇది పెద్ద 3.6-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Samsung Galaxy Z Flip 4 5Gకి పోటీనివ్వనుంది. మేము మీకు రెండు ఫోన్‌ల ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

Motorola Razr 40 సిరీస్ ధర, లభ్యత

  • రూ.89,999 ధరతో భారత్ లో లాంచైన Motorola Razr 40 Ultra
  • రూ.59,999 ధరతో భారత్ లో లాంచైన Motorola Razr 40

రిలయన్స్ డిజిటల్ మరియు అమెజాన్ ద్వారా Motorola Razr 40 సిరీస్ ఫోన్లు భారత్ లో విక్రయించబడనున్నాయి. ఫోన్ల పై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఆఫర్ ద్వారా యూజర్ అల్ట్రా మోడల్ పై రూ.7,000, స్టాండర్డ్ మోడల్ పై రూ.5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Motorola Razr 40 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400-నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
  • కవర్ డిస్ప్లే: Motorola Razr 40 లో 1.5-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Motorola Razr 40 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Motorola Razr 40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Motorola Razr 40 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, లేజర్ ఆటోఫోకస్ ఉన్నాయి. దీంతో పాటు 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Motorola Razr 40 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
  • ఇతర ఫీచర్లు: Motorola Razr 40 లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

  • మెయిన్ డిస్ప్లే: Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1 హెర్ట్జ్ – 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్10+, 123 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • కవర్ స్క్రీన్: Motorola Razr 40 Ultra లో 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 Ultra లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Motorola Razr 40 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Motorola Razr 40 Ultra లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వీగన్ లెదర్ బ్యాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

The post భారత్ లో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 3 న లాంచ్ అవుతోన్న Moto Razr 40 సిరీస్ https://www.91mobiles.com/telugu/moto-razr-40-razr-40-ultra-launch-date-july-3-key-details/ Fri, 30 Jun 2023 15:43:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7015 మోటోరోలా కంపెనీ లాంచ్ చేయబోయే రెండు ఫోల్డబుల్ ఫోన్ల గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హడావుడి కొనసాగుతోంది. జులై 3 న Moto Razr 40, Moto Razr 40 Ultra ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్లు శాంసంగ్ మరియు ఒప్పో మడతబెట్టే ఫోన్లకు గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. మీకు గనుక Moto Razr 40, Moto Razr 40 Ultra వివరాలు కావాలంటే ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి […]

The post జులై 3 న లాంచ్ అవుతోన్న Moto Razr 40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయబోతోన్న మోటోరోలా
  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న Moto Razr 40 Ultra
  • Moto Razr 40 ప్రారంభ ధర రూ.59,999

మోటోరోలా కంపెనీ లాంచ్ చేయబోయే రెండు ఫోల్డబుల్ ఫోన్ల గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హడావుడి కొనసాగుతోంది. జులై 3 న Moto Razr 40, Moto Razr 40 Ultra ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్లు శాంసంగ్ మరియు ఒప్పో మడతబెట్టే ఫోన్లకు గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. మీకు గనుక Moto Razr 40, Moto Razr 40 Ultra వివరాలు కావాలంటే ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Moto Razr 40 సిరీస్ ధర (లీక్)

Moto Razr 40, Moto Razr 40 Ultra ధరలు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఇండియా పై కనిపించాయి. Moto Razr 40 ధర రూ.59,999 గా ఉంది. మరోవైపు Moto Razr 40 Ultra ధర రూ.75,000 గా ఉంది.

Moto Razr 40 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto Razr 40 ఫోల్డబుల్ ఫోన్ లో 6.9-ఇంచ్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2640*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.47-ఇంచ్ కవర్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 194*368 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto Razr 40 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
  • స్టోరేజీ: Moto Razr 40 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ: Moto Razr 40 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
  • కెమెరా: Moto Razr 40 స్మార్ట్ ఫోన్ 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Moto Razr 40 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post జులై 3 న లాంచ్ అవుతోన్న Moto Razr 40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra https://www.91mobiles.com/telugu/motorola-razr-40-razr-40-ultra-launched-china-price-specs/ Fri, 02 Jun 2023 04:30:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=6590 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా Motorola Razr 40 Ultra, Motorola Razr 40 డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చాయి. వీటిలో బ్యాక్ ప్యానెల్ పైన సెకండరీ డిస్ప్లే ఉంది. Motorola Razr 40 Ultra డివైజ్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి […]

The post 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వచ్చిన Razr 40 Ultra
  • Motorola Razr 40 బేస్ మోడల్ ధర CNY 3,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా తాజాగా Motorola Razr 40 Ultra, Motorola Razr 40 డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ డిజైన్ తో వచ్చాయి. వీటిలో బ్యాక్ ప్యానెల్ పైన సెకండరీ డిస్ప్లే ఉంది. Motorola Razr 40 Ultra డివైజ్ లో 6.9-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 3.6-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 12ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

మరోవైపు Motorola Razr 40 లో 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5-ఇంచ్ సెకండరీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, 64ఎంపి డ్యూయల్-కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 8 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Razr 40, Motorola Razr 40 Ultra ధర, లభ్యత

Motorola Razr 40 అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ధర CNY 3,999 (రూ.46,400) గా ఉంది. 8జిబి/12జిబి మరియు 256జిబి స్టోరేజీ వేరియంట్స్ ధరలు వరుసగా CNY 4,299 (సుమారు రూ.49,900) మరియు CNY 4,699 (సుమారు రూ.54,600) గా ఉంది.

Motorola Razr 40 Ultra డివైజ్ ఇన్‌ఫినిట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ మరియు వివా మజెంటా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ధర CNY 6,499 (సుమారు రూ.75,400) గా ఉంది. ఈ డివైజ్ సేల్ చైనాలో జూన్ 5 నుంచి ప్రారంభమవుతుంది.

Motorola Razr 40 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.9-ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్.
  • కవర్ డిస్ప్లే: 1.5-ఇంచ్ డిస్ప్లే
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, అడ్రెనో 644 జీపీయూ
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ
  • సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • రియర్ కెమెరా: 64ఎంపి ప్రైమరీ, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్
  • ఫ్రంట్ కెమెరా: 32ఎంపి కెమెరా
  • కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, 5జీ, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, గ్లొనాస్, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.
  • బ్యాటరీ, చార్జింగ్: 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ చార్జింగ్, 8 వాట్ వైర్లెస్ చార్జింగ్
  • ఇతర ఫీచర్లు: డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.9-ఇంచ్ ఫ్లెక్సీవ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్
  • కవర్ డిస్ప్లే: 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1000 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్.
  • చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ.
  • ర్యామ్, స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256/512జిబి స్టోరేజీ
  • సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • రియర్ కెమెరా: 12ఎంపి ప్రైమరీ కెమెరా, పీడీఏఎఫ్, ఓఐఎస్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
  • ఫ్రంట్ కెమెరా: 32ఎంపి కెమెరా
  • కనెక్టివిటీ: డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్ 5.3, గ్లొనాస్, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ.
  • బ్యాటరీ, చార్జింగ్: 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5 వాట్ వైర్లెస్ చార్జింగ్.
  • డైమెన్షన్: 170.83 * 73.85 * 6.99మి.మీ
  • బరువు: 188 గ్రాములు
  • ఇతర ఫీచర్లు: ఐపీ52 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

The post 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Motorola Razr 40, Razr 40 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Motorola Razr 40 Ultra అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్; రివీలైన డిజైన్, కలర్ ఆప్షన్స్! https://www.91mobiles.com/telugu/motorola-razr-40-ultra-official-press-images-color-options/ Fri, 12 May 2023 18:16:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=6289 మోటోరోలా సంస్థ ఈ ఏడాదిలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తన ఫోల్డబుల్ ఫోన్ ని కంపెనీ టీజ్ చేసింది. Motorola Razr 40 Ultra అనే పేరుతో ఈ మడతబెట్టే ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. Motorola Razr 40 పేరుతో మరొక ఫోల్డబుల్ ఫోన్ కూడా మోటోరోలా నుంచి రాబోతోంది. తాజాగా Motorola Razr 40 Ultra డివైజ్ యొక్క అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్ లీక్ […]

The post లీకైన Motorola Razr 40 Ultra అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్; రివీలైన డిజైన్, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రానున్న కొన్ని రోజుల్లో లాంచ్ కానున్న Motorola Razr 40 Ultra
  • భారీ ఔటర్ డిస్ప్లేతో వస్తోన్న Motorola Razr 40 Ultra
  • మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్

మోటోరోలా సంస్థ ఈ ఏడాదిలో ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తన ఫోల్డబుల్ ఫోన్ ని కంపెనీ టీజ్ చేసింది. Motorola Razr 40 Ultra అనే పేరుతో ఈ మడతబెట్టే ఫోన్ మార్కెట్ లోకి రానుందని సమాచారం. Motorola Razr 40 పేరుతో మరొక ఫోల్డబుల్ ఫోన్ కూడా మోటోరోలా నుంచి రాబోతోంది. తాజాగా Motorola Razr 40 Ultra డివైజ్ యొక్క అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్ లీక్ అయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Motorola Razr 40 Ultra డివైజ్ యొక్క అఫీషియల్ ఇమేజెస్ ని షేర్ చేశాడు. బ్లాస్ షేర్ చేసిన ఇమేజెస్ ద్వారా కలర్ ఆప్షన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. సరే, ఓసారి Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Razr 40 Ultra యొక్క లీకైన ఇమేజెస్

Motorola Razr 40 Ultra డివైజ్ ఒక ప్రీమియమ్ ఫోల్డబుల్ ఫోన్. చైనాతో పాటు మరో రెండు మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే Motorola Razr 40 Ultra డివైజ్ ఎన్నో అప్‌గ్రేడ్స్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Motorola Razr 40 Ultra లో భారీ ఔటర్ డిస్ప్లే, ఫోల్డబుల్ డిజైన్, 3.26-ఇంచ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి. రేజర్ 2022 2.7-ఇంచ్ కవర్ డిస్ప్లే తో లాంచైంది. ఇక బ్లాస్ షేర్ చేసిన ఇమేజెస్ ద్వారా ఔటర్ స్క్రీన్ సైజ్ తెలియడం లేదు. అయితే ఇతర ఫోల్డబుల్ ఫోన్ల యొక్క ఔటర్ స్క్రీన్ కంటే ఇది కాస్త పెద్దగా ఉందని అంటోంది.

కెమెరా విభాగం

  • డ్యూయల్ రియర్ కెమెరా
  • ఎల్ఈడీ ఫ్లాష్

బ్లాస్ షేర్ చేసిన ఇమేజెస్ ద్వారా Motorola Razr 40 Ultra డివైజ్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభించనున్నట్లు తెలుస్తోంది. అవి: బార్బెర్రీ, బ్లాక్ మరియు బ్లూ. అలాగే Motorola Razr 40 Ultra డివైజ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2640*1080 పిక్సెల్ రెజుల్యూషన్ తో రానుందని సమాచారం. మరికొన్న రిపోర్ట్స్ ద్వారా, Motorola Razr 40 Ultra డివైజ్ 6.9-ఇంచ్ ఫోల్డబుల్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ లేదా 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం.

చిప్సెట్, ర్యామ్

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1
  • 12జిబి ర్యామ్

Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానుందని గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు సమాచారం.

బ్యాటరీ, చార్జింగ్

  • 3640 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్

కెమెరా విభాగం

  • 12ఎంపి సోని ఐఎంఎక్స్563
  • 13ఎంపి ఎస్‌కే హైనిక్స్ హై1336

Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి సోని ఐఎంఎక్స్563 మెయిన్ కెమెరా, 13ఎంపి ఎస్‌కే హైనిక్స్ హై1336 అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.

The post లీకైన Motorola Razr 40 Ultra అఫీషియల్ ప్రెస్ ఇమేజెస్; రివీలైన డిజైన్, కలర్ ఆప్షన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్; స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/motorola-razr-40-ultra-full-specs-leaked-before-launch/ Wed, 03 May 2023 14:35:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=6155 ఇటీవలి కాలంలో Motorola Razr 40 Ultra కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఇమేజెస్ తో పాటు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే కంపెనీ ఇంకా ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. కానీ, ఈ ఫోన్ ఈ నెలలోనే ఏ సమయంలోనైనా లాంచ్ కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా Motorola Razr 40 Ultra డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో […]

The post లీకైన Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్; స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్
  • అమోలెడ్ డిస్ప్లే, 3.5-ఇంచ్ కవర్ డిస్ప్లే తో వస్తోన్న డివైజ్
  • ఇంకా రివీల్ కావాల్సిన Motorola Razr 40 Ultra లాంచ్ తేదీ

ఇటీవలి కాలంలో Motorola Razr 40 Ultra కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క ఇమేజెస్ తో పాటు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే కంపెనీ ఇంకా ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. కానీ, ఈ ఫోన్ ఈ నెలలోనే ఏ సమయంలోనైనా లాంచ్ కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా Motorola Razr 40 Ultra డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. గత నివేదికలను బట్టి, ఈ ఫోల్డబుల్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Motorola Razr 40 Ultra ఫ్లాగ్షిప్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

XDA-Developers రిపోర్ట్ ప్రకారం, Motorola Razr 40 Ultra డివైజ్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

డిస్ప్లే

Motorola Razr 40 Ultra లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3.5-ఇంచ్ కవర్ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా. గత రిపోర్ట్స్ ప్రకారం, మెయిన్ స్క్రీన్ 6.7-ఇంచ్ ఉంటుందని తెలుస్తోంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో రానుందని అంచనా వేస్తున్నారు. ఇతర ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో కూడా ఈ ఫోన్ వచ్చే చాన్స్ ఉంది.

ఓఎస్

Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్

Motorola Razr 40 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 3640 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

కెమెరా విభాగం

Motorola Razr 40 Ultra లో 12ఎంపి సోని ఐఎంఎక్స్563 ప్రైమరీ కెమెరా, 13ఎంపి ఎస్‌కే హైనిక్స్ హై1336 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయని సమాచారం. ఈ డివైజ్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయని గత రిపోర్ట్స్ తెలిపాయి.

కనెక్టివిటీ, కలర్ ఆప్షన్స్

Motorola Razr 40 Ultra యొక్క కనెక్టివిటీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, ఎన్‌ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి. Motorola Razr 40 Ultra డివైజ్ బ్లాక్, బ్లూ మరియు బర్బెరీ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. లాంచ్ తేదీ తదితర వివరాలను మోటోరోలా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

The post లీకైన Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్; స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>