OnePlus 11 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 27 Aug 2024 06:48:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 11 5G పై రూ.23,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-gets-huge-discount-of-rs-23000-know-the-details/ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-gets-huge-discount-of-rs-23000-know-the-details/#respond Tue, 27 Aug 2024 06:28:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=13174 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 పై మంచి డీల్ యూజర్లను ఊరిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ అనుభూతి పొందాలనుకునే వారికి ఈ ఆఫర్ సరైనదని చెప్పవచ్చు. ఏకంగా రూ.23,000 తక్కువకి ఈ ఫోన్ విక్రయించబడుతోంది. ప్రస్తుం షాపింగ్ సైట్ అమెజాన్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఓసారి వన్‌ప్లస్ 11 యొక్క కొత్త ధర మరియు […]

The post OnePlus 11 5G పై రూ.23,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus 11 5G పై భారీ డిస్కౌంట్
  • రూ.23,000 వరకు తగ్గింపు
  • 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 పై మంచి డీల్ యూజర్లను ఊరిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ అనుభూతి పొందాలనుకునే వారికి ఈ ఆఫర్ సరైనదని చెప్పవచ్చు. ఏకంగా రూ.23,000 తక్కువకి ఈ ఫోన్ విక్రయించబడుతోంది. ప్రస్తుం షాపింగ్ సైట్ అమెజాన్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఓసారి వన్‌ప్లస్ 11 యొక్క కొత్త ధర మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus 11 5G ఆఫర్ వివరాలు

OnePlus 11 5G 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ అమెజాన్ పై కేవలం రూ.38,999 కే విక్రయించబడుతోంది.

వన్‌ప్లస్ ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.23,000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ పై అందుబాటులో లేదు.

రూ.23,000 భారీ డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా యూజర్లకు లభిస్తోంది.

మీ పాత ఫోన్ మార్చుకుని రూ.31,500 వరకు బోనస్ పొందవచ్చు. మీ ఫోన్ కండీషన్ పై ఈ బోనస్ విలువ ఆధారపడి ఉంటుంది.

  • OnePlus 11 5G యొక్క పాత ధర రూ.61,999 గా ఉంది.
  • OnePlus 11 5G యొక్క డిస్కౌంట్ ధర రూ.38,999 గా ఉంది. ఆఫర్లను చూసేందుకు, ఇక్కడ క్లిక్ చేసి అమెజాన్ సైట్ కు వెళ్ళండి.

OnePlus 11 5G కొనవచ్చా?

2023 లో రూ.61,999 ధరతో లాంచ్ అయిన OnePlus 11 5G ని ప్రస్తుతం రూ.38,999 కి కొనడం లాభమేనని చెప్పవచ్చు. మీకు ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ లభిస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది. అలాగే 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

OnePlus 11 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus 11 5G లో 6.7-ఇంచ్ క్వాడ్‌హెచ్డీ+ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ స్క్రీన్, 20.1:9 యాస్పెక్ట్ రేషియో, 3216*1440 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus 11 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: OnePlus 11 5G స్మార్ట్‌ఫోన్‌లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందించారు.

కెమెరా: OnePlus 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 11 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OnePlus 11 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OnePlus 11 5G పై రూ.23,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-gets-huge-discount-of-rs-23000-know-the-details/feed/ 0
Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/amazon-great-freedom-festival-sale-2023-best-deals-offers/ Fri, 04 Aug 2023 05:43:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=7464 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో […]

The post Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుంచి మొదలైంది. ఈ సేల్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. సేల్ సందర్భంగా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్, ఆఫర్స్ లభించనున్నాయి. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ క్రింద, స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక్కడ మీకోసం ఉత్తమమైన స్మార్ట్ ఫోన్స్ డీల్స్ యొక్క జాబితాను రూపొందించాం. ఓసారి వాటిని పూర్తిగా చదివి మీకు సరిపడే డీల్ ఏదైనా ఉందో లేదో చెక్ చేయండి. ఏదైనా ఓకే అనిపిస్తే ఆ ఉత్పత్తిని ఆఫర్ ముగిసే లోపు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి.

OnePlus 11 5G

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సేల్ లో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.7-ఇంచ్ క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

అసలు ధర: రూ.56,999
డీల్ ధర: రూ.54,999

Apple iPhone 14

ఈ డిస్కౌంట్ సేల్ సందర్భంగా iPhone 14 ని కూడా తక్కువ ధరకి కొనుగోలు చేయవచ్చు. iPhone 14 లో ఏ15 బయోనిక్ చిప్, 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 12ఎంపి ప్రైమరీ + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 12ఎంపి ఫ్రంట్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, ఐపీ68 వాటర్ రెసిస్టంట్, గ్లాస్ బ్యాక్ ఉన్నాయి. 6 కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

అసలు ధర: రూ.79,900
డీల్ ధర: రూ.67,499

Samsung Galaxy S20 FE 5G

మీరు గనుక ఒక మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Samsung Galaxy S20 FE 5G డివైజ్ ఒకటుంది. సేల్ లో ఈ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy S20 FE 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 చిప్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 1టిబి ఎక్స్‌పాండబుల్ మెమొరీ (మైక్రోఎస్డీకార్డ్ ద్వారా), 12ఎంపి ప్రైమరీ + 8ఎంపి టెలీఫోటో + 12ఎంపి అల్ట్రావైడ్ రియర్ కెమెరాలు, 30ఎక్స్ స్పేస్ జూమ్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.26,999
డీల్ ధర: రూ.24,999

ఆడియో ఉత్పత్తులపై డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఆడియో ప్రొడక్ట్స్ పై మంచి డీల్స్ ఉన్నాయి. OnePlus Bullets Z1 నెక్ బ్యాండ్ ని సేల్ లో రూ.1,599 కే కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy Buds 2 Pro ని డిస్కౌంట్ పై రూ.10,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా OPPO Enco Air 3 Pro వైర్లెస్ ఇయర్‌బడ్స్ ని రూ.4,999 కే కొనుగోలు చేయవచ్చు. pTron Bassbuds Duo ని కేవలం రూ.499 కే కొనుగోలు చేయవచ్చు.

The post Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఉన్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-oneplus-buds-pro-2-india-first-sale-today-via-amazon/ Tue, 14 Feb 2023 05:09:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4906 గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది. భారత్ లో OnePlus […]

The post First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో నేడు ఫస్ట్ సేల్ కి వచ్చిన OnePlus 11, OnePlus Buds Pro 2
  • భారత్ లో OnePlus 11 ధర రూ.56,999, OnePlus Buds Pro 2 ధర రూ.11,999
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చిన OnePlus 11 స్మార్ట్ ఫోన్

గతవారం జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్ లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OnePlus తన ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 తో పాటు బడ్స్ ప్రో 2, వన్‌ప్లస్ 11ఆర్ ని భారత్ లో లాంచ్ చేసింది. వీటి నుంచి నేడు OnePlus 11 మరియు OnePlus Buds Pro 2 సేల్ కి వచ్చాయి. OnePlus 11 డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది.

భారత్ లో OnePlus 11, OnePlus Buds Pro 2 ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

OnePlus 11 హ్యాండ్సెట్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.56,999 గా ఉంది. 16జిబి + 256జిబి యూనిట్ ధర రూ.61,999 గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

నేడు అనగా ఫిబ్రవరి 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ స్టోర్ ద్వారా OnePlus 11 సేల్ మొదలవుతుంది.

భారత్ లో OnePlus Buds Pro 2 ధరను రూ.11,999 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా వన్‌ప్లస్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ఈఎంఐ, నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ కార్డ్ (ఈఎంఐ) లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్ అందిస్తోంది. నేడు అనగా ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వన్‌ప్లస్ స్టోర్ ద్వారా OnePlus Buds Pro 2 ని కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11 స్పెసిఫికేషన్స్

OnePlus 11 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉన్నాయి. వన్‌ప్లస్ కెమెరా విభాగం కోసం హేజల్‌బ్లడ్ తో కలిసి పని చేసింది.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: నేడే OnePlus 11, OnePlus Buds Pro 2 ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌, 16జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11 5G https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-launched-india-price-specs-availability/ Tue, 07 Feb 2023 14:20:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4829 OnePlus లవర్స్ ఎదురు చూస్తోన్న సమయం వచ్చేసింది. నేడు భారత్ లో వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 11 5G లాంచ్ అయ్యింది. OnePlus 11 5G తో పాటు OnePlus 11R 5G కూడా మార్కెట్ లోకి వచ్చింది. వన్ ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కి భారత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఫోన్స్ స్థాయిలో వన్ ప్లస్ డివైజెస్ కి భారీ డిమాండ్ ఉంది. తాజాగా లాంచైన […]

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌, 16జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన వన్‌ప్లస్ బ్రాండ్ ఫ్లాగ్షిప్ డివైజ్ OnePlus 11 5G
  • 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఈ4 ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 వాట్ చార్జింగ్ తో వచ్చిన OnePlus 11 5G
  • భారత్ లో OnePlus 11 5G ధర రూ.56,999 నుంచి ప్రారంభం

OnePlus లవర్స్ ఎదురు చూస్తోన్న సమయం వచ్చేసింది. నేడు భారత్ లో వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ సిరీస్ OnePlus 11 5G లాంచ్ అయ్యింది. OnePlus 11 5G తో పాటు OnePlus 11R 5G కూడా మార్కెట్ లోకి వచ్చింది. వన్ ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ కి భారత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆపిల్ ఫోన్స్ స్థాయిలో వన్ ప్లస్ డివైజెస్ కి భారీ డిమాండ్ ఉంది. తాజాగా లాంచైన ఫ్లాగ్షిప్ సిరీస్ తో వన్ ప్లస్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి. ఇక OnePlus 11 5G స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 16జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది.

OnePlus 11 5G డిజైన్, చిప్సెట్

వన్ ప్లస్ 11 5జీ యూనిబాడీ డిజైన్, కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. టైటాన్ బ్లాక్, ఎటర్నల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

OnePlus 11 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వచ్చింది. 16gb ఎల్పీడీడీఆర్5ఎక్స్ వరకు ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో ఈ ఫోన్ ఎక్విప్ అయ్యింది. 100 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. డ్యూయల్ వైఫై యాక్సలరేషన్, వై-ఫై 7 కనెక్టివిటీతో వన్ ప్లస్ 11 5జీ వచ్చింది.

OnePlus 11 5G స్పెసిఫికేషన్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ 2కే అమోలెడ్ డిస్ప్లే
  • 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ
  • 50ఎంపి + 48ఎంపి + 32ఎంపి రియర్ కెమెరా
  • 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

OnePlus 11 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి సోని ఐఎంఎక్స్471 సెన్సర్ ఉన్నాయి. వన్‌ప్లస్ కెమెరా విభాగం కోసం హేజల్‌బ్లడ్ తో కలిసి పని చేసింది.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100  వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ లో వై-ఫై 7, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

OnePlus 11 5G ధర, లభ్యత

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి యూఎఫ్ఎస్3.1 ధర రూ.56,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్4.0 స్టోరేజీ వేరియంట్ ధర రూ.61,999 గా ఉంది. నేడు రాత్రి 9 గంటల నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 14 నుంచి ఓపెన్ సేల్ మొదలవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌, 16జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OnePlus 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 11 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్ https://www.91mobiles.com/telugu/oneplus-11-5g-india-launch-event-february-7th-2023/ Tue, 20 Dec 2022 06:48:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=4076 హైలైట్స్ న్యూఢిల్లీలో ఫిబ్రవరి 7 న జరగనున్న OnePlus 11 లాంచ్ ఈవెంట్ OnePlus 11 5G తో పాటు లాంచ్ కానున్న OnePlus Buds Pro 2 హాజెల్ బ్లడ్ కెమెరాలు, అలర్ట్ స్లైడర్ తో వస్తోన్న వన్‌ప్లస్ 11 5జీ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 32ఎంపి 2ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్, 8 జెన్ 2 చిప్ ప్రధాన ఆకర్షణలు భారత్ లో OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 న లాంచ్ […]

The post OnePlus 11 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • న్యూఢిల్లీలో ఫిబ్రవరి 7 న జరగనున్న OnePlus 11 లాంచ్ ఈవెంట్
  • OnePlus 11 5G తో పాటు లాంచ్ కానున్న OnePlus Buds Pro 2
  • హాజెల్ బ్లడ్ కెమెరాలు, అలర్ట్ స్లైడర్ తో వస్తోన్న వన్‌ప్లస్ 11 5జీ
  • క్యూహెచ్డీ+ డిస్ప్లే, 32ఎంపి 2ఎక్స్ జూమ్ టెలీఫోటో లెన్స్, 8 జెన్ 2 చిప్ ప్రధాన ఆకర్షణలు

భారత్ లో OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 7 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో తెలిపింది. వెబ్ సైట్ లో డెడికేటెడ్ పేజీని మనం గమనించవచ్చు. లాంచ్ ఈవెంట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనుంది. వన్ ప్లస్ వెబ్ సైట్ లో OnePlus 11 5G యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. హాజెల్ బ్లడ్ కెమెరాలు, అలర్ట్ స్లైడర్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి. రానున్న రోజుల్లో OnePlus 11 5G కి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

వన్‌ప్లస్ 11 5జి ఇండియా లాంచ్ తేదీ ప్రకటన

OnePlus 11 5G లాంచ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 7 న న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నట్లు వన్ ప్లస్ సంస్థ ప్రకటించింది. రాత్రి 7.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ ని యూట్యూబ్ లో లైవ్ చూసే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 11 5జి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OnePlus 11 5G కి సంబంధించి ఇప్పటివరకు డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన టీజర్ తో భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ రివీల్ అయ్యింది. ఈ తరహా లుక్ ని గత నెలలో ప్రముఖ టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ లీక్ చేసింది. ఇక OnePlus 11 5G రియర్ కెమెరా మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఇప్పటికైతే ఫోన్ యొక్క డిస్ప్లే లుక్ కనిపించలేదు. అయితే పంచ్-హోల్ కటౌట్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుందని మేం కచ్చితంగా చెప్పగలం. ఇంకా కర్వ్డ్ స్క్రీన్, స్లిమ్ బెజెల్స్ కూడా ఉండనున్నాయి.

OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ తో రానుంది.

OnePlus 11 5G కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 చిప్సెట్, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 2x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. OnePlus 11 5G లో 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OnePlus 11 5G ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన వన్‌ప్లస్ first appeared on 91Mobiles Telugu.

]]>